ప్రశ్న: ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’… సినిమా కథేంటి? మీరు, శింబు ఇంతకు ముందు చేసిన సినిమాలకు చాలా డిఫరెంట్‌గా టీజర్, ట్రైలర్ ఉన్నాయి!
గౌతమ్ మీనన్ : మేం ఇద్దరం ఇంతకు ముందు చేసినవి రొమాంటిక్ ఫిల్మ్స్. ఆ సినిమాలతో కంపేర్ చేస్తే… ఇది చాలా డిఫరెంట్ సినిమా. ఇదొక గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్. ముత్తు ఒక చిన్న పల్లెలో జీవించే వ్యక్తి. కొన్ని కారణాల వల్ల అతడు ముంబై వెళతాడు. ముత్తుకు ఇష్టం ఉందా? లేదా? అతడు చీకటి ప్రపంచంలోకి ఎలా వచ్చాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా. ముత్తు జీవితంలో చీకటి కోణం ఉంది. అలాగే… లవ్, రొమాన్స్, యాక్షన్ కూడా ఉన్నాయి. ఆ ప్రపంచం నుంచి బయట పడటానికి అతడు ఏం చేశాడు? అనేది సినిమాలో చూడాలి.
ప్రశ్న: ఈ సినిమా చేయడానికి మీకు స్ఫూర్తి ఏమిటి?
గౌతమ్ మీనన్ : శింబుతో ముందు లవ్ స్టోరీ చేయాలనుకున్నా. రెహమాన్ సార్ ఒక సాంగ్ కూడా కంపోజ్ చేశారు. నెల రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా… తమిళంలో పేరున్న రచయిత జయమోహన్‌ను వేరే సినిమా కోసం కలిశా. ఆయన 15 నిమిషాల షార్ట్ స్టోరీ చెప్పారు. నెక్స్ట్ ఏంటి? అని అడిగా. ఇంతవరకు రాశానని చెప్పారు. పది రోజుల్లో 100 పేజీల స్క్రిప్ట్ ఇచ్చారు. చదువుతుంటే విజువల్స్ నా కళ్ళ ముందు మెదిలాయి. అప్పుడు లవ్ స్టోరీ పక్కన పెట్టేసి ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా చేయాలనుకున్నా.
ప్రశ్న: మీరు 55 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారని విన్నాం! ఎలా సాధ్యమైంది?
గౌతమ్ మీనన్ : శింబు, రాధికా శరత్ కుమార్, మలయాళ నటుడు సిద్ధిఖీ కాకుండా మిగతా నటీనటులు అందరూ కొత్తవాళ్ళు. థియేటర్ నేపథ్యం ఉన్నవాళ్ళను మేం సెలెక్ట్ చేశాం. ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేశాం. నేను చూపిస్తున్న ప్రపంచం ఒకటి ఉంటుందని ప్రేక్షకులు నమ్మాలి. అందుకు, కొత్తవాళ్లు అయితే బావుంటుందని అనుకున్నా. సీజనల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేయలేరని కాదు. నేను కొత్తవాళ్ళను ఎంపిక చేసుకున్నా. శింబు స్టార్ అయినప్పటికీ, ఆయనకు ఒక ఇమేజ్ ఉన్నప్పటికీ… 20 ఏళ్ళ కుర్రాడిగా కనిపించగలడు. గ్యాంగ్‌స్టర్‌గా మెప్పించగలడు. స్క్రీన్ మీద కనిపించేది శింబు కాదు, ముత్తు అని ఆడియన్స్ నమ్మాలి. నమ్మేలా అతడు చేయగలడని నాకు తెలుసు. అందుకని, మిగతావాళ్ళతో రిహార్సిల్స్ చేశాం.
ప్రశ్న: శింబు కూడా రిహార్సిల్స్ చేశారు?
గౌతమ్ మీనన్ : కెమెరా ఆన్ అవ్వడానికి పది సెకన్ల ముందు శింబు క్యారెక్టర్‌లోకి ఈజీగా వెళ్ళిపోతాడు. శింబుతో చేస్తే ఫస్ట్ టేక్‌లో సీన్ ఓకే అవుతుంది. అరుదుగా రెండో టేక్‌కు వెళతాం. అది కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. శింబు లాంటి యాక్టర్ ఉంటే సినిమా తీయడం ఈజీ. అతను గడ్డం పెంచడం కోసం, క్యారెక్టర్ పరంగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం మూడు నాలుగు నెలలు వెయిట్ చేశాం. శింబు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో చూస్తారు.
ప్రశ్న: ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’కు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇది ముందుగా తీసుకున్న నిర్ణయమా? పబ్లిసిటీ కోసమా?
గౌతమ్ మీనన్ : పబ్లిసిటీ జిమ్మిక్ కాదు. జయమోహన్ గారు కథ చెప్పినప్పుడు ఒక్క సినిమాగా చేయలేమని అనుకున్నాను. ఆయనతో డిస్కస్ చేసినప్పుడు రెండు భాగాలుగా చేయాలనుకున్నా. అలాగని ‘బాహుబలి’, ‘పొన్నియన్ సెల్వన్’తో కంపేర్ చేయడం లేదు. అవి పెద్ద సినిమాలు. గ్రాండియర్ విజువల్స్ ఉన్నాయి. ఈ కథ డిమాండ్ చేయడంతో రెండు భాగాలు చేస్తున్నాం. క్లైమాక్స్ షూటింగ్ చేసినప్పుడు ‘మనం అది చేయలేమా?’ అని ఒక సీన్ గురించి అడిగాడు. ‘పార్ట్ 2లో చేద్దాం’ అని చెప్పాను. సినిమా మొత్తం అయ్యాక మా హీరో, నిర్మాత చూసి ‘పార్ట్ 2 ప్లానింగ్ స్టార్ట్ చెయ్’ అని అడిగారు.
