టాలీవుడ్

దళపతి విజయ్ వారిసు ఫస్ట్ సింగిల్ విడుదల

దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్,  పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారసుడు'/ వారిసు సంక్రాంతి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్ లో ఒకటి. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌ టైనర్‌లో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక.ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ సినిమాపై భారీ బజ్ వుంది. సినిమా పోస్టర్‌ లు కూల్‌ గా, కలర్‌ఫుల్‌ గా కనిపించాయి. ఇందులో విజయ్,  రష్మికల జోడి లవ్లీగా కనిపించింది.ఫస్ట్ సింగిల్ ప్రోమోతో ఆసక్తిని పెంచిన మేకర్స్ ఈ రోజు ఎంతగానో ఎదురుచూస్తున్న రంజితమే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సూపర్ ఫామ్‌ లో ఉన్న ఎస్ థమన్ ఈ పాట కోసం ఫుట్‌ట్యాపింగ్ నంబర్‌ ను స్కోర్ చేశారు. ఎమ్ఎమ్ మానసితో కలిసి విజయ్ స్వయంగా హై బీట్‌, ఎనర్జిటిక్ గా పాడటం అద్భుతంగా వుంది. విన్న వెంటనే ఉత్సాహాన్ని పెంచుతోంది. విజయ్ వాయిస్ ఈ పాటకు మరింత ఆకర్షణగా నిలిచింది. వివేక్ సాహిత్యం అందించారు. విజయ్‌, జానీ మాస్టర్‌ల కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులకు విజయ్ డ్యాన్స్ చేయడం చూడటం ఎప్పుడూ ట్రీట్‌ గా ఉంటుంది. డ్యాన్స్‌లు ట్రెండీగా, గ్రేస్ ఫుల్ గా  ఉన్నాయి. ఈ పాటలో రష్మిక మందన్న స్టన్నింగ్ గా కనిపించింది. సెట్టింగ్,  బ్యాక్‌డ్రాప్‌లు వైబ్రెటింగా వున్నాయి. మొత్తంమీద ఇది మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే డ్యాన్స్ ట్రాక్. వైరల్ అవ్వడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ పాటలో వున్నాయి. తెలుగు వెర్షన్ పాటను త్వరలో విడుదల చేయనున్నారు.ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు. తారాగణం: విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు సాంకేతిక విభాగం: దర్శకత్వం: వంశీ పైడిపల్లి కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌  నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా సహ నిర్మాతలు: శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సంగీతం: ఎస్ థమన్ డీవోపీ: కార్తీక్ పళని ఎడిటింగ్:  కెఎల్ ప్రవీణ్ డైలాగ్స్, అడిషనల్ స్క్రీన్ ప్లే: వివేక్ ప్రొడక్షన్ డిజైనర్లు: సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బి శ్రీధర్ రావు, ఆర్ ఉదయ్ కుమార్ మేకప్: నాగరాజు కాస్ట్యూమ్స్: దీపాలి నూర్ పబ్లిసిటీ డిజైన్స్: గోపి ప్రసన్న వీఎఫ్ఎక్స్: యుగంధర్

2 years ago

‘కోరమీను’ టీజర్ విడుదల చేసిన గోపీచంద్ మలినేని

ఆనంద్ రవి కథానాయకుడిగా ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'కోరమీను'. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం…

2 years ago

నవంబర్ 25న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ విడుదల

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా టీజర్‌, మెలోడీ సాంగ్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో అల్లరి నరేష్‌  గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకోని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యమౌతుంది.  నవంబర్ 11న కాకుండా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో గిరిజన ప్రాంతంలో పోలీసు అధికారులతో ప్రయాణిస్తూ విచారిస్తున్నట్లు కనిపించారు అల్లరి నరేష్.ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా,  బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్ నిర్మాత: రాజేష్ దండా నిర్మాణం: జీ స్టూడియోస్,  హాస్య మూవీస్ సహ నిర్మాత: బాలాజీ గుత్తా సంగీతం: శ్రీచరణ్ పాకాల డైలాగ్స్: అబ్బూరి రవి డీవోపీ: రాంరెడ్డి ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ స్టంట్స్: పృథ్వీ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, బిన్నీ డిఐ - అన్నపూర్ణ స్టూడియోస్ పీఆర్వో: వంశీ-శేఖర్

2 years ago

ప్రేక్షకులకు ధన్యవాదాలు మా సినిమాను ఆదరిస్తునందుకు

విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై నందు విజ‌య్‌కృష్ణ హీరోగా.. యాంక‌ర్ ర‌ష్మి గౌతమ్ హీరోయిన్ గా రాజ్ విరాట్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ప్రవీణ్ పగడాల, బోసుబాబు…

2 years ago

చిక్లెట్స్ ఫస్ట్ లుక్‌ విడుదల చేసిన శ్రీకాంత్ అడ్డాల

యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రాలను తీయడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఎం ముత్తు ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాడు. M ముత్తు…

2 years ago

మధ్యప్రదేశ్ చిత్రపరిశ్రమకు అందిస్తున్న అవకాశం!!

