‘ఒకే ఒక జీవితం’ : హీరో శర్వానంద్ ఇంటర్వ్యూ

Must Read

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో హీరో శర్వానంద్ విలేఖరుల సమవేశంలో పాల్గొని సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు.

ఒకే ఒక జీవితం విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
ఆనందంగా వుంది. సెన్సిబుల్ సినిమా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాకి కనెక్ట్ అవ్వాలని బలంగా అనుకున్నాం. మేము ఊహించినట్లే సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. దీంతో ఒక బరువు దిగిందనే భావన కలిగింది. అదే సమయంలో కొత్త చేయబోయే సినిమాల గురించి కొంత కంగారు మొదలైయింది(నవ్వుతూ).

టైం ట్రావెల్ అంటే రిస్క్ కదా.. ప్రేక్షకులు ఎలా సింక్ అవుతారని భావించారు ?
ప్రేక్షకుల కంటే విమర్శకులు ఎలా రియాక్ట్ అవుతారనే భయం వుండేది(నవ్వుతూ). ఇలాంటి కథల్లో లాజిక్కులు వెదకడం సులువు. అయితే లక్కీగా విమర్శకులకు కూడా సినిమా నచ్చింది. స్ట్రాంగ్ కంటెంట్ వుండటంతో అందరికీ నచ్చింది. దర్శకుడు హను అయితే ఈ సినిమా పిల్లలకి ఎక్కువ చూపించాలని చెప్పారు. పిల్లల కోసం ఒక స్పెషల్ షో వేశాం. చాలా ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు పిల్లలు చాలా స్మార్ట్. టైం ట్రావెల్ లో ఎక్కడికి వెళ్తారని అడిగితే ప్రజంట్ లోనే వుంటామని చెబుతున్నారు. వాళ్ళంతా ముదుర్లు(నవ్వుతూ) వాళ్ళ లైఫ్ ని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు.

మీకు టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే ఎక్కడికి వెళ్తారు ?
ఇంటర్ రోజులకి వెళ్తా. హ్యాపీ డేస్ అవి. రేపటి గురించి ఆలోచన, భవిష్యత్ గురించి చింత ఏమీ వుండేది కాదు. కాలేజ్ బంక్ కొట్టాలి, సినిమాకి వెళ్ళాలి, అటు నుండి దాబాకి వెళ్ళాలి. ఇదే ఆలోచన. నిజంగా గోల్డెన్ డేస్.

శ్రీకార్తిక్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
చాలా అద్భుతమైన దర్శకుడు. భవిష్యత్ లో చాలా పెద్ద దర్శకుడు అవుతాడు. కథని చాలా వివరంగా చెప్పాడు. అంత వివరంగా చెప్పాడు కాబట్టే ఈ కథపై, ఆయన ప్రతిభ పూర్తి నమ్మకం ఏర్పడింది. మంచి కథ కుదిరితే భవిష్యత్ తో తనతో కలసి మళ్ళీ పని చేస్తా. అయితే ఆయన బయట కూడా రెండు మూడు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.

ఈ సినిమాకి రావల్సినంత ఆదరణ వచ్చిందని భావిస్తున్నారా ?
నిజానికి నేను ఏ సినిమాకి నెంబర్స్ ఎక్స్ పెక్ట్ చేయను. ప్రతిది పాజిటివ్ గా తీసుకుంటాను. ముఖ్యంగా ఒకే ఒక జీవితం లాంటి సినిమాలు ఒకేసారి నెంబర్స్ వచ్చేసేవి కావు. రెండో వారం కూడా అన్ని చోట్ల ఆడుతుంది. వీకెండ్స్ లో సక్సెస్ ఫుల్ రన్ వుంది. ఇంకో రెండు మూడు వారాలు కూడా నిలకడగా వుంటుందని భావిస్తున్నా.

మీకు కంఫర్ట్ గా వుండే జోనర్ ?
ఏది  కంఫర్ట్ కాదు. మనం కానిదే అక్కడ చూపించాలి. అయితే కామెడీ కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తా. మనం బయట కూడా హ్యాపీ గా బ్రతకొచ్చు కదా. ఇంటెన్స్ రోల్స్ లో ఎంతకాదన్న ఒత్తిడి వుంటుంది. ఇలాంటి రోల్స్ కి డిటాచ్ అవ్వడం కూడా కష్టమే. నిజానికి ఇలాంటి పాత్రలు చేయొద్దని మా డాక్టర్ చెప్పారు(నవ్వుతూ)

అమల గారు మిమ్మల్ని మూడో కొడుకు అన్నారు కదా ?
నాకు అఖిల్ చిన్నప్పటి నుండి తెలుసు. ఐతే అమల గారు, నాగార్జున గారితో ఎక్కువ ఇంటరాక్షన్ ఈ సినిమాతోనే మొదలైయింది. నిజంగా మూడో కొడుకులానే చూస్తారు. ఈ విషయంలో నేను లక్కీ.

వెన్నెల కిషోర్, ప్రియదర్శితో పని చేయడం గురించి ?
దర్శితో ఒక సినిమా చేశా. వెన్నెల కిశోర్ ఎప్పటి నుండో ఫ్రండ్. వెన్నెల అప్పటి నుండి మా ప్రయాణం. వెన్నెల యుఎస్ లో షూటింగ్ చేస్తున్నపుడు ఫుట్ పాత్ మీద కూర్చుని ”అసలు మనం స్టార్ అవుతామా అవ్వమా” అంటే.. కిషోర్ ”నువ్వు అయిపోయావు బాబు .. నేను మాత్రం ఇక్కడే ఉంటా” అని అనేవాడు. (నవ్వుతూ).

జయాపజయాలు గురించి చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటారు కదా ?
నిజం చెప్పాలి కదండీ. మంచి సినిమా ఎదో చెడ్డ సినిమా ఎదో ప్రేక్షకులకు తెలుసు. ఒక చెడ్డ సినిమా చేసి దాన్ని హిట్ అని నాకు నేను అనుకుంటే సరిపోదుకదా. ఫలితాన్ని నిజాయితీ ఒప్పుకోవడం కూడా మంచి చేస్తుంది.

ఈ సినిమా చూసి మీ ఇంట్లో ఏమన్నారు ?
మా ఇంట్లో వాళ్ళు మోస్ట్ అన్ ఎక్స్ ప్రెసీవ్ (నవ్వుతూ) ‘బావుంది. బాచేశావ్’ ఇంతే. ఇండస్ట్రీ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని, తేజు, కార్తి, సిద్ధార్ద్ ఇలా చాలా మంది..  ”మంచి సినిమా చేశావ్, నీ కెరీర్లో ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా, చాలా గర్వంగా నీ లైబ్రెరీలో పెట్టుకునే సినిమా’ అని ప్రశంసించారు.

చాలా సన్నగా కనిపిస్తున్నారు .. ఎన్ని కిలోలో తగ్గారు ? సీక్రెట్ చెప్పండి ?
14 కిలోలు తగ్గాను. సీక్రెట్ ఏమీ లేదు. తక్కువ తింటున్నాను. రోజుకి వంద గ్రాములు రైస్. మిగతాది ఏమైనా తినండి. నాలుగు గంటలకి ఒకసారి తినండి. తక్కువ తినండి.

కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
కృష్ణ చైతన్యతో ఒక సినిమా చేస్తున్నా. ఇది పొలిటికల్ డ్రామా. మరో మూడు కథలు ఫైనల్ స్టేజ్ లో వున్నాయి.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News