ప్రశ్న: శింబుతో మీరు ఇంతకు చేసిన సినిమాలను తెలుగులో మరో హీరోతో తీశారు. ఇప్పుడు తమిళ సినిమాను తెలుగులో విడుదల కారణం?
గౌతమ్ మీనన్ : ఓటీటీ వచ్చిన తర్వాత ప్రపంచం, సినిమా పరిశ్రమ చిన్నవి అయిపోయాయి. ఇప్పుడు ప్రేక్షకులు ఇతర భాషల సినిమాలు చూస్తున్నారు. మేం ఎటువంటి సినిమా తీయాలనుకున్నామో… దానిని అన్ని భాషల ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. నిజాయతీగా చెప్పాలంటే… సినిమాకు భాష లేదు. ఈ సినిమాలో కూడా కొన్ని క్యారెక్టర్లు హిందీ మాట్లాడతాయి. ఆ డైలాగులు ప్రేక్షకులకు అర్థం కాకపోయినా అక్కడ భావం తెలుస్తుంది. రీచ్ అవుతుంది.
ప్రశ్న: రెహమాన్ సంగీతం గురించి…
గౌతమ్ మీనన్ : ముందు లవ్ స్టోరీ చేయాలనుకున్నాం కదా! దాని కోసం రెహమాన్ పాటలు చేశారని చెప్పాను కదా! ఆ సాంగ్ లిరిక్స్ చేంజ్ చేసి ఈ సినిమాకు యూజ్ చేస్తానని చెప్పాను. అందుకు రెహమాన్ ఒప్పుకోలేదు. ఆయన కొత్త సాంగ్స్ కంపోజ్ చేశారు. కొన్ని సన్నివేశాలు మ్యూజికల్ పొయెట్రీలా ఉంటుంది.
ప్రశ్న: తెలుగులో ‘స్రవంతి’ రవికిశోర్ సినిమా విడుదల చేస్తున్నారు. ఆయన గురించి…
గౌతమ్ మీనన్ : కొంతమందితో చేయకపోయినప్పటికీ… వాళ్ళను అభిమానిస్తాం. చిన్న చిన్న మీటింగ్స్ అయినప్పటికీ… కొంత మందిని కలిసినప్పుడు హాయిగా అనిపిస్తుంది. ‘స్రవంతి’ రవికిశోర్ గారు అటువంటి వ్యక్తి. రామ్, నేను ఒక సినిమా కోసం కొన్ని రోజులు షూట్ చేశాం. కానీ, ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. తర్వాత నానితో చేశాం. అయినా సరే రామ్, నేను టచ్ లో ఉన్నామంటే కారణం రవికిశోర్ సార్. ఆయన మా ఇద్దరి మధ్య వారధిలా ఉన్నారు. ఇటీవల నేను, రామ్ మళ్ళీ కలిశాం. ఒక సినిమా గురించి డిస్కస్ చేశాం. రవికిశోర్ గారి నిర్మాణంలో ఉంటుంది. ఆయన ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ సినిమాను తెలుగులో విడుదల చేయడం సంతోషంగా ఉంది.
ప్రశ్న: రామ్, మీ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు ఉండొచ్చు?
గౌతమ్ మీనన్ : ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలు అయిన వెంటనే ఉంటుంది. బహుశా నెక్స్ట్ ఇయర్ వేసవి తర్వాత ఉండొచ్చు. తెలుగు సినిమా కోసం మా మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి. రవికిశోర్ గారి కోసం ఈ సినిమా చేస్తున్నాం. ఆయన ఈ సినిమా విడుదల చేస్తున్నారని చెప్పడం లేదు.
ప్రశ్న: ‘రాఘవన్ 2’ చేయాలనుందని కమల్ హాసన్ ఇటీవల పేర్కొన్నారు. మీరు ఏమంటారు?
గౌతమ్ మీనన్ : ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తప్పకుండా ‘రాఘవన్ 2’ సినిమా ఉంటుంది. కమల్ హాసన్ గారితో చేస్తాను. ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇప్పుడే చెప్పడం కాస్త తొందరపాటు అవుతుంది. జయమోహన్ గారు స్క్రిప్ట్ రాస్తున్నారు.
ప్రశ్న: ‘ఏ మాయ చేసావె’, ‘ఘర్షణ’ సినిమాలకు సీక్వెల్స్ ఉంటాయా?
గౌతమ్ మీనన్ : అక్కినేని నాగ చైతన్య అడిగితే తప్పకుండా ‘ఏ మాయ చేసావె 2’ చేస్తాను. ‘ఘర్షణ 2’ వెంకటేష్ గారి చేతుల్లో ఉంది. ఆయన అడిగితే చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.
ప్రశ్న: చివరగా… విక్రమ్ ‘ధ్రువ నక్షత్రం’ విడుదల ఎప్పుడు?
గౌతమ్ మీనన్ : బహుశా ఈ ఏడాది ఆఖరున డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అయితే… ఆ సినిమా వర్క్ ఇంకా కొంత బ్యాలన్స్ ఉంది. సో… చూడాలి. త్వరగా విడుదల చేయాలని మేం ఆశిస్తున్నాం.
—
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…