కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మాణంలో హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్లా జంటగా నటించిన ‘బ్యాండ్ మేళం’ ఫస్ట్ బీట్ (టైటిల్ గ్లింప్స్) రిలీజ్

Must Read

‘కోర్ట్’ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇద్దరూ ఓ అందమైన ప్రేమ కథతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ క్యూట్ కాంబోని బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. శివరాజు ప్రణవ్ ఈ చిత్రాన్ని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ మూవీని సతీష్ జవ్వాజీ తెరకెక్కిస్తున్నారు. ఈరోజు మేకర్స్ అధికారికంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టైటిల్ గ్లింప్స్‌తో ప్రకటించారు. ఈ చిత్రానికి ‘బ్యాండ్ మేళం’ అని టైటిల్‌ను పెట్టారు. “ఎవ్రీ బీట్ హ్యాజ్ యాన్ ఎమోషన్” అనేది ఉప శీర్షిక. టైటిల్ గ్లింప్స్‌ను ఫస్ట్ బీట్ అంటూ రిలీజ్ చేశారు.

తెలంగాణ యాసలో విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన అందమైన ఓ జానపద గీతంతో గ్లింప్స్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ బీట్‌లో యాదగిరి (హర్ష్ రోషన్) తన ప్రేయసి రాజమ్మ (శ్రీదేవి అపల్ల) కోసం ఇంట్లోకి వచ్చి వెతుకుతుంటాడు. తెలంగాణ యాసలో హీరో హీరోయిన్ల మధ్య జరిగే సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక చివర్లో అయితే హార్ట్ టచింగ్ ఎమోషన్, మ్యూజిక్‌తో టైటిల్ గ్లింప్స్ అందరినీ కదిలించేలా ఉంది. ఈ టైటిల్ గ్లింప్స్ చూసిన తరువాత ఓ అందమైన గ్రామీణ ప్రేమ కథను తెరపై చూడబోతోన్నామనే ఫీలింగ్ మాత్రం అందరిలోనూ కలిగింది.

ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన గీత రచయిత చంద్రబోస్ ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. శివ ముప్పరాజు ఎడిటింగ్, స్క్రీన్ ప్లే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వెర్సటైల్ యాక్టర్ సాయికుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

అద్భుతమైన సాంకేతిక బృందం, భారీ తారాగణంతో, మ్యూజికల్, ఎమోషనల్ జర్నీగా అందమైన ప్రేమ కథను త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు.

తారాగణం: రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు

సాంకేతిక బృందం:
ఏ కోన వెంకట్ ప్రొడక్షన్
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్
సమర్పణ : మ్యాంగో మాస్ మీడియా
నిర్మాతలు : కావ్య, శ్రావ్య
సహ నిర్మాత : శివరాజు ప్రణవ్
రచయిత, దర్శకుడు : సతీష్ జవ్వాజీ
సంగీతం : విజయ్ బుల్గానిన్
స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ : శివ ముప్పరాజు
డిఓపి : సతీష్ ముత్యాల
గీత రచయిత : చంద్రబోస్
ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్ నార్ని
మార్కెటింగ్ : వాక్డ్ అవుట్ మీడియా
పీఆర్వో : వంశీ కాకా

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News