‘అలనాటి రామచంద్రుడు’ క్లాసిక్, యూనివర్సల్ లవ్ స్టొరీ హీరోయిన్ మోక్ష

Must Read

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై  హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 2న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మోక్ష విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు.

మీ నేపధ్యం గురించి ?
-నేను బెంగాలీ అమ్మాయిని. కోల్‌కాతా నుంచి వచ్చాను. తెలుగులో  నా మొదటి సినిమా లక్కీ లక్ష్మణ్. అలనాటి రామచంద్రుడు నా రెండో సినిమా. గత రెండేళ్ళుగా తెలుగు మలయాళం తమిళ పరిశ్రమల్లో పని చేస్తున్నాను. తెలుగు అర్ధం అవుతుంది. మాట్లాడటం కూడా చాలా వరకూ వచ్చింది. అలనాటి రామచంద్రుడు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.  

అలనాటి రామచంద్రుడు లో మీ పాత్ర ఎలా వుండబోతుంది ?
-ఇందులో నా క్యారెక్టర్ పేరు ధరణి. ఇదొక కమర్షియల్ పోయిటిక్ మూవీ. ట్రైలర్ చూస్తే బ్యూటీఫుల్ పోయిట్రీ వుంటుంది. నా క్యారెక్టర్ చాలా హైపర్, అల్లరిగా వుంటుంది, దర్శకుడు ఏం చెప్పారో అదే అద్భుతంగా ప్రజెంట్ చేశారు. చాలా బ్యూటీఫుల్ క్యారెక్టరైజేషన్, ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకునేలా వుంటుంది.ఈ సినిమాలో నాకు చాలా మంచి డైలాగులు వున్నాయి.    

అలనాటి రామచంద్రుడులో మీకు చాలెంజింగ్ గా అనిపించిన అంశం ఏమిటి ?
-ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సెకండ్ హాఫ్ కంప్లీట్ గా మనాలిలో వుంటుంది. షూటింగ్ లో చాలా ఛాలెంజ్స్ ఎదురుకున్నాం. వింటర్ లో  మైనస్ డిగ్రీలలో షూటింగ్ చేశాం. ఈ కథలో నేచర్ ఒక ఫీలాసఫీ గా వుంటుంది, ఆ నేచర్ క్యాప్చర్ చేయడం సవాల్ గా అనిపించింది.

హీరో కృష్ణ వంశీ గారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా వుంది ?
 కృష్ణ వంశీ ఇందులో తన క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు. తన పెర్ఫర్మెన్స్ చాలా నేచురల్ గా వుంటుంది.

డైరెక్టర్ ఆకాష్ రెడ్డి గురించి ?  
-దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఈ పాత్ర నా కోసమే పుట్టిందేమో అనిపించింది. నా ఆడిషన్ ఆయనకి నచ్చింది. దిని కోసం వర్క్ షాప్ కూడా చేశాం. డైరెక్టర్ గారు చాలా మంచి విజన్ తో అద్భుతంగా ఈ సినిమా చేశారు. చాలా హానెస్ట్ గా కష్టపడి తీసిన సినిమా ఇది.

అలనాటి రామచంద్రుడు టైటిల్ గురించి ?
-ఇందులో హీరో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే టైటిల్ ఇది. ఇందులో తనది స్వార్ధం లేని ప్రేమ. ప్రజెంట్ జనరేషన్ లో శ్రీరాముని క్యారెక్టర్ తో హీరో క్యారెక్టర్ ని కోరిలేట్ చేసుకునేలా వుంటుంది. ఇదొక క్లాసిక్ యూనివర్సల్ లవ్ స్టొరీ.

ప్రొడక్షన్ హౌస్ గురించి ?
-మనాలి, అమలాపురం, వైజాగ్ ఇలా డిఫరెంట్ లోకేషన్స్ లో సినిమాని షూట్ చేశాం, నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా కథకు కావాల్సిన ప్రతిది సమకూర్చారు. ఒక పెద్ద సినిమాలానే చేశారు. వారికి హ్యాట్సప్ చెప్పాలి. చాలా విజనరీ ప్రొడ్యూసర్స్.  

మ్యూజిక్ గురించి ?
అలనాటి రామచంద్రుడు మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది. నేపధ్యం సంగీతం అన్ బిలివబుల్ అనిపిస్తుంది. సరికొత్త మ్యూజిక్ ని ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ చేస్తారు.

తెలుగు సినిమాలు చూస్తుంటారా ? మీ ఫేవరేట్ హీరో ఎవరు ?
-చాలా తెలుగు సినిమాలు చూశాను. సావిత్రి గారు చేసిన దేవదాస్ నుంచి అనుష్క గారి అరుంధతి, లేటెస్ట్ సాయి పల్లవి గారి విరాట పర్వం వరకూ ఎన్నో సినిమాలని ఎంజాయ్ చేశాను. సీతారామం, హనుమాన్ ఎంతగానో నచ్చాయి. అందరూ ఇష్టమే. నాని గారు అంటే ఇష్టం, ఆయన శ్యామ్ సింగారాయ్ లో బెంగాల్ నేపధ్యం వుంటుంది. ఆయనతో వర్క్ చేయాలని వుంది.      

-తెలుగు సినిమాలు చేయడం చాలా ఆనందంగా వుంది. తెలుగు పాన్ ఇండియా ఇండస్ట్రీ. ఇక్కడ ఆడియన్స్ చాలా లవబుల్ గా వుంటారు. ప్రమోషన్స్ లో ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.

ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని వుంది ?
-ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే క్యారెక్టర్స్ చేయాలని వుంది.  

నెస్ట్ ప్రాజెక్ట్స్ ?
-రామం రాఘవం సినిమా చేస్తున్నాను. అలాగే ఒక మలయాళం సినిమా విడుదలకు రెడీ అవుతుంది.  

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News