దర్శక నిర్మాత- విశ్వానంద్ పటార్ ఇంటర్వ్యూ

ఎస్ ఎమ్ ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీమతి అనిత, ప్రఖ్యాత్ సమర్పణలో ప్రణవి పిక్చర్స్ పతాకంపై డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం “లాట్స్ ఆఫ్ లవ్” ఈ నెల 30 న తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత అయినటువంటి డా. విశ్వానంద్ పటార్ ఈ సినిమా అనుభవాలతో పాటు సొంత విశేషాలను మీడియా విలేకరులతో తో పంచుకుంటూ…


నా పేరు విశ్వానంద్ పటార్ పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే…. మ్యానేజ్ మెంట్ లో పి హెచ్ డి చేసాను.. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేనప్పటికీ చిన్నప్పటి నుంచి ఫిలిమ్స్ పై ఉన్న ప్యాషన్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరిగింది. ఈనెల 30న విడుదల కాబోతున్న “లాట్స్ ఆఫ్ లవ్ ” చిత్రానికి స్వీయ దర్శకత్వం వహించాను. ఈ సినిమాకు దర్శకత్వం తో పాటు కథ, మాటలు, మ్యూజిక్ నిర్మాతగా నేనే వ్యవహరించడం వెనుక కారణం ఉంది. మొట్ట మొదటి సినిమా కావడంతో కాస్త బడ్జెట్ కంట్రోల్ పెట్టడంతో పాటు 24 క్రాఫ్ట్ పై అవగాహన ఉండడం వల్లే అన్నీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నా స్నేహితులు కిరణ్, శ్రీనివాస్ లు కూడా నాకు చాలా సపోర్ట్ అందించారు. ఒకరకంగా చెప్పాలంటే వారు లేకపోతే ఈ సినిమా విడుదల దాకా వచ్చేది కాదు. ఏమైనా ఇన్నీ భాద్యతలతో ఒక సినిమా ను విడుదల వరకు తీసుకు రావడం అనేది అంత ఈజీ కాదని అర్థమయ్యింది. ఇక ఈ సినిమాలో నాతో సహా అందరూ కొత్తవారే డాక్టర్ పాత్రకు నేను సూట్ అవుతానని కొందరు అనడంమే కాకుండా కరోనా సమయంలో నేను కూడా సేవాలందించడంతో డాక్టర్ పాత్రకు న్యాయం చేయగలననే నటించడం జరిగింది. ఇక మిగతా వారి విషయానికి వస్తే సెకండ్ లీడ్ లో నటించిన రాజేష్ వదినమ్మ సీరియల్ లో నటించిన వ్యక్తి. ధర్డ్ లీడ్ లో నిహాంత్ నాకు ముందు నుంచి తెలుసు.. నేను అతను కలసి ఒక ఇంగ్లీష్ ఆల్బమ్ సాంగ్ చేసాము. ఈ చిత్రంలో స్వామీజీగా నటించిన కిరణ్ నా స్నేహితుడు అలాగే ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పని చేసాడు. ఇక మిగతా నటీనటులందరినీ ఆడిషన్స్ చేసి ట్రైనింగ్ ఇచ్చి మా సినిమాలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు కొత్త వారికి అవాకాశం కల్పించడం అంటే ఇష్టం.. అదో గొప్ప వరంగా భావిస్తాను. ఎంతో మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఉన్నా అవకాశాలు మాత్రం చాలా అరుదు. అందుకే ఎప్పుడూ కొత్తవారికే నా ప్రాధాన్యత ఉంటుంది. కనుకే ఈ మా లాట్స్ ఆఫ్ లవ్ లో కొత్తవారినే తీసుకున్నా కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తమ- తమ పాత్రలకు పూర్తి గా న్యాయం చేశారు.

కొత్తవారిలా ఎవరూ నటించలేదు.. బడ్జెట్ విషయానికి వస్తే మొదట అనుకున్న బడ్జెట్ వేరు.. సినిమా పూర్తయ్యేటప్పటికి అయిన బడ్జెట్ వేరు (నవ్వుతూ) మూడింతలు అయ్యింది. ముఖ్యంగా సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే ప్రొఫెషనల్ లవ్, ఫామిలీ లవ్, డివైన్ లవ్, రొమాంటిక్ లవ్, సెల్ఫ్ లవ్ అనే అయిదు రకాల ప్రేమల మిళితమే ఈ లాట్స్ ఆఫ్ లవ్ సినిమా.. ముఖ్యంగా ఈ చిత్రంలో డివైన్ లవ్ అనే అంకం చాలా కొత్తగా ఉంటుంది. మనల్ని మనమే కాదు ప్రతి ఒక్కరినీ ప్రేమించాలి అలాగే ప్లాంట్స్ ను కానీ జంతువులను కానీ ఇలా దేనినైనా ప్రేమించే గుణం ఉండాలి, అంతేకాదు ప్రేమ అంటే కేవలం ఇద్దరి ప్రేమికుల మధ్య ఉన్నదే కాదు అనేక రకాలుగా ఉంటుంది ప్రేమ అనేది ఈ సినిమా ద్వారా చూపించాలని మా ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో ఒక్కో లవ్ యాంగిల్ కు ఒక్కో సాంగ్ కంపోజ్ చేయడం జరిగింది. ప్రతి పాట అందరి మనసును టచ్ చేసే విధంగా లిరిక్స్ కూడా ఉంటాయి. మొన్న విడుదల చేసిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. లాట్స్ ఆఫ్ లవ్ సినిమా ను పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరూ చూసే విదంగా మలిచి ఈ నెల 30న ఆంద్ర తెలంగాణ లలో 50 థియేటర్స్ తో సహా యు ఎస్ లో కూడా ఓ 4 థియేటర్సలలో ఓన్ గా రిలీజ్ చేయనున్నాము కనుక ఈ మా ప్రయత్నాన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర 10 మంచి కథలు టైటిల్స్ తో సహా రెడీగా ఉన్నాయి.. ఈ మా లాట్స్ ఆఫ్ లవ్ సినిమా ఫలితం బట్టించే నా తదుపరి సినిమా ఎప్పుడు అనేది తెలియపరుస్తాను. సినిమాలపై ఉన్న ఫ్యాషన్ వల్లనే కొత్త కాన్సెప్ట్ లతో కొత్త వారిని ప్రోత్సహిస్తూ, సినిమాలు చేస్తూ…ఉంటాను అని ముచ్చటించారు దర్శక నిర్మాత డా. విశ్వానంద్ పటార్.

Tfja Team

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

17 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

17 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

17 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

18 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

18 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

23 hours ago