Categories: English

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో “దీక్ష”

ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌, ఆర్ కె. గౌడ్ నిర్మాతలు. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపారు దర్శక నిర్మాత ఆర్ కే గౌడ్.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ – మా ‘దీక్ష’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, గ్రాఫిక్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో 5 పాటలున్నాయి. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఆక్సఖాన్ స్పెషల్ సాంగ్ లో అద్భుతమైన డాన్స్ చేసింది. జె వి ఆర్ మంచి క్యారెక్టర్ లో నటించారు. “దీక్ష” ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించాం. ఈ పాయింట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన లైఫ్ లో కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనతోనే ఉంటాయి. ఈ మూవీలో హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. మా ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు వెనకుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా అన్నారు.

నటి అక్సాఖాన్ మాట్లాడుతూ – ‘దీక్ష’ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ ఇది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్. ఈ చిత్రంతో పాటు 18 భాషల్లో వస్తున్న మహిళా కబడ్డి మూవీలోనూ ఆర్కే గౌడ్ గారు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది అన్నారు.

నటుడు జె వి ఆర్ మాట్లాడుతూ “దీక్ష” సినిమాలో ప్రిన్సిపాల్ గా మంచి కారెక్టర్ చేశాను. కామెడీ, సీరియస్ కలగలసిన పాత్ర నాది. డైరెక్టర్ ఆర్ కె గౌడ్ గారు నాకు గొప్ప పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. కొత్త పాత నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago