బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. “ఇప్పుడే కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చింది. గత కొద్ది రోజులుగా నాతో పాటు ఉన్న వారంతా, నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోండి. జాగ్రత్తగా ఉండండి” అని మంగళవారం రాత్రి అమితాబ్ ట్వీట్ చేశారు.