‘భీమా’ మంచి ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ తో ఆడియన్స్ ని అద్భుతంగా అలరిస్తుంది: డైరెక్టర్ మారుతి
‘భీమా’ మైథాలజీ, ఫాంటసీ బ్లెండ్ చేసి మంచి కమర్షియల్ సినిమా. క్లైమాక్స్ ఫైట్ లో గోపీచంద్ గారిని చూస్తున్నపుడు పరశురాముడు ఇలానే ఉంటాడేమో అనిపించింది: డైరెక్టర్ సంపత్ నంది
మాచో హీరో గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. ఎ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా థాంక్స్ మీట్ నిర్వహించింది. దర్శకులు మారుతి, సంపత్ నంది ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
థాంక్స్ మీట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాకి చాలా మంచి ప్రసంశలు వచ్చాయి. సినిమా చాలా బావుంది, రెండు క్యారెక్టర్స్ లో చక్కని వేరియేషన్స్ చూపించారని మంచి అప్లాజ్ వచ్చింది. ఇంకా చూడని వారంతా థియేటర్స్ కి వెళ్లి చూడండి. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఎక్స్ ట్రార్డినరీగా వుంటుంది. గ్రాఫిక్స్, యాక్షన్, కామెడీ అద్భుతంగా వుంటాయి. మా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మారుతి, సంపత్ నంది గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి కథ తీసుకొచ్చి, ఆడియన్స్ కి ఏం కావాలో అలాంటి మంచి కమర్షియల్ ప్యాక్డ్ సినిమా ఇచ్చిన హర్షకి థాంక్స్. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించి ఇంత మంచి సినిమా ఇచ్చిన రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పరీక్షలు అయిపోయాయి. ఇంకా చూడనికి ప్రేక్షకులు తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’ తెలిపారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘భీమా’ పరీక్షల సమయంలో, ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా చాలా మంచి కలెక్షన్స్ తో థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కన్నడ దర్శకుడు హర్ష తెలుగు ప్రేక్షకుల నాడిని పట్టుకొని సినిమాని ఆద్యంతం చాలా గ్రిప్పింగ్ గా తీశారు. గోపీచంద్ గారికి మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు. క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలెట్. సినిమాలో చాలా మంచి ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ వుంది. అందరూ తప్పకుండా చూడండి. ఎంజాయ్ చేస్తారు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని అందించిన రాధమోహన్ గారు గట్స్ వున్న నిర్మాత. భీమా టీం అందరికీ కంగ్రాట్స్” తెలిపారు.
దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. భీమా టీం అందరికీ బిగ్ కంగ్రాట్స్. మైథాలజీ, ఫాంటసీ బ్లెండ్ చేసి ఇంత మంచి కమర్షియల్ సినిమా ఇచ్చిన గోపీచంద్ గారికి థాంక్స్ చెప్పాలి. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్ చూస్తున్నపుడు పరశురాముడు అంటే ఇలానే ఉంటాడేమో అనిపించింది. అంత బాగా ప్రజెంట్ చేసింది హర్ష గారికి థాంక్స్. రాధమోహన్ సినిమాని టాప్ క్లాస్ లో నిర్మించారు. గోపీచంద్ గారిని అద్భుతంగా ప్రజెంట్ చేసి ఈ సినిమాని తీసునందుకు ఆయనకి అభినందనలు. ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.
చిత్ర దర్శకుడు హర్ష మాట్లాడుతూ… మారుతి, సంపత్ నంది గారికి ధన్యవాదాలు. ఇది నా మొదటి తెలుగు సినిమా. నాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంత మంచి సినిమాని ఇచ్చిన నిర్మాత రాధమోహన్ గారికి, సహా నిర్మాత శ్రీధర్ గారికి ధన్యవాదాలు. గోపీచంద్ గారు అద్భుతమైన నటుడు. చాలా సార్లు నిరూపించారు. భీమాకి వచ్చిన రెస్పాన్స్ మరింత అనందం ఇచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన గోపీచంద్ గారికి ధన్యవాదాలు. ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
మాళవిక శర్మ మాట్లాడుతూ.. భీమాకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాని ముంబైలో చూశాను. అక్కడ షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత గొప్ప ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.
నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ.. థాంక్స్ మీట్ కి వచ్చిన మారుతి, సంపత్ నందికి చాలా కృతజ్ఞతలు. భీమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పుడు పరీక్షలు పూర్తయ్యాయి. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. పిల్లలు, పేరెంట్స్ కలసి ఈ సినిమా చూసి, నెక్స్ట్ వీక్ కలెక్షన్స్ ఇంకా బాగా పెరుగుతాయని భావిస్తున్నాం. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నాయి. తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…
The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…
Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…
హైదరాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…