Uncategorized

ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘పరువు’ పెద్ద సక్సెస్ అవ్వాలి..

FYI: “Paruvu” Pre Launch Speeches Playlist link:
https://youtube.com/playlist?list=PLv8tne3UD07MffHsKWUJAa86h0LSXeXfo&si=nVQsCguAwOhnVmV7

గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ మీద విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. ఈ మూవీలో నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు ప్రముఖ పాత్రలు పోషించారు. పవన్ సాధినేని షో రన్నర్‌గా రాబోతోన్న ఈ ZEE5 ఒరిజినల్ సిరీస్ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఈ క్రమంలో ‘పరువు’ ప్రీ లాంచ్ ఈవెంట్‌ను గురువారం నాడు నిర్వహించారు. ఇందులో మొదటి ఎపిసోడ్‌ను అందరికీ చూపించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌లో..

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘పరువు’ పైలెట్ ఎపిసోడ్ బాగుంది. నేటి రాత్రి నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. మా ఇంట్లో అందరం కలిసి ఫస్ట్ ఎపిసోడ్ చూశాం. థియేటర్ అయినా, ఓటీటీ అయినా కూడా ఆడియెన్స్ మంచి కాన్సెప్ట్‌లతో వస్తే ఆదరిస్తుంటారు. నేషనల్ వైడ్‌గా అందరినీ ఆకట్టుకునేలా ఈ పరువు వెబ్ సిరీస్ రాబోతోంది. ఫస్ట్ ఎపిసోడ్ చూసినంత సేపు టైం తెలియలేదు. అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంది. విప్లవ్ ఎడిటింగ్ అద్భుతంగా ఉంది. మ్యూజిక్, కెమెరా వర్క్ అదిరిపోయింది. సిరీస్ అంతా కూడా ఎంతో సహజంగా కనిపించింది. షో రైటర్, డైరెక్టర్లకు కంగ్రాట్స్. ముప్పై నిమిషాల కంటెంట్ చూసినా కూడా ఆ ఇద్దరికీ ఎంతో భవిష్యత్తు ఉందని అర్థం మైంది. షో రన్నర్ పవన్ సాధినేని అద్భుతమైన దర్శకులు. పవన్‌కు కంగ్రాట్స్. ఏ ఒక్కరు కూడా కొత్త యాక్టర్‌గా అనిపించలేదు. నరేష్ అగస్త్య అద్భుతంగా నటించారు. ఆయన విలక్షణ నటుడు. నివేదా ఎప్పుడూ డిఫరెంట్ పాత్రలనే ఎంచుకుంటూ వస్తున్నారు. మా నాన్నని ఈ పోస్టర్లో చూస్తే నాకే భయం వేసింది. నేను మా హనీ అక్క కోసం ఇక్కడికి వచ్చాను. అక్క ఎప్పుడూ మా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుని అవకాశాలు అడగలేదు. సొంతంగా బిల్డ్ చేసుకుంటోంది. మా అక్కని చూస్తే నాకెంతో గర్వంగా ఉంటుంది. ఈ సిరీస్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సుష్మిత కొణిదెల మాట్లాడుతూ.. ‘మా ప్రతీ ప్రాజెక్ట్‌కు మీడియా ఎంతో సహకరిస్తోంది. జీ5 టీం మాకు ఎంతో అండగా నిలబడుతోంది. గోల్డ్ బాక్స్, మా పరువు ప్రాజెక్ట్‌కు జీ5 టీం ఎంతో సహకరించింది. ఇది చాలా సున్నితమైన అంశం. సమాజంలో ఇంకా ఈ అంశం గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. పరువు హత్యల వల్ల బాధపడుతున్న వారి గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే సిద్దార్థ్, రాజ్ అద్భుతంగా ఈ స్క్రిప్ట్ రాశారు. ఎన్నో లేయర్స్, ఎన్నో కారెక్టర్లతో పరువు స్క్రిప్ట్‌ను అద్భుతంగా రాశారు. ప్రతీ ఎపిసోడ్‌కు ఇంట్రెస్ట్‌ పెరుగుతూనే ఉంది. పవన్ సాధినేని షో రన్నర్ మాత్రమే కాదు క్రైసిస్ మేనేజర్‌గానూ వ్యవహరించారు. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చేది కాదు. పరువు కోసం ప్రతీ ఒక్క టీం మెంబర్ ప్రాణం పెట్టి పని చేశారు. అందరికీ థాంక్స్. నరేష్ అగస్త్య, నివేదా ఇలా అందరూ అద్భుతంగా నటించారు. ఒక్కోసారి మా నాగబాబు బాబాయ్ పర్ఫామెన్స్ చూసి భయం వేసింది. నాకోసం ఈవెంట్‌కు వచ్చిన వరుణ్ తేజ్‌కు థాంక్స్. జీ5లో మా ‘పరువు’ని నేటి రాత్రి నుంచి వీక్షించండి’ అని అన్నారు.

దర్శక, రచయిత సిద్దార్థ్ నాయుడు మాట్లాడుతూ.. ‘పరువు హత్యలు అనేది చాలా సున్నితమైన అంశం. రాయడం ఒకెత్తు అయితే.. ఇలాంటి ప్రాజెక్ట్‌లను నిర్మించడం మరో ఎత్తు. సుష్మిత గారు ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చారు. ఆమె ఇచ్చిన సపోర్ట్‌తోనే మా ప్రాజెక్ట్ ఇక్కడికి వరకు వచ్చింది. ఇలాంటి టాపిక్స్‌ను ఎంచుకునేందుకు జీ5 ధైర్యం చేసి ముందుకు వచ్చింది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

దర్శక, రచయిత వడ్లపాటి రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘మా మొదటి ఎపిసోడ్‌ను అందరూ చూశారు. ఆ ఎపిసోడ్‌లానే సిరీస్ అంతా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ‘పరువు హత్యల మీద చాలా కథలు వచ్చాయి. కానీ ఇంకా ఇంకా రావాలి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ఈ పరువు హత్యల గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. కానీ మనం ఇలాంటి సమాజంలో ఉన్నామా? అని అనుకునేలా ఇలాంటి కథలు ఇంకా రావాలి. ఇలాంటి కథను రాసిన సిద్దార్థ్, రాజశేఖర్‌లకు థాంక్స్. మ్యూజిక్, కెమెరా, పర్పామెన్స్ ఇలా అన్నీ అద్భుతంగా ఉన్నాయి. నివేదా గారి పాత్రలో చాలా షేడ్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ ఎంతో ఎంగేజింగ్‌గా ఉంది. షో రన్నర్ పవన్ సాధినేనికి కంగ్రాట్స్. ఇలాంటి ప్రాజెక్ట్‌లను తీసుకుంటూ సుష్మిత గారు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్య పొట్ల మాట్లాడుతూ.. ‘రెండేళ్లుగా ఈ టీం సిరీస్ కోసం పని చేస్తూ వచ్చింది. సుష్మిత గారు ఎంతో సహకరించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని టీం వెబ్ సిరీస్‌ను పూర్తి చేసింది’ అని అన్నారు.

నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుష్మిత, విష్ణు గారికి థాంక్స్. జీలో పసుపు కుంకుమ అనే సీరియల్‌తో పరిచయం అయ్యాను. పదేళ్ల తరువాత ఇలా జీ5లో ‘పరువు’తో రాబోతోన్నాను. ఇందులో ప్రతీ పాత్ర హీరోలానే ఉంటుంది. నివేదా గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ప్రణీత ఎంతో సహజంగా నటిస్తారు. ఫస్ట్ ఎపిసోడ్ ఎంత ఎంగేజింగ్‌గా ఉందో.. సిరీస్ మొత్తం అంతే ఎంగేజింగ్‌గా ఉంటుంది’ అని అన్నారు.

నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. ‘నాకు ఇలాంటి మంచి ప్రాజెక్ట్ ఇచ్చిన గోల్డ్ బాక్స్ సుష్మిత గారికి థాంక్స్. ఇలాంటి ఓ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి చాలా గట్స్ కావాలి. హిందీలో ఒక వెబ్ సిరీస్ చేశాను. సిద్దార్థ్, రాజ్ అద్భుతంగా ఈ వెబ్ సిరీస్‌ను డిజైన్ చేశారు. వారిని నేను గుడ్డిగా నమ్మేశాను. ఈ వెబ్ సిరీస్ అద్భుతంగా వచ్చింది. డాలి పాత్ర అద్భుతంగా ఉంటుంది.ప్రణీత, సిద్దార్థ్ అద్భుతంగా నటించారు. బింధు, అమీత్, మొయిన్ ఇలా అన్ని పాత్రలు బాగుంటాయి. ప్రతీ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. మా ‘పరువు’ని అందరూ చూడండి. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

జీ5 వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ దేశ్రాయ్ మాట్లాడుతూ.. ‘సిద్దార్థ్, రాజ్‌లు అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. సుష్మిత గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. నరేష్ అగస్త్యతో ఇంకో వెబ్ సిరీస్‌ను కూడా స్టార్ట్ చేశాం. నరేష్ అద్భుతంగా నటించారు. నివేదా పర్ఫామెన్స్‌ గురించి అందరూ మాట్లాడుకుంటారు. మేం ఈ వెబ్ సిరీస్ పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నాం. షో రన్నర్‌గా పవన్ సాధినేని వచ్చాక మరో లెవెల్‌కు వెళ్లింది. శ్రవణ్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. జీ5లో మా ‘పరువు’ని చూడండి’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

Hero Kiran Abbavaram’s “Dilruba” Completes Shooting

Young and talented hero Kiran Abbavaram is starring in the upcoming film Dilruba, with Rukshar…

15 hours ago

హీరో కిరణ్ అబ్బవరం “దిల్ రూబా” షూటింగ్ కంప్లీట్,

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్…

15 hours ago

Pandu Chirumamilla’s Bold & First Look Of Premikudu Released

There is a growing demand for films that delve into intense love stories, especially among…

15 hours ago

పండు చిరుమామిళ్ల బోల్డ్ అండ్ ఇంటెన్స్ “ప్రేమికుడు” ఫస్ట్ లుక్ విడుదల

యూత్ బేస్డ్ లవ్ స్టోరీస్ ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటాయి. ప్రేమలోని సంఘర్షణ, ఎమోషన్స్ మీద తీసే చిత్రాలు ఎవర్గ్రీన్…

15 hours ago

SYE” is ready for re-release in theaters on Jay 1st 2025

Tollywood hero Nithin in the lead role and directed by SS Rajamouli, the sports action…

1 day ago

జనవరి 1, 2025 న థియేటర్ల లో రీ రిలీజ్ కి రెడీ అయిన బ్లాక్ బస్టర్ మూవీ “సై” !!!

టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్…

1 day ago