టాలీవుడ్

జ‌న‌వ‌రి 11న రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేయ‌నున్న‌ యంగ్ హీరో శివ కందుకూరి “భూతద్ధం భాస్కర్‌ నారాయణష టీం

పురుషోత్తం రాజ్‌ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌…

3 years ago

‘వారసుడు’ తెలుగులో జనవరి 14 న విడుదల చేస్తున్నాం. నిర్మాత దిల్ రాజు

మన తెలుగు బిగ్గర్ స్టార్స్ చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కి గ్రాండ్ గా విడుదల కావాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘వారసుడు’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. తెలుగులో పెద్ద విజయం సాధిస్తుంది: నిర్మాత దిల్ రాజు దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు (సోమవారం) వారసుడు తెలుగు విడుదల తేదిని తెలియజేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘వారసుడు’ చిత్రాన్ని సంక్రాంతి వారసుడిగా జనవరి 14న విడుదల చేస్తున్నాం. తమిళ్ లో ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న విదుదలౌతుంది.  ఈ నిర్ణయం వెనుక వున్న కారణం.. జనవరి 12 బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డి, జనవరి 13న చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలౌతున్నాయి. ప్రతి థియేటర్ లో ముందు మన తెలుగు బిగ్గర్ స్టార్స్ సినిమాలు పడాలి. అన్ని చోట్ల వారికి థియేటర్లు దొరకాలి. తర్వాతే నా సినిమా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. సంక్రాంతి సినిమాలకి మా వారసుడు పోటి కాదని మొదటి నుండి చెబుతున్నాను. మాది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్రేక్షకులకు సంక్రాంతి వారసుడు చేయాలనేదే నా ప్రయత్నం. బాలకృష్ణ గారి చిరంజీవి గారి సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద రిలీజ్ కావాలి. తర్వాత నా సినిమా రావాలని పాజిటివ్ గానే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం పట్ల ఇండస్ట్రీ పెద్దలు చాలా ఆనందం వ్యక్తం చేశారు. అందరం బావుండాలనే నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను.  11న తమిళ్ లో విడుదలౌతున్న ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ కాబోతుంది. ఒక చోట విజయం సాధిస్తే ఆ చిత్రాన్ని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగా వుంటారు. కాంతార, లవ్ టుడే చిత్రాలు ఇది నిరూపించాయి.  మా గత చిత్రాలు సీతమ్మ వాకిట్లో, ఎఫ్ 2, శతమానం భవతి సినిమాల్లనే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసే చిత్రం వారసుడు. ఒక మంచి సినిమా చుశామనే అనుభూతిని ఇస్తుంది వారసుడు. ఇది దిల్ రాజు బ్రాండ్. తమన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. విజయ్ ఆల్రెడీ సూపర్ స్టార్. ఇందులో అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో శరత్ కుమార్,  జయసుధగారు తల్లితండ్రులుగా.. విజయ్, శ్రీకాంత్ శ్యాం బ్రదర్స్ గా కనిపిస్తారు. ఇది పక్కా ఫ్యామిలీ స్టొరీ. ఇందులో ఫ్యామిలీ కోణంలో ఒక కొత్త పాయింట్ చెబుతున్నాం. సినిమా చూసి వచ్చేటప్పుడు ఆ పాయింట్ ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది. ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా ఫీలౌతారు. ఒక మంచి సినిమా చూసామని ఫీలింగ్ తో ప్రేక్షకులు బయటికి వస్తారు. మా సంక్రాంతి వారసుడు మళ్ళీ సంక్రాంతికి తెలుగులో కూడా ఒక మంచి హిట్ సినిమా కాబోతుంది’’ అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. వారసుడు యునివర్సల్ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. మన తెలుగు స్టార్స్ కి గౌరవం ఇస్తూ.. ఇన్ని కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాని 14కి వాయిదా వేయడం నిజంగా గ్రేట్. దిల్ రాజు గారికి హ్యాట్సప్. ఇంత సాహసం ఏ నిర్మాత చేయరు. వారసుడు నా తొలి తమిళ సినిమా. అలాగే దిల్ రాజు గారి బ్యానర్ లో చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా గురించి చెప్పాలంటే విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు గారి గురించి చెప్పాలి. విజయ్ తో సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసి చాలా కాలమైయింది. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఇది తెలుగు సినిమాలానే ఫీలౌతాము. వారసుడు సంక్రాంతికి లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తుందని నమ్ముతున్నాను. వారసుడు సూపర్ డూపర్ హిట్ అవుతుంది.’’ అన్నారు

3 years ago

వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది : మాస్ మహారాజా రవితేజ

వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది : మాస్ మహారాజా రవితేజ వాల్తేరు వీరయ్య గుండెల్లో నాటుకుపోతుంది. పూనకాలు అందరికీ రీచ్ అవుతాయి: దర్శకుడు…

3 years ago

హైదరాబాద్ లో సినిమా అంతటి భారీ సెట్టింగ్స్ లో “లూయిస్ పార్క్” యాడ్ షూటింగ్ జరుపుకుంటున్న బిగ్ బాస్ యాంకర్ రవి, జబర్దస్త్ రాకింగ్ రాకేష్

హైదరాబాద్ లో సినిమా అంతటి భారీ సెట్టింగ్స్ లో "లూయిస్ పార్క్" యాడ్ షూటింగ్ జరుపుకుంటున్న బిగ్ బాస్ యాంకర్ రవి, జబర్దస్త్ రాకింగ్ రాకేష్ కమర్షియల్…

3 years ago

‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న పాన్ ఇండియా నటుడు సముద్రఖని

‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో భాగంగా దర్శకుడు ఎం.శశికుమార్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించిన ‘పాన్ ఇండియా నటుడు సముద్రఖని’ ఈరోజు హైటెక్ సిటీ లోని శిల్పారామంలో…

3 years ago

ఏ జర్నీ టు కాశీ జనవరి 6న విడుదల

నేటి కాలంలో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి - ఏ జర్నీ టు కాశీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు శేఖర్ సూరి  వారణాసి…

3 years ago

కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదలైన ‘పాప్ కార్న్’ ట్రైలర్..

ముఖ ప‌రిచ‌యం లేని అబ్బాయి, అమ్మాయి ఓ షాపింగ్ మాల్‌లోకి ఎంట‌ర్ అవుతారు. అక్క‌డ షాపింగ్ పూర్తి చేసుకుంటారు. లిఫ్ట్ ఎక్కుతారు. ఎక్క‌గానే ఆ అమ్మాయి తాను…

3 years ago

సందీప్ కిషన్, విజయ్ సేతుపతి మైఖేల్ ఫిబ్రవరి 3న విడుదల

ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్'. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్, ఇటీవల విడుదలైన 'నువ్వుంటే…

3 years ago

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల’ఉగ్రం’ ఏప్రిల్ 14న విడుదల

అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న…

3 years ago

మన్మధరాజా ట్రైలర్ విడుదల

మాక్ కింగ్స్ క్రియేషన్స్ పతాకంపై రోషన్, పూజ డే, అమీక్ష పవర్ హీరో, హీరోయిన్స్ గా యం.డి. అభిద్ దర్శకత్వంలో  యం.డి. అహ్మద్ ఖాన్ నిర్మించిన  చిత్రం…

3 years ago