భీమా’కు అద్భుతమైన అప్లాజ్ వస్తోంది. ఇంత మంచి హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: థాంక్స్ మీట్ లో హీరో గోపీచంద్

Must Read

‘భీమా’ మంచి ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ తో ఆడియన్స్ ని అద్భుతంగా అలరిస్తుంది: డైరెక్టర్ మారుతి

‘భీమా’ మైథాలజీ, ఫాంటసీ బ్లెండ్ చేసి మంచి కమర్షియల్ సినిమా. క్లైమాక్స్ ఫైట్ లో గోపీచంద్ గారిని చూస్తున్నపుడు పరశురాముడు ఇలానే ఉంటాడేమో అనిపించింది: డైరెక్టర్ సంపత్ నంది  

మాచో హీరో గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. ఎ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మహా శివరాత్రి సందర్భంగా  మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా థాంక్స్ మీట్ నిర్వహించింది. దర్శకులు మారుతి, సంపత్ నంది ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  

థాంక్స్ మీట్ లో  హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాకి చాలా మంచి ప్రసంశలు వచ్చాయి. సినిమా చాలా బావుంది, రెండు క్యారెక్టర్స్ లో చక్కని వేరియేషన్స్ చూపించారని మంచి అప్లాజ్ వచ్చింది. ఇంకా చూడని వారంతా థియేటర్స్ కి వెళ్లి చూడండి. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఎక్స్ ట్రార్డినరీగా వుంటుంది. గ్రాఫిక్స్, యాక్షన్, కామెడీ అద్భుతంగా వుంటాయి. మా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మారుతి, సంపత్ నంది గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి కథ తీసుకొచ్చి, ఆడియన్స్ కి ఏం కావాలో అలాంటి మంచి కమర్షియల్ ప్యాక్డ్ సినిమా ఇచ్చిన హర్షకి థాంక్స్. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించి ఇంత మంచి సినిమా ఇచ్చిన రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పరీక్షలు అయిపోయాయి. ఇంకా చూడనికి ప్రేక్షకులు తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’ తెలిపారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘భీమా’ పరీక్షల సమయంలో, ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా చాలా మంచి కలెక్షన్స్ తో థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.  కన్నడ దర్శకుడు హర్ష తెలుగు ప్రేక్షకుల నాడిని పట్టుకొని సినిమాని ఆద్యంతం చాలా గ్రిప్పింగ్ గా తీశారు. గోపీచంద్ గారికి మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు. క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలెట్. సినిమాలో చాలా మంచి ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ వుంది. అందరూ తప్పకుండా చూడండి. ఎంజాయ్ చేస్తారు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని అందించిన రాధమోహన్ గారు గట్స్ వున్న నిర్మాత. భీమా టీం అందరికీ కంగ్రాట్స్” తెలిపారు.

దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. భీమా టీం అందరికీ బిగ్ కంగ్రాట్స్. మైథాలజీ, ఫాంటసీ బ్లెండ్ చేసి ఇంత మంచి కమర్షియల్ సినిమా ఇచ్చిన గోపీచంద్ గారికి థాంక్స్ చెప్పాలి. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్ చూస్తున్నపుడు పరశురాముడు అంటే ఇలానే ఉంటాడేమో అనిపించింది. అంత  బాగా ప్రజెంట్ చేసింది హర్ష గారికి థాంక్స్. రాధమోహన్ సినిమాని టాప్ క్లాస్ లో నిర్మించారు. గోపీచంద్ గారిని అద్భుతంగా ప్రజెంట్ చేసి ఈ సినిమాని తీసునందుకు ఆయనకి అభినందనలు. ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

చిత్ర దర్శకుడు హర్ష మాట్లాడుతూ… మారుతి, సంపత్ నంది గారికి ధన్యవాదాలు. ఇది నా మొదటి తెలుగు సినిమా. నాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇంత మంచి సినిమాని ఇచ్చిన నిర్మాత రాధమోహన్ గారికి, సహా నిర్మాత శ్రీధర్ గారికి ధన్యవాదాలు. గోపీచంద్ గారు అద్భుతమైన నటుడు. చాలా సార్లు నిరూపించారు. భీమాకి వచ్చిన రెస్పాన్స్ మరింత అనందం ఇచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన గోపీచంద్ గారికి ధన్యవాదాలు. ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

మాళవిక శర్మ మాట్లాడుతూ.. భీమాకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాని ముంబైలో చూశాను. అక్కడ షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత గొప్ప ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.

నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ.. థాంక్స్ మీట్ కి వచ్చిన మారుతి, సంపత్ నందికి చాలా కృతజ్ఞతలు. భీమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పుడు పరీక్షలు పూర్తయ్యాయి. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. పిల్లలు, పేరెంట్స్ కలసి ఈ సినిమా చూసి, నెక్స్ట్ వీక్ కలెక్షన్స్ ఇంకా బాగా పెరుగుతాయని భావిస్తున్నాం. ప్రేక్షకుల  నుంచి వచ్చిన స్పందన చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నాయి. తప్పకుండా చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News