మధ్యప్రదేశ్ లో 50 శాతం షూటింగ్చేసే చిత్రాలకు గరిష్టంగా 2 కోట్ల రాయితీ!!మధ్యప్రదేశ్ లో పర్యాటకాన్ని (టూరిజం) ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ (MPTB) తమ రాష్ట్రంలో…

2 years ago

అభిషేక్ అగర్వాల్ సుకుమార్ కలయికలో ప్రాజెక్ట్

ముగ్గురు ప్రముఖ దర్శక నిర్మాతల కలయికలో కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో ఖ్యాతి గడించిన తెలుగు దర్శకుడు సుకుమార్, సంచలనమైన చిత్రాలను రూపొందించడంలో…

2 years ago

NS24 చిత్రానికి డీవోపీగా వెట్రి పళనిసామి

ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య తాజాగా తన కొత్త చిత్రాన్ని  ప్రకటించారు. తన 24 వ చిత్రాన్ని ఎస్ఎస్ అరుణాచలం దర్శకత్వంలో చేయనున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందనున్న ఈ సినిమాలో నాగశౌర్య వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడుని ప్రకటించారు మేకర్స్. అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన స్టార్ కంపోజర్ హారిస్ జయరాజ్ NS24 కి సంగీతం అందించనున్నారు. తెలుగులో చాలా కాలం తర్వాత హారిస్ జయరాజ్  ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. అలాగే ఈ చిత్రానికి వీరం, వేదాళం, విశ్వాసం కాంచన 3 లాంటి సూపర్ హిట్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిసామి డీవోపీగా పని చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.దర్శకుడు ఎస్‌ ఎస్‌ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో  తెలియజేస్తారు. తారాగణం: నాగశౌర్య సాంకేతిక విభాగం : రచన, దర్శకత్వం: ఎస్ఎస్ అరుణాచలం నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి బ్యానర్: వైష్ణవి ఫిల్మ్స్ సమర్పణ: బేబీ అద్వైత,  భవిష్య సంగీతం: హారిస్ జయరాజ్ డీవోపీ : వెట్రి పళనిసామి పీఆర్వో: వంశీ-శేఖర్

2 years ago

సుకుమార్‌ పెద్ద ఫ్యాన్‌ శివనాగేశ్వరరావుగారికి

ప్రణవచంద్ర, మాళవిక సతీషన్,మాస్టర్ చక్రి ..అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ప్రణవి సాధనాల టార్జాన్ జెమిని సురేష్ ముఖ్యపాత్రల్లో.కోట శ్రీనివాసరావు తనికెళ్ళ భరణి బెనర్జీ అతిధి పాత్రలలో నటించిన…

2 years ago

ఊర్వశి రౌతేలా ‘వాల్తేర్ వీరయ్య’లో స్పెషల్ సాంగ్

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రేక్షకులు కోరుకునే  అన్ని అంశాలు ఉంటాయి. మాస్ మహారాజా రవితేజ ప్రజన్స్ సినిమాకు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్. చిత్రంలో చిరంజీవి, రవితేజ ఇద్దరిపై మెగా మాస్ నంబర్‌ వుంది. ఈ పాటని ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరించారుఅంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా పై ఓ భారీ సెట్‌లో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించనున్నారు. దీనికోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫుట్ ట్యాపింగ్ నంబర్‌ను స్కోర్ చేయగా, టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. లావిష్ ప్రొడక్షన్ డిజైన్‌కు పేరుపొందిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌ డేట్‌ అంచనాలను పెంచుతోంది. తప్పకుండా సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు ఒక పండగలా వుంటుంది.  ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.ఆర్థర్ ఎ విల్సన్ కెమెరా మెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, ఊర్వశి రౌతేలా (స్పెషల్ సాంగ్) తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమానే ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్ సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి సిఈవో: చెర్రీ కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి పీఆర్వో: వంశీ-శేఖర్ పబ్లిసిటీ: బాబా సాయి కుమార్ మార్కెటింగ్: ఫస్ట్ షో

2 years ago