Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri

Presenting you the Teaser of Ramarao on Duty Movie written and directed by Sarath Mandava. Produced by Sri Lakshmi Venkateswara Cinemas and RT Team Works, Starring Ravi Teja, Divyansha Kaushik and Rajisha Vijayan.

’35-చిన్న కథ కాదు’ అందరూ రిలేట్ అయ్యే బ్యూటీఫుల్ స్టొరీ నివేత థామస్

Must Read

నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. “35-చిన్న కథ కాదు” సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నివేత థామస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.  

’35-చిన్న కథ కాదు’ లో మదర్ రోల్ లో కనిపిస్తున్నారు కదా..మదర్ క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు ఎలా అనిపించింది?

-’35-చిన్న కథ కాదు’ సింపుల్ అండ్ బ్యూటీఫుల్ స్టొరీ. స్టార్ట్ టు ఫినిష్ ఆ వరల్డ్ లో కాంప్రమైజ్ లేకుండా రాసిన స్టొరీ. నివేత థామస్ కాకుండా సరస్వతి పాత్రే కనిపిస్తుంది. ఇలాంటి పాత్ర చేయడం నాకు చాలా ఇష్టం.

-ఇండియన్ సొసైటీలో 22 ఏళ్లకే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని జనరల్ గా అడుగుతారు. నేను హౌస్ వైఫ్ క్యారెక్టర్ చేయడంలో పెద్ద ప్రాబ్లమ్ లేదు. యాక్టర్ గా అన్ని పాత్రలు చేయాలి. మదర్ గా బాగా చేశాను అనే బదులు సరస్వతి పాత్రని బాగా చేశానని మీరంతా చెబితే సంతోషిస్తాను(నవ్వుతూ). నాకంటూ ఒక ప్యాట్రన్ ని సెట్ చేసుకోవడం నాకు ఇష్టం వుండదు. నివేత ఏ పాత్రనైనా చేయగలదని దర్శకులు నమ్మగలిగితే యాక్టర్ గా అంతకుమించిన ఆనందం మరొకటి వుండదు. 

-ఇందులో సరస్వతి పాత్రకు నాకు ఏజ్ లో పెద్ద తేడా లేదు. సరస్వతి ఏజ్ లో నాకంటే ఏడాది చిన్నది. తనకి చిన్న ఏజ్ లోనే పెళ్లి అవుతుంది. ఆమెకి పిల్లలు ఉన్నప్పటికీ ఆమెలో ఒక చైల్డ్ నేచర్ వుంటుంది. ఇందులో యూత్ లవ్ వుంటుంది. ఇవన్నీ ఎక్స్ ఫ్లోర్ చేయడం నాకు చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది.      

ఈ కథలో మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన ఎలిమెంట్ ఏమిటి ? 

-35-చిన్న కథ కాదు వెరీ రూటెడ్ స్టొరీ. డైరెక్టర్ నంద కిషోర్ కథని అద్భుతంగా రాశారు. ఇందులో తిరుపతి తిరుమల వేంకన్న స్వామి కూడా కథలో ఒక క్యారెక్టర్. కథ ఇంత రీజినల్ గా రూటెడ్ గా వుండటం నాకు చాలా నచ్చింది. డివైన్ ఫీలింగ్ అన్ని సీన్స్ లో వుంటుంది. ఎన్నోసెంట్ ఫ్యామిలీ స్టొరీ ప్రేక్షకులకు చాలా నచ్చుతుంది.    

ఇది ఎడ్యుకేషన్ స్టొరీనా ? 

-మ్యాథ్స్ అనేది చిన్న పార్ట్ మాత్రమే. ఇందులో చాలా మాస్ మూమెంట్స్ క్లాస్ రూమ్ నుంచే వస్తాయి. చాలా నోస్టాల్జియా మూమెంట్స్ వుంటాయి. భార్య భర్త, పిల్లలు, టీచర్ స్టూడెంట్స్ ఇలాంటి బ్యూటీఫుల్ రిలేషన్షిప్స్ గురించి చాలా అందంగా చెప్పడం జరిగింది. ఇది కె విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన ఫీలింగ్ ఇస్తుంది.  

35-చిన్న కథ కాదు.. టైటిల్ మార్కులని ఉద్దేశించి పెట్టినదేనా ? 

-అవును. మ్యాథ్స్ లో పిల్లలకి చాలా ఫండమెంటల్ డౌట్స్ వుంటాయి. ఇందులో మా పెద్దబ్బాయికి అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి కానీ మ్యాథ్స్ లో చాలా ప్రాబ్లమ్స్ వుంటాయి. అవి చాలా మంది రిలేట్ చేసుకునేలా వుంటాయి. 

ఈ సినిమాకి తారే జమీన్ పర్ తో పోలిక ఉంటుందా ? 

-అస్సల్ లేదండి. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదు. మదర్, సన్ టీచర్ సన్..ఇవన్నీ వుండటంతో ఆ పోలిక వచ్చిందని భావిస్తున్నాను. సినిమా చూసిన తర్వాత దానికి దీనికి పోలిక లేదని మీరే అంటారు.

తిరుపతి స్లాంగ్ కోసం ఎలాంటి ప్రాక్టీస్ చేశారు?

-గట్టిగా ట్యూషన్ జరిగింది. దాదాపు నెల రోజులు వర్క్ షాప్ చేశాం. స్లాంగ్ కోసం కోసం ప్రత్యేకంగా ఒక పుస్తకమే ప్రిపేర్ చేయడం జరిగింది. సింక్ సౌండ్ కావడంతో ప్రతి వర్డ్ ని క్షుణ్ణంగా నేర్చుకున్నాను. అలాగే పిల్లలు కూడా చాలా ప్రిపేర్ అయ్యారు. 

-దర్శి క్యారెక్టర్ ఎలా వుండబోతోంది? 

-ఇందులో మ్యాథ్స్ టీచర్ చాణక్య క్యారెక్టర్ ప్లే చేశారు దర్శి. చాణక్య లాంటి టీచర్స్ ని మన జీవితంలో చూసే వుంటాం. స్కూల్స్ పోర్షన్ చాలా ఎంజాయ్ చేస్తారు. 

గౌతమి, భాగ్యరాజా గారుతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? 

-గౌతమి గారితో నాకు ఇది రెండో సినిమా. ఆమె చాలా ఇన్వాల్ గా వుంటారు. ఇందులో ఆమె క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. భాగ్యరాజా గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో పిల్లల పాత్రలు కూడా చాలా కీలకంగా వుంటాయి. ఇందులో పిల్లలందరూ హీరోలే. 

రానా దగ్గుబాటి గారు ఈ సినిమాని ప్రజెంట్ చేయడం ఎలా అనిపించింది? 

-రానా గారికి ఈ సినిమా కథ ముందునుంచి తెలుసు. సురేష్ ప్రొడక్షన్ తో ఆయన ఈ సినిమాని ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా వుంది. మంచి సినిమాలకి వారి సపోర్ట్ ఎప్పుడూ వుంటుంది. ఈ సినిమా జర్నీలో నాకు బ్రోచేవారు రోజులు గుర్తుకువచ్చాయి. 

అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ? 

-ప్రస్తుతానికి ఏదీ సైన్ చేయలేదు. త్వరలోనే చెప్తాను. 

ఆల్ ది బెస్ట్ 

-థాంక్ యూ

Latest News

Love Reddy is trending nationwide on Amazon Prime

"Love Reddy" is a film jointly produced by Geetans Productions, Seheri Studio and MGR Films banners. The lead roles...

More News