వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానున్న మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతార’ చిత్రం

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. ‘మాస్ జాతర’ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.

‘మాస్ జతర’ చిత్రం వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానుంది. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘మాస్ జాతర’ రూపొందుతోంది. వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకురానుంది. ప్రచార చిత్రాలతోనే ఈ చిత్రం ఏ స్థాయి వినోదాన్ని అందించబోతుందో అర్థమైంది.

ఇటీవల మొదటి గీతం ‘తు మేరా లవర్’ విడుదలై అందరినీ ఉర్రూతలూగిస్తోంది. ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ పాటకు ట్రిబ్యూట్ గా మలిచిన ‘తు మేరా లవర్’ గీతం అభిమానులకు విందు భోజనంలా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. ధమాకా జోడి రవితేజ-శ్రీలీల తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. ఈ జోడి మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది.

సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో ‘మాస్ జాతర’ చిత్రానికి స్వరకర్త. ధమాకా చిత్ర విజయంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ‘మాస్ జాతర’తో మరోసారి మాస్ ప్రేక్షకులను మెప్పించనున్నారు.

దర్శకుడు భాను బోగవరపు.. రవితేజ అభిమానులతో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ‘మాస్ జాతర’ను మలుస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న ఆకట్టుకునే విజువల్స్ తో పక్కా కమర్షియల్ వైబ్ తీసుకొస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి తన అనుభవంతో అసలు సిసలైన పండుగ చిత్రంగా మలుస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్ నిర్మాణ సంస్థలు వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్నాయి. ఈ వినాయక చవితికి ‘మాస్ జాతర’ చిత్రంతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకొచ్చి, అభిమానుల దాహాన్ని తీర్చడానికి సిద్ధమవుతున్నారు.

తారాగణం & సాంకేతిక బృందం:

చిత్రం: మాస్ జాతర
తారాగణం: రవితేజ, శ్రీలీల
దర్శకత్వం: భాను బోగవరపు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగాన
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌,
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

2 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

2 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

2 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

2 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

2 days ago