ZEE5లో విశ్వక్ సేన్ ‘గామి’ సెన్సేషన్..

Must Read

తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5. తాజాగా ‘గామి’ చిత్రంతో ZEE5 ప్రేక్షకులను అలరిస్తోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది. విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని జీ 5 ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. జీ 5లో గామి చిత్రానికి అపూర్వ ఆదరణ దక్కుతోంది. 72 గంటల్లోపే ఈ చిత్రం 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టుకోవటం విశేషం.

హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు అభినందనీయం.

నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. చక్కటి ఎమోషన్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆసక్తికరమైన కథనం, చక్కటి విజువల్స్ అన్ని ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి ఇప్పుడు ఈ విజువల్, ఎమోషనల్ వండర్ జీ5 ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది.

జీ5 గురించి:
జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

Latest News

NKR21 Huge Action Episode Filmed In Peter Hein Master

Nandamuri Kalyan Ram’s action-packed entertainer #NKR21 being directed by Pradeep Chilukuri, produced by Ashok Vardhan Muppa and Sunil Balusu...

More News