“లవ్ గురు” ఫెంటాస్టిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – హీరో విజయ్ ఆంటోనీ

Must Read

సరికొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. తను నటించిన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ టాలెంటెడ్ హీరో. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “లవ్ గురు”. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటించిన చిత్రమిది. “లవ్ గురు” సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా “లవ్ గురు” సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని హైలైట్స్ ను ఇంటర్వ్యూలో తెలిపారు విజయ్ ఆంటోనీ.

  • నేను పర్సనల్ లైఫ్ లో, కెరీర్ లో ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించను. వర్తమానంలోనే ఉంటాను. మనం ఒకటి కోరుకుంటే ఇంకొకటి దక్కవచ్చు. అప్పుడు నిరాశపడతాం. మనకు ఏది కావాలో, ఏది ఇవ్వాలో యూనివర్స్ చూసుకుంటుంది. ఈ సినిమా విషయంలోనూ అలాగే ఆలోచించా. కథ బాగా నచ్చింది. సినిమా రూపొందించాం. లవ్ గురు కథ విన్నప్పుడు ఈ సినిమా సాధించబోయే విజయం మీద నమ్మకం కలిగింది. అదే విషయాన్ని దర్శకుడు వినాయక్ కు చెప్పాను. నా కెరీర్ లో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాను. ఈ మూవీ కూడా సక్సెస్ అవుతుందనే హోప్ ఉంది. సినిమా అనేది బిడ్డ లాంటిది. మనం ఆ బిడ్డ బాగు కోసం చేయాల్సినవన్నీ చేయాలి. మా టీమ్ కూడా అలాగే మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నించాం.
  • లవ్ గురులో ఫెంటాస్టిక్ ఫ్యామిలీ కామెడీ చూస్తారు. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూశాక మీ జీవిత భాగస్వామిని ప్రేమించడం ఎలాగో తెలుసుకుంటారు. ప్రేమ అనేది లావాదేవీ కాదు ఒకటి ఇస్తే మరొకటి తిరిగి ఇవ్వడానికి. మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే ప్రేమ. లవ్ గురులో ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అదిప్పుడు రివీల్ చేయలేను. స్క్రీన్ మీద చూడాలి. దర్శకుడు తన లైఫ్ లో చూసిన అనుభవాలతో ఈ కథను రెడీ చేశాడు. ఆ కథ నన్ను ఆకట్టుకుంది.
  • లవ్ గురు అనేది ఈ సినిమాలోని ఒక క్యారెక్టర్ గురించి పెట్టిన టైటిల్ కాదు. మొత్తం సినిమానే లవ్ గురు. ఈ సినిమా చూశాక ప్రేమించడం ఎలాగో నేర్పిస్తుంది. హీరో హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు. ఆమె అతన్ని లవ్ చేయడం లేదని మొదట తెలియదు. కొన్ని రోజులకు అతనంటే ఆమెకు ఇష్టం లేదని తెలుస్తుంది. అయితే మరికొద్ది రోజులు ఆగితే తనను అర్థం చేసుకుని ప్రేమిస్తుందని ఆశిస్తాడు హీరో. కానీ ఆమె ఎప్పటికీ అతన్ని ప్రేమించదు. అప్పుడు హీరో ఏం చేశాడు, వారి మధ్య రిలేషన్ ఎలా సాగింది అనేది ఇంట్రెస్టింగ్ గా సాగే లవ్ గురు స్టోరీ లైన్.
  • మనల్ని మనం ప్రేమించుకుంటే మిగతా వారినీ ప్రేమిస్తాం. తోటి వారిని ప్రేమిస్తే చివరకు అది మనకే మంచి చేస్తుంది. మన శరీరం ఎన్నో ఎంజైమ్స్, విటమిన్స్ ఇస్తూ మనల్ని కాపాడుతుంది. మనలో సానుకూల దృక్పథం ఉన్నప్పుడే శరీరం స్పందించే తీరు బాగుంటుంది. అందుకే నెగిటివ్ పీపుల్ తో ఉన్నా మనం పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. ఒకరు నిన్ను మోసం చేసినా చివరకు తప్పు తెలుసుకుంటారు. ఈ కథలో హీరో క్యారెక్టర్ కూడా ప్రేమను పంచుతుంది. ప్రేమిస్తుంది. అతన్ని ద్వేషించినా వారిని లవ్ చేస్తుంది.
  • ఈ సినిమాలో డైలాగ్స్ చాలా సహజంగా ఉంటాయి. దర్శకుడు వినాయక్ న్యాచురల్ గా డైలాగ్స్ రాశారు. భార్య భర్తలు ఎలా మాట్లాడుకుంటారో అలాగే ఉంటాయి. అయితే నా దృష్టిలో మాటల కన్నా ఆ మాటల్లోని భావం ముఖ్యం. లవ్ గురులో ఆ సీన్ లో చెప్పాల్సిన మ్యాటర్ ను డైలాగ్స్ పర్పెక్ట్ గా ప్రేక్షకులకు కన్వే చేస్తాయి.
  • మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా లవ్ గురు సినిమాను రిలీజ్ చేస్తుండటం సంతోషంగా ఉంది. నేను ఎప్పటినుంచో ఈ సంస్థతో అసోసియేట్ అవడానికి ఎదురుచూస్తున్నాను. సినిమా పట్ల ప్యాషన్ ఉన్న బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్. నేను తమిళంలో మూవీస్ చేస్తుంటాను. ఇక్కడ రిలీజ్ కు సరైన వాళ్లు దొరకక ఇబ్బందులు పడ్డాను. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ తో ఇకపైనా మా రిలేషన్ కొనసాగుతుంది.
  • నాకు మెమొరీ పవర్ తక్కువ. తెలుగు భాష నేర్చుకోలేకపోయాను. నాకు తెలుగు వచ్చి ఉంటే తెలుగులోనే నేరుగా సినిమాలు చేసేవాడిని. అలాంటి అవకాశం ఉంటే చెన్నై వదిలి వచ్చి ఇక్కడే సినిమాలు చేస్తా. నేనొక సినిమా చేస్తే ఆ సినిమాకు నిర్మాణ బాధ్యతలు, ఎడిటింగ్, నటించడం, అన్ని భాషల్లో ప్రమోషన్ చేయడం వీటికే టైమ్ సరిపోతోంది. నేను ఫ్యూచర్ లో ఎంత గొప్ప సినిమా చేసినా అది బిచ్చగాడు సినిమా కంటే గొప్ప మూవీ కాలేదు. అయితే లవ్ గురు కూడా నాకు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని అందిస్తుంది. ఇందులో లేడీస్ సెంటిమెంట్ ఉంటుంది.
  • బిచ్చగాడు సినిమాతో చూస్తే కనీసం 80 శాతం ఎమోషన్ లవ్ గురు కథలోనూ ఉంది. 2026 సమ్మర్ లో బిచ్చగాడు 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నా. నా కెరీర్ లో బిచ్చగాడు 3 బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. ఈ సినిమాకు నేనే దర్శకత్వం చేస్తాననుకుంటా. ప్రస్తుతం మా ప్రొడక్షన్ మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఒకటి అక్టోబర్ లో మరొకటి సంక్రాంతికి ఇంకో సినిమా నెక్ట్ సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నాం.

Latest News

ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్ హీరోహీరోయిన్లుగా "మర్రిచెట్టు కింద మనోళ్ళు"...

More News