టాలీవుడ్

అవతార్2 ది వే ఆఫ్‌ వాటర్ తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ రాసిన శ్రీనివాస్ అవసరాల

జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి 'అవతార్'. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'అవతార్-‌2- ది వే ఆఫ్‌ వాటర్' రూపొందించారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం జేమ్స్‌ కామెరూన్‌ అండ్ టీం సంవత్సరాల కాలం పాటు పనిచేసి మరోసారి అద్భుతమైన, హై-ఎండ్ స్టీరియోస్కోపీని అందించనున్నారు. 'అవతార్ 2' ప్రపంచ సినీ చరిత్రలో నాల్గవ అత్యంత ఖరీదైన చిత్రం. గత అవతార్‌ రికార్డులని బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా 'అవతార్ 2' సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని భావిస్తున్నారు. అనేక ఇతర భాషలతో పాటు, అవతార్ 2 తెలుగు వెర్షన్ కూడా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఆసక్తికరమైన అప్‌ డేట్ ఏమిటంటే.. తెలుగు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కూడా ఈ అద్భుత చిత్రం కోసం పని చేశారు. 'అవతార్-‌2- ది వే ఆఫ్‌ వాటర్' తెలుగు వెర్షన్‌ కి డైలాగ్స్ రాశారు శ్రీనివాస్ అవసరాల. రచయిత- దర్శకుడైన శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రైటింగ్ విలక్షణంగా వుంటుంది. అవతార్ 2 తన మార్క్ డైలాగులతో తెలుగు ప్రేక్షకులకు మరింత ప్రత్యేకం కానుంది. 'అవతార్-‌2- ది వే ఆఫ్‌ వాటర్' విజువల్ గ్రాండియర్‌ను తెరపై చూడాలంటే మరో నాలుగు రోజులు ఆగాలి.

2 years ago

విశాల్ ఎ వినోద్ కుమార్  లాఠీ ట్రైలర్ విడుదల

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’.  రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్‌ తో కూడిన ‘లాఠీ’ టీజర్‌ కు ట్రెమండస్  రెస్పాన్ వచ్చింది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ ని విడుదల చేశారు. తీవ్రంగా గాయపడిన విశాల్ డంప్ యార్డ్‌ లో నగ్నంగా నడుస్తున్నట్లుగా ట్రైలర్‌ ప్రారంభమైయింది. నేరస్థులను లాఠీ తో కొట్టడానికి తన పై అధికారుల నుండి ఆదేశాలు పొందేందుకు ఇష్టపడే నిజాయితీ గల పోలీసు అధికారిగా విశాల్ పరిచమయ్యారు. ''మీ లాంటి వాళ్ళని చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే..  అది మాకు పై అధికారులు ఇచ్చే ఆర్డర్ కాదురా.. ఆఫర్'' అని విశాల్ చెప్పిన డైలాగ్ తన పాత్రలోని ఇంటెన్స్ ని తెలియజేస్తోంది. నిజాయితీగా నిర్వహించే తన కర్తవ్యం.. అతనికి కష్టాలను తెచ్చిపెడుతుంది. సునైనా విశాల్ భార్యగా నటించింది. ట్రైలర్ లో రొమాంటిక్ పార్ట్ కూడా చూపించారు. వీరికి 10 ఏళ్ల బాబు కూడా వున్నాడు. ట్రైలర్   సినిమాలోని అన్ని అంశాలను చూపించింది. అయితే యాక్షన్ పార్ట్ మన దృష్టిని ఆకర్షిస్తుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో భారీ స్టంట్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ గా వున్నాయి. విశాల్ ఇంటెన్స్ రోల్ లో కనిపించగా..  సునైనా కూల్‌ క్యారెక్టర్ లో కనిపించింది. బాలసుబ్రమణియన్ వండర్ ఫుల్ ఫ్రేమ్‌లు, యువన్ శంకర్ రాజా అద్భుతమైన బిజియం  ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్‌ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 22న 'లాఠీ' అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. తారాగణం: విశాల్, సునైనా సాంకేతిక విభాగం: దర్శకత్వం: ఎ వినోద్ కుమార్ నిర్మాతలు: రమణ, నంద బ్యానర్: రానా ప్రొడక్షన్స్ రచన: పొన్ పార్థిబన్ సంగీతం: యువన్ శంకర్ రాజా డీపీవో: బాలసుబ్రమణియన్ స్టంట్స్: పీటర్ హెయిన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల గోపి పీఆర్వో: వంశీ-శేఖర్

