దర్శకుడు ఎస్. కిరణ్ కుమార్ ఇంటర్వ్యూ

Must Read

క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గా రూపొందుతున్న చిత్రం జాన్ సే. చిత్ర పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేకపోయినా కేవలం సినిమా మీద ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్. క్రితి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ No 1 గా ‘జాన్ సే’ టైటిల్ తో కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లో జాన్ సే తెరకెక్కుతోంది. అంకిత్, తన్వి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న జాన్ సే లో థ్రిల్లింగ్ అంశాలతో పాటు లవ్ స్టొరీ కూడా కీ రోల్ ప్లే చేస్తుందని దర్శకుడు కిరణ్ కుమార్ చెప్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సచిన్ కమల్ సంగీతాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రముఖ యాంకర్ మంజూష తో చిత్ర విశేషాలు, తన ఆలోచనలు పంచుకున్నారు. 

జాన్ సే టైటిల్ చూస్తే ఇది ప్రేమ కథ లా అనిపిస్తుంది. కానీ ఇది క్రైమ్ థ్రిల్లర్ అంటున్నారు ?

– క్రైమ్ థ్రిల్లర్ స్టొరీ నే అయినా మంచి లవ్ స్టొరీ కూడా ఉంది. టైటిల్ కూడా రెండు రకాలుగా ఉంటుంది. జాన్ సే అనేది ప్రేమను రిఫ్లెక్ట్ చేసే హిందీ టైటిల్ లాగా జాన్ Say (చెప్తుంది) అనేది ఇంకో లాగా సౌండింగ్ ఉంటుంది. 

సక్సెస్ ఫుల్ జాబ్, బిజినెస్ లో ఉన్న మీకు సినిమా లోకి రావాలన్న ఆలోచన ఎలా స్టార్ట్ అయింది ?

– నేను అనుకునే కథలను, ఆలోచనలను సినిమా రూపంలో చెప్పాలనే ఆసక్తే నన్ను దర్శకుడిని చేసింది. ఈ జాన్ సే లైన్ ను తొమ్మిది సంవత్సరాల నుండి అనుకుంటున్నాను. ఆరు నెలల క్రితం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. 

మొదటి సినిమా క్రైమ్, లవ్ స్టొరీ తో వస్తున్నారు. మీ నుండి ముందు ముందు ఎలాంటి కథలు ఎక్స్ పెక్ట్ చేయొచ్చు ?

– అన్ని రకాల జానార్స్ లో కథలతో చిత్రాలు చేసి ఆల్ రౌండర్ గా ఉండాలనేది నా కోరిక. 

మీకు చిత్ర పరిశ్రమ తో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఎక్కడా వర్క్ చేయకపోయినా మీ కథను నమ్ముకుని చిత్రం తీస్తున్నారు. ఏ నమ్మకంతో సినిమా మొదలుపెట్టారు?

– కథే నన్ను నడిపించింది. మొదట్లో తీయొచ్చు అనుకున్నాను కానీ పోను పోను అర్థమవుతోంది ఇది ఒక పెద్ద సముద్రం అంత ప్రాసెస్ అని. అలా తెలుసుకుంటూనే షూటింగ్ పూర్తి చేశాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఛాలెంజస్ ను ఫేస్ చేయడం నాకు నచ్చుతుంది. లైఫ్ లో రిస్క్ తీసుకోకపోతే ముందుకు వెళ్లలేం అని నమ్ముతాను. ఆ నమ్మకంతోనే ఈ సముద్రాన్ని ఈదుతున్నాను.

కొత్త దర్శకుడిగా చిత్ర నిర్మాణంలో మీరు ఎదుర్కున్న ప్రాబ్లమ్స్ ఏంటి?

– కొత్తగా వచ్చి సినిమా తీస్తున్నప్పుడు సమస్యలు ఉంటాయి. చాలా మందికి డౌట్స్ ఉండేవి. ఇతను సరిగా చేస్తాడా లేదా అనే డైలమా లో ఉండేవారు కొందరు. నా మీద నమ్మకం ఉంచి చిత్రం చేస్తాం అని ముందుకు వచ్చిన వారితోనే సినిమా చేశాను.

జాన్ సే సినిమా ఎలా ఉండబోతోంది. ఏ తరహా ఆడియెన్స్ కి ఇది ఎక్కువ రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ?

– సినిమా మనం రోజూ చూసే ప్రజల జీవితాలకి దగ్గిరగా ఉంటుంది. ఒక ఫిక్షనల్ క్యారక్టర్ ను తీసుకుని ప్రజెంట్ సొసైటీ లో పెట్టాను. ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి తెలివున్న, ఝాన్సి లక్ష్మీబాయి తెగువ కలిసి ఉండే అమ్మాయి ఈ సొసైటీలో ఎలా ఫేస్ చేస్తుంది అనేది మెయిన్ లైన్. 

ఈ పాత్రలను తీసుకుని క్యారెక్టరైజేషన్ చేయాలని ఎందుకు అనిపించింది. ఇన్స్పిరేషన్ ఉందా ?

– నేను స్వతహాగా సివిల్ ఇంజనీర్ అవడం వలన పాత్ర రాసుకునెప్పుడు ఆ క్వాలిటీస్ ఉండేవి. నాకు సినిమా విషయంలో సహాయపడిన మదన్ అనే వ్యక్తి ఇది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పోలి ఉందని చెప్పినప్పుడు ఆయన ఏంగిల్ నుండి తీసుకున్నాం. ధైర్య సాహసాలు లాంటి లక్షణాలు అనుకున్నప్పుడు ఝాన్సి లక్ష్మీబాయి నీ స్ఫూర్తిగా తీసుకుని ఆ పాత్రను చేశాం.

రాసుకున్న స్క్రిప్ట్ ను తెరకెక్కించేప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ?

– నాకు కెమెరా ఏంగిల్స్, క్లోజ్ అప్ లంటివి తెలీదు కాబట్టి కొన్ని రోజులు ఇన్స్టిట్యూట్ కి వెళ్లి తెలుసుకున్నాను. తర్వాత అభువజ్ఞులైన టెక్నీషియన్స్ తో షూటింగ్ మొదలు పెట్టాను. మొదటి రోజే బేసిక్స్ మీద అవగాహన వచ్చింది.

ప్రేక్షకుడి గా ఏ దర్శకుడి సినిమాలు ఇష్టపడుతారు?

– అందరి సినిమాలు చూస్తాను కానీ పూరి జగన్నాథ్ గారివి అంటే ఇష్టం. కానీ దర్శకుడిగా నా సొంత మార్క్ ఉండాలనుకుంటాను.

మీ టీం, నటీ నటుల నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది?

– అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళందరి సపోర్ట్ తోటి 22 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాను.

ప్రస్తుత ఓటీటీ ఏజ్ లో సినిమాలో ప్రత్యేకత ఉంటేనే ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారు జాన్ సే లో ఆ ప్రత్యేకత ఏంటి?

– స్టొరీ. ఈ సినిమాకి కథే ప్రధాన బలం. ఆడియెన్స్ కి నచ్చేలా ఉంటుంది. వాళ్ళను థియేటర్ కి రప్పించడానికి మంచి ప్రమోషన్స్ ప్లాన్ చేశాము. వన్స్ థియేటర్ కి వచ్చాక సినిమాతో వాళ్ళని ఆకట్టుకుంటామనే నమ్మకం ఉంది. 

సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు?

– ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఒక రెండు నెలల్లో రిలీజ్ ఉంటుంది. షూటింగ్ అయ్యేవరకు ఎవరితోనూ బిజినెస్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆ విషయాలు చూసుకోవాలి.

మ్యూజికల్ గా ఎలా ఉంటుంది జాన్ సే?

– సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మొత్తం మూడు పాటలు ఉంటాయి. కథలో భాగంగా రెండు పాటలు ఒక థీమ్ సాంగ్ ఉంటుంది. సచిన్ కమల్ మంచి సంగీతం ఇచ్చారు.

బడ్జెట్ ఎంత అనుకున్నారు, అనుకున్న బడ్జెట్ లో సినిమా కంప్లీట్ అయిందా?

– నేను 10 కోట్ల బడ్జెట్ అనుకున్నాను. అనుకున్న దానికంటే తక్కువలోనే పూర్తి చేయగలిగాను. 

షూటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు?

– ఆర్టిస్ట్స్ డేట్స్ అడ్జెస్ట్ అవకపోవడం, ఒక రెస్టారెంట్ సీన్ కోసం టైం లిమిట్ ఉండడం లాంటి చిన్న చిన్న ఇష్యూస్ తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఎదురవలేదు.

సీనియర్ యాక్టర్స్ ఉన్నారా అందరూ కొత్తవారితో తీశారా?

– తనికెళ్ళ భరణి గారు, సూర్య గారు, అజయ్ గారు, బెనర్జీ గారు, ఐ డ్రీమ్ అంజలి గారు లాంటి ఆర్టిస్టులు ఉన్నారు. 

మీ జర్నీ లో ఎవరు మీకు బాగా సపోర్ట్ చేశారు?

– మా కెమెరామన్ మోహన్ గారు బాగా సపోర్ట్ చేశారు. ఆయన చివరి వరకు ఉండి అన్ని చూసుకున్నారు. ప్రొడ్యూసర్ రఘు గారు కూడా బాగా సపోర్ట్ చేశారు.

మీ నుండి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చా?

– నేను డబ్బులు ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయడంలేదు. నేను ఈ సినిమాకి పెట్టిన డబ్బు వచ్చేస్తే మరో సినిమా మొదలు పెట్టేస్తాను. సినిమా నీ సాధ్యం అయినంత వరకు ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయాలి.

దర్శకుడిగా, నిర్మాతగా అన్నీ మీరే దగ్గరుండి జాన్ సే ను నిర్మించారు. ఈ ప్రయాణంలో బాగా కష్టం అనిపించిన అంశం ఏంటి?

– మన పనికి అవసరమైన వాళ్ళను, సరైన వాళ్ళను ఎన్నుకోవడమే అన్నిటి కంటే కష్టం, ముఖ్యం కూడా. అప్పుడే మనం అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేయగలం.

మీ ఇంట్లో వాళ్లకు సినిమా చూపించారా. వాళ్ళ రియాక్షన్ ఎంటి?

– మా ఆవిడ కి కథ తెలుసు. ఎంతో నచ్చింది, తనకి నచ్చింది కాబట్టే కన్విన్స్ అయ్యి నేను ఈ రిస్క్ తీసుకోవడానికి ఒప్పుకుంది. సినిమా కంప్లీట్ అయ్యాక చూపిస్తాను.

జాన్ సే టైటిల్ చివర త్రీ డాట్స్ ఉన్నాయి. వాటికి ప్రత్యేకత ఏమైనా ఉందా ?

– అవును. ఆ త్రీ డాట్స్ ముగ్గురు వ్యక్తుల జీవితాల్ని ఇండికేట్ చేస్తాయి. అందులో ఇద్దరి పాత్రలను త్వరలో పరిచయం చేస్తాను. మూడో పాత్ర మాత్రం సస్పెన్స్. సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

Latest News

ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్ హీరోహీరోయిన్లుగా "మర్రిచెట్టు కింద మనోళ్ళు"...

More News