గాడ్ ఫాదర్ సినిమా ఒక నిశ్శబ్ద విస్పోటనం.. నా అభిమానులే నా గాడ్ ఫాదర్స్: గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాడ్ ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ అనంతపురంలో చాలా గ్రాండ్ గా జరిగింది. వేలాది మంది ప్రేక్షకులు, అభిమానులు హాజరైన ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది అభిమానులు కోలాహలం మధ్య ఈ వేడుక  విజయవంతమైయింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… నేను ఎప్పుడు రాయలసీమకి వచ్చినా నేల తడుస్తుంది. ఈ రోజు కూడా వర్షం కురవడం ఒక శుభపరిణామంగా అనిపిస్తుంది. మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చూడటం జరిగింది. ఇది గాడ్ ఫాదర్ గా మారడానికి, నేను చేయడానికి ప్రధానమైన కారణం రామ్ చరణ్. సినిమా బావుంది నాకు వైవిధ్యంగా ఉంటుందని అనుకున్నాను. అయితే ఎవరు చేస్తారని ఆలోచిస్తున్నపుడు.. రామ్ చరణ్ ముందుకు వచ్చి ” మీ ఇమేజ్ కి ఈ సమయంలో చేయాల్సిన సబ్జెక్ట్ లూసిఫర్’ అని చరణ్ చెప్పాడు. చరణ్ కోరిక మేరకు ఇది గాడ్ ఫాదర్ గా రూపాంతరం చెందింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ కి కృతజ్ఞతలు. ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ రాజా పేరుని సూచించింది కూడా రామ్ చరణ్ నే. మోహన్ రాజా ఈ సినిమాని మనందరం గర్వపడేలా తీశారు. దాదాపు ఆరు నెలలు పాటు మిత్రుడు సత్యానంద్ తో కలసి మీ అందరూ ఆనందించేలా ఈ సినిమా స్క్రీన్ ప్లే చేయడం జరిగింది.

ఆ స్క్రీన్ ప్లేని అత్యద్భుతంగా తెరకెక్కించారు మోహన్ రాజ్. మోహన్ రాజా మామూలు దర్శకుడు కాదు. ఆయనవి అన్నీ పెద్ద కోరికలు. ఈ సినిమాలో నాకు దళపతిగా వుండే ఒక పాత్ర వుంది, ఆ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ అయితే బావుటుందని చాలా సింపుల్ గా చెప్పారు. రాజా అంత సింపుల్ గా చెప్పారు కానీ అసలు సల్మాన్ ఖాన్ ని తీసుకురావడం సాధ్యమేనా అని అలిచిస్తున్నపుడు రామ్ చరణ్ ఆ భాద్యత తీసుకున్నారు. ”నాన్న గారి సినిమాలో ఒక పాత్ర వుంది మీరు చేస్తే బావుంటుంది” అని చరణ్ చెప్పడం,, ”నేను చేయాలని చిరు గారు కోరితే.. ఆ పాత్ర చేయడానికి నేను సిద్ధమే.. కథ కూడా చెప్పొద్దు. నేరుగా షూటింగ్ కి వచ్చేస్తా’ అని సల్మాన్ అన్నారు. మాపై ఇంత ప్రేమ చూపించిన సల్మాన్ భాయ్ కి కృతజ్ఞతలు. చరణ్ తో కలసిసూపర్ గుడ్ ఫిలింస్  ఆర్‌బి చౌదరి గారు, ఎన్‌వి ప్రసాద్ గారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించారు. వారికి కృతజ్ఞతలు. నయనతార పాత్ర ఇందులో అత్యద్భుతంగా వచ్చింది. సెకండ్ హాఫ్ లో అద్భుతమైన సెంటిమెంట్ గొప్పగా పండించారు. నయనతారకి హ్యాట్సప్. ఇందులో ప్రతినాయకుడిగా సత్యదేవ్ చేశారు. నాకు ఎదురుగా నిలబడే పాత్రది. సత్యదేవ్ అద్భుతమైన నటుడు.

