వరలక్ష్మీ శరత్ కుమార్ ‘అర్జునుడి గీతోపదేశం’ గ్రాండ్ గా ప్రారంభం

ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ మెయిన్ లీడ్ గా, అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్ ఇతర ప్రధాన పాత్రలలో సతీష్ గోగాడ దర్శకత్వంలో ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం#1 గా రూపొందనున్న చిత్రం ‘అర్జునుడి గీతోపదేశం’. త్రిలోక్ నాథ్.కె, ప్రదీప్ రెడ్డి.వి నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది.

ముహూర్తపు సన్నివేశానికి కనుమెలి అమ్మిరాజు క్లాప్ కొట్టగా మల్లాల సీతారామరాజు కెమరా స్విచాన్ చేశారు. త్రిలోక్ నాథ్, పూజిత స్క్రిప్ట్ అందించగా లక్కంశెట్టి వేణు గోపాల్ తొలిషాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు.

రాజీవ్, ఆదిత్య శశికుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా, చైతన్య కందుల డీవోపీగా, అర్జున్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

మూవీ లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు సతీష్ గోగాడ మాట్లాడుతూ.. దర్శకునిగా ఇది నా తొలి చిత్రం. ఈ కథ చెప్పినపుడు నటీనటులంతా చాలా పాజిటివ్ గా స్పందించారు. మార్చి 20 నుంచి మొదటి షెడ్యుల్ అమలాపురంలో మొదలుపెడుతున్నాం. తర్వాత వైజాగ్, హైదరాబాద్, చెన్నై లో తర్వాత షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాం.  

నిర్మాత మాట్లాడుతూ.. ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ లో ఇది మొదటి సినిమా. సతీష్  చెప్పిన కథ చాలా అద్భుతంగా అనిపించింది. ప్రేక్షకులందరినీ అలరించేలా ఈ సినిమా వుంటుంది” అన్నారు

రాజీవ్ మాట్లాడుతూ.. దర్శకుడు సతీష్ కి సినిమా అంటే చాలా పాషన్. కథ చెప్పినపుడు చాలా ప్లజెంట్ గా అనిపించింది. మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. యంగ్ టీంతో ఈ సినిమా చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ కావాలి’ అన్నారు.

దివిజ మాట్లాడుతూ.. చాలా మంచి కథ ఇది. ఇందులోలీడ్ రోల్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. చాలా మంచి టీంతో కలసి ఈ సినిమా చేస్తున్నాం” అన్నారు.  

తారాగణం: వరలక్ష్మి శరత్‌కుమార్, అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్, రాజీవ్, ఆదిత్య శశికుమార్ తదితరులు
సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం: సతీష్ గోగాడ
నిర్మాతలు : త్రిలోక్ నాథ్.కె, ప్రదీప్ రెడ్డి.వి
సంగీతం: చరణ్ అర్జున్
డివోపీ: చైతన్య కంధుల
ఆర్ట్: కె.వి.రమణ
ఎడిటర్: అర్జున్
లైన్ ప్రొడ్యూసర్: నాని రెడ్డి కె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరికృష్ణ బోగ
విజువల్ డిపార్ట్‌మెంట్:  రామ్ ధనుష్ వర్మ
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాము తాటిపాక
కొరియోగ్రఫర్:  విజయ్ పోలంకి  
పి.ఆర్.ఓ. వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

19 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

19 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

19 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago