గ్రాండ్ గా “ఇక్షు” సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్

పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో వస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం  మెదటి షెడ్యూల్ అప్ డేట్స్ .. దర్శకురాలు వివి ఋషికడాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు నిర్మించిన చిత్రం “ఇక్షు”. ఈ సినిమా విడుదలైన థియేటర్స్ లలో  ఇంకా విజయవంతంగా  ప్రదర్శింపబడుతుంది. ఈ సినిమా తర్వాత ఇదే బ్యానర్ లో  ప్రొడక్షన్ నెంబర్ 2 లో మరో సినిమా మొదటి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సందర్బంగా చిత్ర దర్శకురాలు వివి ఋషిక మాట్లాడుతూ…ఇక్షు మూవీ అనేది నా కళ. సిద్ధం మనోహర్ ఇచ్చిన  కథను పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో దర్శకత్వం వహించి  ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు  తీసుకువచ్చిన మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.

ఈ సినిమాలో నా కొడుకు రామ్ అగ్నివేష్ ను ఆర్టిస్ట్ గా చూస్తూ డైరెక్షన్  చేయడం చాలా సంతోషంగా  ఉంది. చాలా మంది నాకు ఫోన్స్ చేసి రామ్ చాలా బాగా చేశాడు అంటుంటే  ఆర్టిస్ట్ గా కూడా రామ్ ప్రూవ్ చేసుకొన్నాడనిపించింది. మా సినిమా ఇంకా కొన్ని థియేటర్స్ లలో విజయవంతంగా  ప్రదర్శింప బడుతున్న ఆనందంతో మేము ఈ రోజు సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపు కుంటున్నాము. నాకు సపోర్ట్ గా నిలిచిన నా భర్త  నిర్మాత హన్మంత్ రావు నాయుడు గారికి కూడా నా ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రానికి  రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి వంటి తదితర నటీనటులు, టెక్నిషియన్స్ సపోర్ట్ గా నిలవడంతో సినిమా బాగా వచ్చింది . అలాగే మేము  అడిగిన వెంటనే థియేటర్స్ ఇచ్చిన  డిస్ట్రిబ్యూటర్స్ కు ధన్యవాదాలు. నా మొదటి సినిమా “ఇక్షు” విజయవంత మైన కారణంగా ఇదే  బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2 గా మరో సినిమాను ప్రారంబించాము.  ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ కొరకు అడిషన్ ద్వారా సెలెక్ట్ చేశాము.ఇప్పుడు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది అని అన్నారు.

చిత్ర నిర్మాత హన్మంత్ రావు నాయుడు మాట్లాడుతూ.. పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో విడుదలైన ” ఇక్షు ” సినిమాకు సపోర్ట్ చేసిన దిల్ రాజు గారికి , బసిరెడ్డి గారికి, బేక్కం వేణుగోపాల్ గారికి దామోదర్ గారికి, ఈ చిత్రంలో  నటించిన రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను అందరికీ నా ధన్యవాదములు. ఇక్షు సినిమా మేము అనుకున్నంత రీచ్ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది. పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో  సెట్స్ పైకి వెళ్లిన ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రాన్ని  కూడా ప్రేక్షకులకు నచ్చేవిధంగా తీస్తామని అన్నారు.హీరో రామ్ అగ్నివేష్ మాట్లాడుతూ..నన్ను గ్లామర్ గా చూయించమని మా అమ్మను అడిగితే లేదు నువ్వు ముందు ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలని అన్నారు.ఈ సినిమా కొరకు ఎంతో టఫ్ వర్క్ నేర్పించింది.ఇక్షు సినిమా లో నేను చెప్పిన యన్టీఆర్ డైలాగ్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఆ క్రెడిట్ రావడానికి కారణం మా అమ్మ, నాన్నలే.ఈసినిమా ద్వారా నేను సీనియర్ యాక్టర్స్ రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను ల ద్వారా ఆర్టిస్ట్  గా ఎన్నో మెలుకువలు  నేర్చుకున్నాను. నా నెక్స్ట్ సినిమాల ద్వారా విభిన్నమైన పాత్రలలో నటించి  ప్రేక్షకులను మెప్పిస్తాను. అలాగే పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నాకు ఈ ఆఫర్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

నటీనటులు :
రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి, తదితరులు

సాంకేతిక. నిపుణులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఋషిక
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల,
మూల కథ: సిద్ధం మనోహర్
కెమెరా : నవీన్ తొడిగి
పాటలు:-కాసర్ల శ్యామ్
మ్యూజిక్: వికాస్ బాడిస
ఎడిటింగ్: ఎస్ బీ ఉద్ధవ్
ఆర్ట్స్ : రాజు
మాటలు: మున్నా ప్రవీణ్
కొరియోగ్రఫీ: భాను

పి.ఆర్.ఓ : మధు వి. ఆర్

Tfja Team

Recent Posts

భారత్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ జోరు – అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం..!

మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు…

18 hours ago

రెండు లక్షల మందితో పాట్నాలో అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ‘పుష్ప 2’ పాట్నా కార్యక్రమానికి రెండేళ్లు.. 2.6 లక్షల మంది ఆన్‌లైన్ వీక్షకులతో సరికొత్త మైలురాయి..!

2 లక్షలకు పైగా ప్రజలు హాజరవడం, 2.6 లక్షల మంది యూట్యూబ్ వీక్షకులు ఏకకాలంలో వీక్షించడంతో, భారతీయ సినిమా చరిత్రలో…

18 hours ago

ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు పొందడం నిజంగా గొప్ప విషయం..!

‘ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు…

18 hours ago

ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు జాతీయ స్థాయిలో నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మ‌య‌స‌భ‌’ చరిత్ర!

57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి తెలుగు రాజకీయ వెబ్…

18 hours ago

చిత్ర పరిశ్రమకు అండగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి..!

AI దుర్వినియోగంపై పటిష్ఠ రక్షణ చర్యలు కోరుతూ వినతిపత్రం - సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తామని కేంద్ర మంత్రి…

2 days ago

డైనమిక్ హీరో శ్రీరామ్ “రామభద్రుడు” సినిమా హైదరాబాద్ ఆడిషన్స్ సూపర్ సక్సెస్, ఈ నెల 28, 29 తేదీల్లో నెల్లూరులో జరగనున్న ఆడిషన్స్..!

"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…

2 days ago