‘వార్ 2’ కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’ కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

వరుస విజయాలతో దూసుకుపోతూ వైవిధ్యమైన సినిమాలను రూపొందిస్తూ, అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సంస్థ డిస్ట్రిబ్యూషన్ కూడా నిర్వహిస్తోంది. హ్యాట్రిక్ విజయాల కోసం ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత, దేవర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘వార్ 2’ కోసం కలిసి పని చేస్తోంది.

YRF బ్లాక్ బస్టర్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేయటానికి సిద్ధమైంది. వార్ 2 తెలుగు థియేట్రికల్ హక్కులను సితార ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసింది.

ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా తెలియజేస్తూ ట్వీట్ చేసింది. ‘‘హ్యాట్రిక్ హిట్ కోసం సరికొత్త ఎనర్జీ, ప్యాషన్‌తో ..మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హృతిక్, పవర్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ కాంబోలో రానున్న వార్2తో ఓ ఎక్స్‌ప్లోజివ్ రైడ్‌ను ప్రారంభిస్తున్నాం. వార్ 2ను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయటం ఎంతో ఆనందంగా ఉంది. ఆగస్ట్ 14 న థియేటర్స్‌లో ఈ ఉత్సవం మొదలు కానుంది.

భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్2 యష్ రాజ్ ఫిల్మ్స్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ స్పై యూనివర్స్‌లో భాగంగా , మరో అధ్యాయంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పఠాన్, టైగర్ 3, వార్ వంటి గ్లోబల్ హిట్ మూవీస్ తర్వాత వస్తోన్న వార్ 2పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ లెవల్లో లీజ్ చేస్తుండటం ప్రేక్షకులకు పండగే.

వార్ 2 మూవీలో ఇండియన్ సినీ హిస్టరీలో ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఉండే పోటీ ప్రేక్షకులకు ఓ విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. బ్రహ్మాస్త్ర, యేహ్ జవానీ హై దీవానీ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా IMAX ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

15 hours ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

15 hours ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

15 hours ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

15 hours ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

15 hours ago