Tfja Team

డైరెక్టర్ రాధాకృష్ణ సినిమా టైటిల్ ‘జూనియర్’

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ప్రస్తుతం కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ సౌత్‌లో తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషలలో విడుదల కానుంది.చిత్ర నిర్మాతలు ఇదివరకే కిరీటి రెడ్డిని పరిచయం చేస్తూ  ఒక గ్లింప్స్ ని విడుదల చేసారు. ఈ వీడియోలో కిరిటీ తన నైపుణ్యం అందరినీ ఆకట్టుకున్నారు. ఇందులో ఎక్స్ ట్రార్డినరీ గా కనిపించారు కిరిటీ. స్టైలిష్‌గా కనిపించి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ మెప్పించారు. ఈ రోజు కిరిటీ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటిస్తూ మరో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి 'జూనియర్'  అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వీడియోలో ఈ తరం యువత గురించి,  భవిష్యత్తు లక్ష్యాల గురించి ప్రతి జూనియర్‌కు ఉండే విశ్వాసం గురించి కిరిటీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.కిరిటీ రెడ్డి డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్‌తో తనదైన ముద్ర వేశారు. కాలేజీలో గోడకు ఆనుకుని ఫిడ్జెట్ స్పిన్నర్‌ను తిప్పుతూ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ గ్లింప్స్ కోసం ప్లజంట్ బీజీఎం స్కోర్‌ చేశారు. టైటిల్ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదల చేసిన కొద్దిసేపటికే 5 మిలియన్ వ్యూస్ ని క్రాస్ అందరినీ ఆకర్శిస్తోంది.లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వారాహి చలనచిత్రం ప్రొడక్షన్ నంబర్ 15 గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు ఉన్నారు. టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్స్ లో ఒకరైన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, జెనీలియా ఒక ముఖ్యమైన పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర  కీలక పాత్రలో కనిపించనున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి లెన్స్‌మెన్ కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ గా,  భారతదేశపు అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. తారాగణం: కిరిటీ, శ్రీలీల, జెనీలియా, డాక్టర్ రవిచంద్ర వి తదితరులు సాంకేతిక విభాగం రచన, దర్శకత్వం: రాధా కృష్ణ నిర్మాత: సాయి కొర్రపాటి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: కెకె సెంథిల్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్ స్టంట్ డైరెక్టర్: పీటర్ హెయిన్ పీఆర్వో: వంశీ-శేఖర్

4 years ago

Most Awaiting Aadipurush Poster Release

Adipurush is one of the most anticipated projects in Indian cinema. The mythological action epic has Prabhas playing the role…

4 years ago

గ్రాండ్ గా “ఇక్షు” సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్

పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో వస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం  మెదటి షెడ్యూల్ అప్ డేట్స్ .. దర్శకురాలు వివి ఋషికడాక్టర్ గౌతమ్ నాయుడు…

4 years ago

‘Masooda’ is all set to release on November 11.

After the successful blockbusters like ‘Malli Raava’ and ‘Agent Sai Srinivasa Athreya’ Swadharm Entertainment had already announced its third movie…

4 years ago

శ్రీ అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్ చిరంజీవి గారు

గత సంవత్సరం అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి సందర్భంగా, అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆయన కుటుంబ సభ్యులు…

4 years ago

గాడ్ ఫాదర్ సినిమా ఒక నిశ్శబ్ద విస్పోటనం.. నా అభిమానులే నా గాడ్ ఫాదర్స్: గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌…

4 years ago

నేను c/o నువ్వు’’ వంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు థియేటర్స్ కు కచ్చితంగా రావాలి

ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘’నేను c/o నువ్వు’’.ఈ చిత్రానికి…

4 years ago

ఈ నెల 30 న “లాట్స్ ఆఫ్ లవ్” గ్రాండ్ రిలీజ్..

డిఫరెంట్ లవ్ స్టోరీస్ తో వస్తున్న "లాట్స్ ఆఫ్ లవ్" ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది .. ఎస్ ఎమ్ ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీమతి…

4 years ago

‘కృష్ణ వ్రింద విహారి’ని బ్లాక్ బస్టర్ చేసినందుకు కృతజ్ఞతలు

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'.…

4 years ago

‘ఓరి దేవుడా’ చిత్రం అక్టోబర్ 21న రిలీజ్

‘ఏమ‌ని అనాల‌ని తోచ‌ని క్ష‌ణాలివిఏ మ‌లుపు ఎదురయ్యే ప‌య‌న‌మిదాఆమ‌ని నువ్వేన‌ని నీ జ‌త చేరాల‌నిఏ త‌ల‌పో మొద‌ల‌య్యే  మౌన‌మిదా...ఔన‌న‌వా ఔన‌న‌వా..’  అంటూ ప్రేమికుడు త‌న ప్రేయ‌సికి మ‌న‌సులోని…

4 years ago