మైత్రేయ మోషన్ పిక్చర్స్యు పతాకంపై యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మాతగా యువ నటుడు జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు సాందీప్…
వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా…
ప్రస్తుత జీవితంలో మనందరికీ సోషల్ మీడియా అనేది తప్పనిసరి అయ్యింది. ఎక్కడో చిన్న పల్లెటూరు లో ఉన్న వారు సైతం ఒక వైపు చదువుకుంటూ, మరో వైపు…
ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా…
హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదలయంగ్ హీరో విజయ్ శంకర్, `బిగ్‌బాస్` ఫేమ్ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్నచిత్రం `ఫోకస్`. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక…
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ధమాకా విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇటివలే విడుదలైన మాస్ క్రాకర్ టీజర్ సినిమా ట్యాగ్ లైన్ కి తగ్గట్టు ‘డబుల్ ఇంపాక్ట్’ క్రియేట్ చేసింది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తారాగణం: రవితేజ, శ్రీలీల సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఫైట్స్: రామ్-లక్ష్మణ్ ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల పీఆర్వో: వంశీ-శేఖర్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల భారీ అంచనాలున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ఏజెంట్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఏజెంట్ 2023 సంక్రాంతికి విడుదల కానుంది. విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. గూఢచారిగా యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనిపించబోతున్న ఈ చిత్రం కోసం అఖిల్ మేకోవర్ అద్భుతంగా వుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అఖిల్ సూట్‌లో స్లిక్ అండ్ మోడరన్గా ఆకట్టుకున్నాడు. అఖిల్ స్టైలిష్ అండ్ డైనమిక్ రోల్‌లో కనిపించనున్న ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత భారీగా పెరిగాయి. సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా నటిస్తుండగా, మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమరామెన్ గా హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్ టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారుఅజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలు గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది. తారాగణం: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి సాంకేతిక విభాగం : దర్శకత్వం: సురేందర్ రెడ్డి నిర్మాత: రామబ్రహ్మం సుంకర సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా కథ: వక్కంతం వంశీ సంగీతం: హిప్ హాప్ తమిజా డీవోపీ : రసూల్ ఎల్లోర్ ఎడిటర్: నవీన్ నూలి ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా పీఆర్వో: వంశీ-శేఖర్
దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారసుడు'/ వారిసు చిత్రం చివరి షెడ్యూల్ మినహా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెల నుంచి సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి.దీపావళి సందర్భంగా 2023 సంక్రాంతికి వారసుడు/వారిసుని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో మేకర్స్ పండుగ సీజన్ ను సద్వినియోగం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విజయ్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, ఒక పెద్ద సుత్తిని పట్టుకొని కనిపించారు. యాక్షన్-బ్లాక్ ని సూచిస్తున్న ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. క్లాసియెస్ట్ బెస్ట్ లుక్ లో విజయ్‌ని ప్రజంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్, సెకండ్ లుక్ పోస్టర్ లకు భారీ స్పందన వచ్చింది. టైటిల్, పోస్టర్లు భారీ అంచనాలను నెలకొల్పాయి. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక.ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం.భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు.సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు. తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు సాంకేతిక విభాగం: దర్శకత్వం: వంశీ పైడిపల్లి కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సంగీతం: ఎస్ థమన్ డీవోపీ: కార్తీక్ పళని ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్ డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్ ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్ మేకప్: నాగరాజు కాస్ట్యూమ్స్: దీపాలి నూర్ పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న వీఎఫ్ఎక్స్: యుగంధర్ పీఆర్వో: వంశీ-శేఖర్
మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యునిక్ యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. ఇందులో హీరో సుశాంత్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.దీపావళి పండుగ సందర్భంగా సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 7,2023న వేసవిలో రావణాసుర సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. క్యారికేచర్‌గా రూపొందించిన అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రవితేజ సిగరెట్ తాగుతూ ఇంటెన్స్ గెటప్ లో కనిపించారు. సుధీర్ వర్మ, రవితేజను గతంలో ఎన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నారు. యాక్షన్ హైలైట్‌గా ఉండేలా సినిమాలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్ తో కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు. సాంకేతిక విభాగం దర్శకత్వం: సుధీర్ వర్మ నిర్మాత: అభిషేక్ నామా బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్ ఎడిటర్: శ్రీకాంత్ ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్కే కిరణ్ సీఈఓ: పోతిని వాసు మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు పీఆర్వో: వంశీ-శేఖర్
శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కబోతోన్న చిత్రం ‘రైస్ మిల్’. యూత్ ఫుల్ డ్రామాగా రూపుదిద్దుకోబోతోన్న ఈ…