దిల్ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెరకెక్కించారు. మార్చి 3న విడుదలైన చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని రోజు రోజుకీ ఆదరణ పొందుతూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు హర్షిత్, హన్షిత ‘బలగం’ సినిమా గురించి మీడియాతో ప్రత్యేంగా మాట్లాడుతూ…
– ‘బలగం’ మూవీ సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఉండగా దిల్ రాజు ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేయటానికి కారణం.. మా ఎస్‌వీసీ బ్యానర్‌లో ఇప్పుడు అన్నీ భారీ చిత్రాలే చేస్తున్నారు. వేర్వేరు లాంగ్వేజెస్‌లో చేస్తున్నారు. డాడీ (దిల్ రాజు) కొత్త వాళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ మిస్ అవుతున్నాయి. డిఫరెంట్ సినిమాలు చేయాలనేదే ఈ బ్యానర్ టార్గెట్. అందులో కమర్షియల్ సినిమాలు కూడా ఉంటాయి. ఏదైనా సరే! కొత్తగా ట్రై చేయాలనేదే మా ప్రయత్నం.
– వేణు ఎల్దండి కథ చెప్పినప్పుడు మన ఊర్లో జరిగే పరిస్థితులన్నీ గుర్తుకు వచ్చాయి. అదీ గాక చాలా విషయాలు మన జీవితంలో జరిగేవే. ఉదాహరణకు బలగం సినిమాలో కొమరయ్య చనిపోయినప్పుడు కొడుకులిద్దరూ గొడవపడతారు. అలాంటిదే తన ఇంట్లో కూడా జరిగిందని మా ఫ్రెండ్ చెప్పాడు. అలాగే చావు ఇంట్లో టీవీ ప్లే చేయకూడదని విషయాలు.. అన్నీ మనకు ఎక్కడో అక్కడ జరిగే ఉంటాయి. అలాంటి రియల్ సిట్యువేషన్స్‌ను క్యాప్చర్ చేశాం. కానీ ఇంత రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.
– నేను షూటింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్‌కి మూడు సార్లు వెళ్లాను. ఓసారి ప్రియదర్శి క్యారెక్టర్‌లో ఉన్నాడా? లేదా? అని చూసుకోవడానికి వెళ్లాను. శవయాత్ర సన్నివేశం చిత్రీకరించేటప్పుడు నాకు ఆ మాస్టర్ కావాలన్నప్పుడు ఆయన్ని అరెంజ్ చేసిచ్చాను. పక్కరోజు వెళ్లి ఇంకేం కావాలని అడిగాను. సాంగ్ సపోర్ట్‌కు ఏం కావాలనేది వేణు అడిగినప్పుడు వెళ్లి చూశాను. హన్షిత అయితే అడ్మినస్ట్రేషన్.. ఎడిటింగ్ విషయాలను చూసుకుంది.
– గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజుగారు, శిరీష్‌గారి సలహాలు తీసుకునేవాళ్లం కానీ ఫైనల్ నిర్ణయం మా ఇద్దరిదే ఉండేది.
– రాజుగారు చాలా సార్లు సినిమా చూశారు. సినిమా అంతా రెడీ అయ్యింది. ప్రమోషన్స్‌కు ఎలా తీసుకెళ్లాలని ఆయనకు ఫోన్ చేసినప్పుడు కొంత సేపు ఆగు ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. ఎమోషన్‌లో ఉన్నానని అన్నారు. అప్పుడు సినిమా కరెక్ట్ వేలో ఉందనిపించింది. మా ఇద్దరినీ హత్తుకుని ఎంత గొప్ప సినిమా తీశారో మీకు తెలియటం లేదు. భవిష్యత్తులో మీరు ఎన్ని గొప్ప సినిమాలైనా తీయొచ్చు. కానీ ఇది మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.
– రోజురోజుకీ సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు మంచి కలెక్షన్స్‌ను రాబట్టుకుంటోంది. ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనే చేశాం. మధ్యలో కాస్త బడ్జెట్ పెరగటంతో పాటు థియేటర్స్‌కు జనాలు రావటం తక్కువైంది. అలాంటి నేపథ్యంలో బలగం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేద్దామ అనే ఆలోచనలో కూడా ఉన్నాం.
– మా బ్యానర్‌లో న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ఎప్పుడూ సిద్ధం. అందుకు ఓ టీమ్ కూడా ఉంది.వాళ్లు స్క్రిప్ట్స్ వింటున్నారు. అదీగాక మా బ్యానర్ మెయిల్ ఐడీ ఉంది. దానికి కూడా స్క్రిప్ట్స్ పంపొచ్చు. మంచి కథ వచ్చినప్పుడు ఓ కలెక్టివ్ డిసిషన్ తీసుకుని రాజుగారి దగ్గరకు వెళతాం.
– అన్నీ రకాల జోనర్స్‌లో సినిమాలు చేయటానికి సిద్ధం. అలాగే ఇంతే బడ్జెట్‌లో సినిమాలు చేయాలని అనుకోం. కథ డిమాండ్ చేసి, మంచి హీరో ఉంటే బావుంటుందనిపించినప్పుడు బడ్జెట్ ఎక్కువైన సినిమాలు చేస్తాం.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…