2 years ago

ప్రేమ ట్విస్టులతో “అమ్మాయిలు అర్థంకారు”

"1940లో ఒక గ్రామం'',"'కమలతో నా ప్రయాణం", "జాతీయ రహదారి" వంటి అవార్డు సినిమాల దర్శకుడునరసింహ నంది తెరకెక్కిస్తున్న తాజా సినిమా "అమ్మాయిలు అర్థంకారు". అల్లం శ్రీకాంత్, ప్రశాంత్,…

2 years ago

” దోచేవారేవారురా!” (కల్లాసు అన్నీ వర్రీసు…నువ్వేలే ..నీ బాసు.) పాటకు అనూహ్య స్పందన..

ఐ క్యూ క్రియేషన్స్ బ్యానర్ లో బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత గా ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "దోచేవారేవారురా!" ఈచిత్రం లోని " కల్లాసు…

2 years ago

పోస్ట్ ప్రొడక్షన్ లో ”నేనే సరోజ” !

యంగ్ హీరో కౌశిక్ బాబు, శాన్వి మేఘన జంటగా శ్రీమాన్ గువ్వడవెల్లి దర్శకత్వంలో  ఎస్ 3 క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై రచయిత డా. సదానంద్ శారద…

2 years ago

‘రుద్రంగి’ సినిమా బుజ్జమ్మ క్యారెక్టర్ మోషన్ పోస్టర్ రిలీజ్

సినిమాలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్చేస్తోంది 'రుద్రంగి'. ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే, కవి, గాయకుడు, రాజకీయవేత్త  శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్…

2 years ago

లారెన్స్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ‘జిగర్ తండా 2’

వెర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్న చిత్రం ‘జిగర్‌తండా 2’ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.…

2 years ago

”నేను స్టూడెంట్ సర్!’ ఫస్ట్ సింగిల్ మాయే మాయే ని లాంచ్ చేసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని

బెల్లంకొండ గణేష్, రాఖీ ఉప్పలపాటి,‘నాంది’ సతీష్ వర్మ, ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్స్ 'స్వాతిముత్యం' ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్  తన రెండో సినిమా ''నేను స్టూడెంట్ సార్!' తో ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. ఎస్వీ2 ఎంటర్‌ టైన్‌ మెంట్ బ్యానర్‌ లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని 'నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ''నేను స్టూడెంట్ సర్!'  టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.  ఇప్పుడు, మేకర్స్  మ్యూజికల్ ప్రమోషన్లను ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్  గోపీచంద్ మలినేని ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మాయే మాయే లిరికల్ వీడియోను లాంచ్ చేశారు. క్యాచి ట్యూన్ తో ఆకట్టుకునే మెలోడీ గా ఈ పాటని స్వరపరిచారు మహతి స్వర సాగర్. మహతితో పాటు కపిల్ కపిలన్‌ ఈ పాటని మ్యాజికల్ గా ఆలపించారు.  కృష్ణ చైతన్య సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథానాయకుడు గణేష్‌ కి అవంతిక దస్సానిపై ఉన్న ప్రేమను ఈ పాట వర్ణిస్తుంది. శ్రోతలను ఆకట్టుకోవడానికి కావాల్సిన అన్ని అంశాలు మాయే మాయే పాటలో వున్నాయి. మహతి మొదటి పాటతోనే చార్ట్ బస్టర్ నెంబర్ ని అందించారు. గణేష్, అవంతిక ఇద్దరూ తెరపై కూల్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథను కృష్ణ చైతన్య అందించారు. అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి శివతేజ తదితరులు. సాంకేతిక విభాగం దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి నిర్మాత: ‘నాంది’ సతీష్ వర్మ సంగీతం: మహతి స్వర సాగర్ డీవోపీ: అనిత్ మధాడి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ కథ: కృష్ణ చైతన్య డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి కొరియోగ్రఫీ: రఘు మాస్టర్ ఫైట్స్: రామకృష్ణన్…

2 years ago

‘వాల్తేరు వీరయ్య’ నుండి మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ లుక్, టీజర్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' ను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో…

2 years ago

<strong>సుప్రసిద్ధ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘14 డేస్ లవ్’లోని ‘ఏమ్ మాయో చేసేసి’ లిరికల్ సాంగ్ విడుదల</strong>

అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో.. సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మనోజ్, చాందిని భగవానిని హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘14 డేస్ లవ్’. నాగరాజ్ బొడెమ్ దర్శకత్వంలో డి.…

2 years ago