సుకుమార్ చేతులమీదుగా విడుదలైన ‘డై హార్డ్ ఫ్యాన్’ ట్రైలర్ సెప్టెంబర్ 2 న గ్రాండ్ రిలీజ్

Must Read

సినిమాలో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అంద‌రికి తెలుసు. అలాంటిది ఓ అభిమాని త‌ను అభిమానించే హీరోయిన్‌ని క‌ల‌వాల‌నుకుంటాడు.అనుకోకుండా హీరోయిన్ క‌లిస్తే ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేది ఈ చిత్ర ముఖ్య క‌థాంశం. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ నటీనటులుగా అభిరామ్ M  దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం “డై హార్డ్ ఫ్యాన్”.  ఈ చిత్రంలో  హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి న‌టిస్తున్నాడు. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు రాస్తున్నారు. తాజాగా ఇందులో పరుగే పరుగు పాటను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుద‌ల చేశారు. ఈ పాటచాలా అద్బుతంగా ఉందని ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా దర్శకులు సుకుమార్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. అభిరామ్ M  దర్శకత్వంలో చంద్రప్రియ సుబుధి నిర్మించిన  సస్పెన్స్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ బాగుంది. ఈ సినిమాకు నా ఫ్రెండ్ మధు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి కొన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా టీం అందరికీ మంచి పేరు రావాలని  మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు అభిరామ్ మాట్లాడుతూ.. చాలా మంది ఈ టైటిల్ క్రెజీగా ఉందని పెట్టారా అని అడుగుతున్నారు. అయితే టైటిల్ తగ్గట్టే సినిమా ఉంటుంది. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్ని పాత్ర‌లు హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ వుంటాయి.మధు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.బేబమ్మ పాత్రలో షకలక శంకర్ పాత్ర ఆద్యంతం న‌వ్విస్తుంది.కృష్ణ కాంత్ గా రాజీవ్ కనకాల ,మరియు నోయల్, హీరో, హీరోయిన్ లు  చాలా సపోర్ట్ చేశారు. నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా  నిర్మిచారు.ఈ సినిమా క‌థ లో మ‌లుపులు ప్రేక్ష‌కుడ్ని థ్రిల్ చేస్తాయి. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు

చిత్ర నిర్మాత చంద్రప్రియ సుబుధి మాట్లాడుతూ..మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన సుకుమార్ కి ధన్యవాదాలు. ఈ కథకు హీరో, హీరోయిన్స్ అంటూ ఉండరు. కథే హీరో. కంటెంట్ ఉంటేనే ఏ చిత్రాన్ని అయినా ప్రేక్షకులు అదరిస్తారని నమ్ముతాను. అందుకే నేను కంటెంట్ ను నమ్మి ఈ సినిమా నిర్మించాను.ద‌ర్శ‌కుడు అభిరామ్ ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ఈ చిత్రాన్ని చిత్రీక‌రించాడు. ఈ సినిమాకు టీం అంతా ఎంతో కష్టపడ్డారు.సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ  ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సందీప్ కింతలి మాట్లాడుతూ.. టీం అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు షకలక శంకర్  మాట్లాడుతూ..“డై హార్డ్ ఫ్యాన్” కు బలం ఓన్లీ కథ. ఇలాంటి మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని  తీశారు దర్శక, నిర్మాతలు. సాహో లో ప్రభాస్ నోటి వెంట  వచ్చిన డైలాగ్ ను ఈ సినిమాకు టైటిల్ గా పెట్టడం జరిగింది.ఈ కథకు  ఈ టైటిల్ 100%యాప్ట్. టైటిల్ తగ్గట్టే  సినిమా ఉంటుంది. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు..

నటుడు  నోయల్ మాట్లాడుతూ.. సుకుమార్ గారు నన్ను గుర్తించడం వలెనే ఈ రోజు ఆర్టిస్ట్ గా మీ ముందు ఉన్నాను.దర్శకుడు అభిరామ్ తో నేను చేసిన రెండవ సినిమాఇది.చాలా మంది నటులు వున్నా ప్రొడ్యూస్ చేసే వారు తక్కువ అలాంటిది అభిరామ్, శివ, ప్రియాంక లను నమ్మి తీసిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది.నిర్మాతలకు పెద్ద హిట్ అవ్వాలి.వారికి నా ధన్యవాదములు.

చిత్ర హీరో శివ ఆలపాటి మాట్లాడుతూ..నా మొదటి సినిమాకే సీనియర్ ఆర్టిస్టులతో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు

చిత్ర హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ..సవారీ చిత్రం తరువాత మంచి స్కోప్ ఉన్న  పాత్రలో నటిస్తున్నాను.టీం అంతా ఎంతో  హార్డ్ వర్క్ చేశాము. మంచి కంటెంట్ తో  సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుతున్నాను అన్నారు

సినిమాటోగ్రఫర్  జగదీష్ బొమ్మిశెట్టి మాట్లాడుతూ.. నిర్మాతలకిది మొదటి సినిమా అయినా చాలా బాగా తీ శారు. ఇందులో నటించుయినా వారంతా చాలా బాగా నటించారు.సెప్టెంబర్ 2 న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు

జర్నలిస్ట్ ఏలూరు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను బాగుంది. అభిరామ్ గారు ఎంచుకున్న కథే  కాకుండా చిత్రాన్ని చాలా బాగా తీశారు. సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏ  జరుగుతుంది అనే క్యూరియాసిటీ గా ట్విస్ట్ & టర్న్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసికెళ్ళింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే  సందర్బంగా  సెప్టెంబర్ 2 న విడుదల అవుతున్న “డై హార్డ్ ఫ్యాన్”  చిత్రాన్ని  పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు

నటుడు కేశవ్ దీపక్  మాట్లాడుతూ.. శివ, శఖలక శంకర్ పై వచ్చే సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఫుల్ కామెడీ మూవీ గా వస్తున్న ఈ సినిమను అందరూ ఆదరించాలి అన్నారు

నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్  తదితరులు

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: అభిరామ్ M
బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్
నిర్మాత: చంద్రప్రియ సుబుధి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి
మాటలు: సయ్యద్ తేజుద్దీన్
సంగీతం: మధు పొన్నాస్
సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి
ఎడిట్ VFX – తిరు B
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వెంకటేష్ తిరుమల శెట్టి
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News