సౌర‌వ్ గంగూలీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ’ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌..ప్ర‌పంచ వ్యాప్తంగా మే 14, 2027న సినిమా భారీ విడుద‌ల‌

లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ రాజ్‌కుమార్ రావ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది. ఇదే సమయంలో ఈ సినిమాను 2027, మే 14న లాంగ్ హాలిడే వీకెండ్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అధికారికంగా విడుద‌ల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో 2002లో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ జెర్సీ ఊపిన ఐకానిక్ మూమెంట్‌ను రాజ్‌కుమార్ రావ్‌తో సినిమాటిక్‌గా రీక్రియేట్ చేసినట్లు చూపించారు. ఈ సెలబ్రేషన్‌ను భారత క్రికెట్‌లో గంగూలీ నాయకత్వంలో ప్రారంభమైన కొత్త యుగానికి ప్రతీకగా భావిస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, నమ్మకానికి చిరస్థాయిగా నిలిచే చిహ్నంగా ఇప్పటికీ ఆ క్ష‌ణాలు గుర్తులుగా మిగిలాయి.

‘దాదా- ది సౌర‌వ్ గంగూలీ’ సినిమా క్రికెట్‌ ఆట ఆడిన వ్యక్తి మాత్రమే కాకుండా దానిని మార్చిన మనిషి అసాధారణ ప్రయాణాన్ని చూపిస్తుంది. ఒక ప్రతిభావంతుడైన యువ క్రికెటర్‌గా ప్రారంభమై భారతదేశంలో అత్యంత ప్రభావశీలమైన కెప్టెన్లలో ఒకరిగా ఎదిగిన గంగూలీ ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్క‌రిస్తుంది. పట్టుదల, పోరాడే శక్తి, నమ్మకం వంటి లక్షణాలు భారత క్రికెట్‌ను ఎలా కొత్తగా మలిచాయో, ఒక తరం మొత్తానికి ఎలా ప్రేరణగా నిలిచాయో ఈ సినిమా ద్వారా చూపించ‌నున్నారు.

‘దాదా- ది సౌర‌వ్ గంగూలీ’ సినిమాకు విక్రమాదిత్య మోత్వానె దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ రంజన్, అంకూర్ గార్గ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ-సిరీస్, డీబీఎల్ సమర్పణలో, లవ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027, మే 14న థియేటర్లలో భారీ ఎత్తున‌ విడుదల కానుంది.

TFJA

Recent Posts

సునీల్, అఖిల్ ఉడ్డెమారిల సైకాలజికల్ థ్రిల్లర్ ‘ఫైట్ మహా’ ట్రైలర్ రిలీజ్ – సినిమా ఆగస్టు 21న వరల్డ్‌వైడ్ రిలీజ్

సునీల్, అఖిల్ ఉడ్డెమారి, ప్రదాన పాత్రల్లో డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న…

9 hours ago

హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) ఔట్ స్టాండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ “ది మేజ్” నుంచి రివర్స్ టీజర్ రిలీజ్

తొలిసారి రివర్స్ టీజర్ తో సరికొత్త ప్రయత్నం చేసి ఆకట్టుకుంటున్న "ది మేజ్" మూవీ మేకర్స్ తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో…

9 hours ago

‘అమీర్ లోగ్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది – దర్శకుడు రమణా రెడ్డి సోమ

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా…

9 hours ago

‘మండాడి’ నుంచి సోల్ ఫుల్, మెలోడీ ‘తెలుసా నీకే పిల్లా’ సాంగ్ రిలీజ్

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న చిత్రం…

9 hours ago

పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు అతిథులుగా ఘనంగా “సాV3” మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్

సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సాV3". ఈ…

10 hours ago

అత్యంత ఘనంగా జరిగిన నిర్మాత బండ్ల గణేశ్‌ కుమార్తె జనని-సూర్యతేజ వివాహం

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో…

14 hours ago