సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హేమంత్ రావు, తాజాగా “666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్” అనే టైటిల్‌తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు, ఈ చిత్రంలో పుష్ప చిత్రంలో అలరించిన నటుడు డాలీ ధనుంజయ నటిస్తుండగా.. కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి డాలీ ధనుంజయ్ న్యూ లుక్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. డిఫరెంట్ గా మ్యాన్ లీ లుక్ లో ఉన్న ధనుంజయ్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. పుష్ప 1,2 చిత్రాలతో పాపులర్ అయిన డాలీ ధనుంజర్ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రంలో డిఫరెంట్ రోల్ లో నటించారు.
విజే ఫిలిమ్స్ బ్యానర్ పై డాక్టర్ వైశాక్ జే. గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జైలర్ 2, పెద్ది చిత్రాల్లో నటిస్తోన్న శివరాజ్ కుమార్ ఈ సినిమాలో మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. చరణ్ రాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విశ్వాస్ కశ్యప్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ”666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్” చిత్రం కన్నడ తో పాటు తెలుగులో ఒకేసారి విడుదల కాబోతోంది
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…