Categories: న్యూస్

‘అహింస’ ఫస్ట్ సింగిల్ విడుదల

క్రియేటివ్ జీనియస్ తేజ ప్రస్తుతం ‘అహింస’ అనే యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో నూతననటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఈ సినిమా ప్రొమోషన్స్ ని చాలా వినూత్నంగా చేస్తున్నారు. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘నీతోనే నీతోనే’ పాట ని విడుదల చేశారు. ఆర్‌పి పట్నాయక్ ఈ పాటని మనసుని హత్తుకునే మెలోడిగా కంపోజ్ చేశారు. సిద్ శ్రీరామ్ తన బ్రిలియంట్ వాయిస్ తో మెస్మరైజ్ చేయగా, సత్య యామిని వాయిస్ పాటకు మరింత మాధుర్యాన్ని ఇచ్చింది.

♫కలలో అయినా
కలయికలో అయినా
కలిసుండని కాలాలైనా
నీతోనే నీతోనే.. నేనెపుడు
నాతోనే నాతోనే నువ్వేపుడు ♫
ఈ పాటకు చంద్రబోస్ అందించిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఆకట్టుకుంది.

ఈ చిత్రంతో అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. గీతిక కథానాయికగా నటిస్తోంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

చాలా కాలం తర్వాత, తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఆర్‌పి పట్నాయక్‌ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ‘అహింస’ కోసం కలిసింది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు. అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందించగా, సుప్రియ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

సదా, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తారాగణం: అభిరామ్, గీతిక, రజత్ బేడీ, సాధా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు.

తారాగణం: అభిరామ్, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు

సాంకేతిక విభాగం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
నిర్మాత: పి కిరణ్
బ్యానర్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
డీవోపీ : సమీర్ రెడ్డి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్: అనిల్ అచ్చుగట్ల
సాహిత్యం: చంద్రబోస్
ఆర్ట్: సుప్రియ
యాక్షన్ డైరెక్టర్: బివి రమణ
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫీ: శంకర్
సిజి: నిఖిల్ కోడూరి
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఘనంగా “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్, ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

10 hours ago

ఈ సంక్రాంతి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది: ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సవ వేడుకలో స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక…

15 hours ago

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…

1 day ago

హీరోలు సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

1 day ago

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…

1 day ago