నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రం  ప్రీ రిలీజ్ ఈవెంట్


యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం,సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్‌ హీరోగా ఇప్పుడు “నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌ఆర్‌ కల్యాణమండపం డైరెక్టర్‌ శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహిస్తున్నారు.సెప్టెంబర్ 16న ఈ చిత్రం విడుదలకు సిద్దమవవుతుంది, ఇందులో భాగంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.ఈ ఈవెంట్ లో

 దర్శకుడు ఎస్వీ. కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ…. ఈ సినిమాకి  శ్రీధర్ డైరెక్టర్ గా, కిరణ్ అబ్బవరం హీరోగా, అలానే నా కూతురులా నటించిన హీరోయిన్  చక్కగా చేసారు. వీళ్ళ పెరఫార్మన్స్ లు  అద్భుతంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం దివ్య దీప్తిగారు. ఆవిడ ఏ సమస్య ఎవరి ముందు పెట్టకుండా తనకుతానుగానే చేసుకుంటూ వెళ్లిపోయారు. దీనికి మూల కారణమైన వ్యక్తి కోడి రామకృష్ణ గారు, వాళ్ళ బ్యానర్ లో సినిమా  అంటే ఎగిరి గంతేసుకుని ఒప్పుకుంటాము. నేను అదే పనిచేసాను. ఈ సినిమాకి మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.  అద్భుతం క్రియేట్ చెయ్యడంలో మణిశర్మ గారు ఎప్పుడూ ముందే ఉంటారు. అని చెబుతూ ఈవెంట్ కి హాజరైన వాళ్ళకి నమస్కారాలు తెలిపారు.

చిత్ర దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ…ముందుగా ఈవెంట్ కి హాజరైన అతిధులకు థాంక్స్ చెబుతూ..హీరోయిన్ సంజన బాగా చేసింది, అలానే సోను ఠాకూర్ కూడా బాగచేసారు. అలానే సిద్దార్థ్ మీనన్ నేను చెప్పిన సీన్స్ ను అర్ధం చేసుకుని బాగా చేసారు. అలానే లెజెండరీ డైరెక్టరైన ఎస్వీ కృష్ణా రెడ్డి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను సీన్స్ చెప్పినప్పుడు చిన్న చిన్న సజెషన్స్ ఇస్తుండేవారు చాలా థాంక్యూ సర్. అలానే సెకండాఫ్ లో బాబా మాస్టర్, కిరణ్ భయ్యా మధ్యలో ఒక ఫన్ రైడ్ ఉంటుంది. ఈ సినిమాలో దానిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. నా రెండో సినిమానే మణిశర్మ గారితో చేయడం నా అదృష్టం. మంచి సాంగ్స్ తో పాటు మంచి బాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు అని చెబుతూ సినిమా టెక్నీషియన్స్ అందరికి కృతజ్ఞతలు తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ.. నాకు కిరణ్ కి  షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నప్పటి నుండి మా బాండింగ్ స్టార్ట్ అయింది. అప్పటినుండి సినిమా చేద్దామనుకున్నాము ఒక షార్ట్ ఫిలిం తరువాత, ఎస్.ఆర్ కల్యాణమండపం సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాము.ఈ సినిమాలో క్లాస్, మాస్ వేరియేషన్స్ ఉంటాయి. ఈ సినిమా మీ అందరికి బాగా నచ్చుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 16 రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ…ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన అతిధులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు చెబుతూ.. ప్రొడ్యూసర్ దివ్య దీప్తి గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని  ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.  హీరో కిరణ్ అబ్బవరం ఎస్.ఆర్. కల్యాణ మండపం సినిమాతో అందరికి బాగా కావాల్సినవాడు అయిపోయారు, ఈ సినిమా ఘన విజయం సాధించి పెద్దరేంజ్ కి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

హీరోయిన్ సంజన మాట్లాడుతూ..ఇంత మంచి ప్రాజెక్ట్ తో తెలుగులో డెబ్యూ చేస్తానని ఉహించలేదు. ఇది మాస్ ఎంటెర్టైనమెంట్  సినిమా అయినా కూడా ఫిమేల్ కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు.  కృష్ణా రెడ్డి సర్ నన్ను రియల్ కూతురిలానే చూసుకున్నారు. 16న ఈ సినిమా చూడండి ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది.హీరోయిన్ సోనాల్ ఠాకూర్ మాట్లాడుతూ…ఇలాంటి ఒక బ్యానర్  లో వర్క్ చెయ్యడం నా అదృష్టం. ఇక్కడికి వచ్చిన అందరికి చాలా థాంక్యూ అండి. సెకండాఫ్ లో నాకు మంచి రోల్ ఉంది. 16న సినిమా రిలీజ్ అవుతుంది మీ రెస్పాన్స్చూడటానికి వెయిట్ చేస్తున్నాం.

నిర్మాత దివ్య దీప్తి మాట్లాడుతూ..నేను మణిశర్మ గారికి చాలా థాంక్ ఫుల్ ఉంటాను అండి. ఆయన మాకు ఇచ్చిన మ్యూజిక్, అలానే సినిమాకి ఇచ్చిన ఆర్.ఆర్ చాలా ఫాస్ట్ గా ఇచ్చారు. అలానే భాస్కర్ భట్ల గారికి, భాను మాస్టర్ కి మా టెక్నీషియన్స్ అందరికి చాలా థాంక్యూ అండి. మా డైరెక్టర్ శ్రీధర్ గారికి చాలా థాంక్స్ అండి. ఆయన ఏ సిచ్యువేషన్ అయినా ఫాస్ట్ గా హ్యాండిల్ చేసి  మాకు చాలా సపోర్ట్ చేసారు. ఈ సినిమాను కిరణ్ డైలాగ్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. గ్యారంటీ గా ఒక మంచి కమర్షియల్ ఎంటెర్టైమెంట్ తో మీ ముందుకు వస్తున్నాం. కిరణ్ కి థాంక్స్ చెబితే అది చాలా చిన్న వర్డ్ అవుతుంది.అలానే మా  ఏలూరు శ్రీను గారికి, శ్యామ్ గారికి  చాలా థాంక్స్ అండి. ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…ముందుగా దివంగత హీరో, నటులు అయిన కృష్ణం రాజు గారికి, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సినిమా ఒక  ప్రొపెర్ ఎంటర్టైనర్ మీ ఫ్యామిలీ తో పాటు వెళ్ళండి. మీరు సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక ఎమోషన్ ను తీసుకెళ్తారు.సినిమా అంటే మనం థియేటర్ లోకి వెళ్లి గోల పెట్టాలి , ఎంజాయ్ చెయ్యాలి మీరెళ్ళి సినిమా మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చెయ్యండి. మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. అలానే ఈ వీక్ రిలీజ్ అవుతున్న “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” “శాకినీ డాకిని” సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. కోడి రామకృష్ణ గారి బ్యానర్ లో ఫస్ట్ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను ప్రొపెర్ గా ఎంజాయ్ చెయ్యండి. ఖచ్చితంగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నన్ను అభిమానిస్తూ, నా వర్క్ ను ప్రోత్సహిస్తూ , నా భుజం తట్టేవాళ్ళకి ప్రతిఒక్కరికి థాంక్యూ సో మచ్.  సెప్టెంబర్ 16న “నేను మీకు బాగా కావాల్సిన వాడిని”  రిలీజ్ అవుతుంది సినిమా చూసి బాగా ఎంజాయ్ చెయ్యండి.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

16 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago