దర్శకుడు మేర్లపాక గాంధీ హిలేరియస్ ఎంటర్ టైనర్ లను డీల్ చేయడంలో దిట్ట. ఆయన తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కంప్లీట్ ఎంటర్ టైనర్. దీంతో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. సంతోష్ సూపర్‌హిట్ 'ఏక్ మినీ కథ' కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్‌ప్లే అందించిన సంగతి తెలిసిందే. తాజాగా లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ టీజర్ ను హీరో నితిన్ లాంచ్ చేశారు. సంతోష్ శోభన్ తన స్నేహితుడైన కెమెరామెన్ నెల్లూరు సుదర్శన్‌తో కలిసి అందమైన ప్రదేశాలకు ప్రయాణించి ట్రావెల్ బ్లాగర్ గా మారాలనుకుంటున్నాడు. సంతోష్ ప్రయాణంలో అందమైన అమ్మాయి ఫరియా అబ్దుల్లాను కలుస్తాడు. ఆమెను ఫ్లిర్ట్ చేయాలని ప్రయత్నిస్తాడు. హిలేరియస్ గా సాగుతున్న టీజర్ సెకండాఫ్‌లో సినిమా క్రైమ్ పార్ట్ చూపించడం క్యురియాసిటీని పెంచింది. క్రైమ్, కామెడీ చాలా ఎక్సయిటింగ్ కాంబినేషన్. టీజర్ ప్రామిసింగ్ గా వుంది. మేర్లపాక గాంధీ రొమాన్స్ తో పాటు క్రైమ్, కామెడీ అంశాలను కలిగి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నారు. వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందిందని టీజర్ ద్వారా తెలుస్తోంది. పక్కింటి అబ్బాయిలా కనిపించిన సంతోష్ శోభన్ కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉంది. టీజర్‌లో ఫరియా అబ్దుల్లా అందంగా కనిపించింది. నెల్లూరు సుదర్శన్‌ది సంతోష్ తో పాటు ప్రయాణించే కీలక పాత్ర. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫన్నీగా ఉంది. ఆద్యంతం వినోదాత్మకంగా అలరించిన టీజర్ సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పింది. బ్లాక్ బస్టర్ హిట్ 'శ్యామ్ సింగరాయ్' ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్ టైన్‌మెంట్స్ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రానుందని మేకర్స్ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్ సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ నిర్మాత: వెంకట్ బోయనపల్లి బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంగీతం: ప్రవీణ్ లక్కరాజు డీవోపీ: వసంత్ ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్) పీఆర్వో: వంశీ-శేఖర్
Director Merlapaka Gandhi is an expert in dealing hilarious entertainers and his next Like Share & Subscribe is also a…
విక్రాంత్ హీరోగా పరిచయమవుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఛార్మింగ్ బ్యూటీస్ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా రామానాయుడు స్టూడియో ఆవరణలో మొక్కలు నాటిన నటుడు శ్రీ సింహ మరియు మ్యూజిక్…
ఉగ్రవాదం కారణంగా జమ్మూకశ్మీర్‌లో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మూతబడిన సినిమా థియేటర్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. పుల్వామా, సోపియాలలోని ఆదివారం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్…
https://youtu.be/6ZBzOmYQHdI ఏ సినిమాకైనా మొదటి రోజు మొదటి ఆట ఎంతో ముఖ్యం. మౌత్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రాలెన్నో ఉన్నాయి. అయితే ఫస్ట్ డే…
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్ బాలు శర్మ దర్శకత్వం వహించిన మూవీ "నీతో". పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన…
సెప్టెంబర్ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో బబ్లీ బౌన్సర్" గ్రాండ్ రిలీజ్ ప్రముఖ యూత్ ఐకాన్ & పాన్ ఇండియా నటి తమన్నా లేడీ బౌన్సర్‌గా నటిస్తున్న లేటెస్ట్…
నెట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వచ్చిన చిత్రం''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. సుధీర్ బాబుకు జోడిగా…