ఇందులో ఆయన నటనని పరిపూర్ణంగా వాడుకున్నాం. సత్యదేవ్ కి చాలా మంచి భవిష్యత్ వుంది. మన కళ్ళముందే సత్యదేవ్ సూపర్ స్టార్ గా ఎదుగుతాడు. మురళి శర్మ పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. సముద్రఖని ఇందులో మరో ప్రతి నాయకుడి గా శభాష్ అనిపించారు, సునీల్, షఫీ, గెటప్ శ్రీను పాత్రలు కూడా ఆసక్తికరంగా వుంటాయి. ఇందులో దర్శకుడు పూరి జగన్నాధ్ ఇందులో యూట్యుబర్ గా కనిపించి పాత్రలని కథని పరిచయం చేస్తారు. ఆయన రాకతో కథలో ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. వీరంతా కలసి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు.  లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సల్మాన్ భాయ్ ఇందులో తన స్టయిల్, గ్రేస్, మస్కులేన్ లుక్స్, ఫైట్స్ తో నా తరపున మీ అందరినీని అలరిస్తారు. చాలా అద్భుతంగా వచ్చింది సల్మాన్ పాత్ర.  ఇందులో నేను సల్మాన్ ఒక పాట కు డ్యాన్స్ చేశాం. ఇద్దరి స్టార్లని బ్యాలన్స్ చేస్తూ ప్రభుదేవా అద్భుతంగా ఆ పాటని కొరియోగ్రఫీ చేశారు. గాడ్ ఫాదర్ కి ఆరో ప్రాణం తమన్ మ్యూజిక్. తమన్ మ్యూజిక్ తో ఈ సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది.  కేవలం కంటిచూపుతోని గొప్ప హీరోయిజం తీసుకొచ్చే పాత్రని ఇందులో చేశాను. తమన్ చాలా అద్భుతమైన రీరికార్డింగ్ చేశారు. గూస్ బంప్స్ వస్తాయి. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇందులో చాలా అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు చేశారు. ఇందులో నజభజజజరా పాటని అద్భుతమైన ఫైట్ గా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో పొలిటికల్, ఫ్యామిలీ డ్రామా వుంటుంది. ఈ రెండు కలసి ప్రేక్షకులుని ఆద్యంతం అలరిస్తుందని హామీ ఇస్తున్నాను. సినిమాని చూశాను కాబట్టి ఇంత నమ్మకంగా చెబుతున్నాను. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 విజయదశమి నాడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించి గొప్ప విజయాన్ని ఇవ్వాలి. ఈ మధ్య చేసిన చిత్రం కాస్త నిరాశ పరిచింది.

మిమ్మల్ని సరిగ్గా అలరించలేకపోయాననే అసంతృప్తి వుంది. దీనికి సమాధానమే ఈ సినిమా. గాడ్ ఫాదర్  నిశ్శబ్ద విస్పోటనం. మీ అందరి ఆశీస్సులు కావాలి. విజయదశమి మీ జీవితాల్లో కూడా విజయాన్ని తేవాలి. అలాగే అదే రోజు నా మిత్రుడు నటించిన నాగార్జున ది ఘోస్ట్, యువ హీరో గణేష్ నటిస్తున్న స్వాతిముత్యం చిత్రాలు వస్తున్నాయి. ఈ చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలి. మేము అనుకున్నదానికంటే పదిహేను రేట్లు ఎక్కువ మంది వచ్చి.. ఇంత వర్షం పడుతున్న ఒక్కరు కూడా కదలకుండా ఈ వేడుకని విజయవంతం చేశారు. ఇది కదా నిజమైన ప్రేమ. ఈ  ప్రేమనే కదా కోరుకునేది. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో నిలబడ్డానని అంటారు. నన్ను ఇక్కడ నిలబెట్టింది నా అభిమానులు. నా అభిమానులే నా గాడ్ ఫాదర్స్. చాలా నిజాయితీగా చెబుతున్న మాట ఇది. మీరు చూపిన అనంతమైన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.. అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.

గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ లాంటి టైటిల్ కి సరిపోయే ఒకే ఒక్క మనిషి చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎందరికో స్ఫూర్తి. ఈ సినిమా కోసం మూడు పాటలు, రెండు బిట్ సాంగ్స్ రాశాను. ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. మోహన్ రాజా గారు చాలా క్లారిటీ వున్న దర్శకులు. తమన్ ఈ చిత్రానికి తన కెరీర్ బెస్ట్ రీరికార్డింగ్ ఇస్తున్నారు. లక్ష్మీ భూపాల ఈ సినిమా కోసం పదునైన మాటలు రాశారు. గాడ్ ఫాదర్ ఖచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుంది” అన్నారు.

నటుడు షఫీ మాట్లాడుతూ..  గాడ్ ఫాదర్ లో నటించడం, ఆ అద్భుతమైన సినిమా గురించి మాట్లాడటం మర్చిపోలేని అనుభూతి. చిరంజీవి గారంటే నాకు ప్రేమ భక్తి. ఇప్పుడు ఆయన సినిమాలో నటించడం ఒక దివ్యానుభూతి. ఆయనతో కలసి పని చేయడంతో  నా కల నెరవేరినట్లయింది” అన్నారు.

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. మేము అన్నయ్యకి అభిమానులం. అన్నయతో కలసి పని చేయడం మా అదృష్టం. దర్శకుడు మోహన్ రాజా గారు ఈ సినిమాని అద్భుతంగా తీశారు. తమన్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులంతా అద్భుతమైన టెక్నిషియన్స్. ఈ సినిమాలో మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఒక ఫైట్ చేశాం. అన్నయ్యతో పీక్ ఎమోషనల్ స్టయిలీష్ ఫైట్ చేయించాం. చాలా అద్భుతంగా వచ్చింది. అది మీరంతా చూడబోతున్నారు. ఈ సినిమాలో అన్నయ్య చాలా కొత్తగా కనిపిస్తారు. అందరినీ అలరిస్తారు” అని చెప్పారు.

ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి తల్లి ఇందిరాదేవి మృతి పట్ల సంతాపం ప్రకటించింది గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్. దర్శకుడు మోహన్ రాజా, సత్యదేవ్, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత లక్ష్మీ భూపాల, చిట్టి, నాగమహేష్ , గెటప్ శ్రీను, తదితరులు ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

12 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago