ఫలక్‌నుమా దాస్‌తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ తను టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దాస్ కా ధమ్కీ’కి దర్శకత్వం వహిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ కథానాయిక. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ మాటలు అందిస్తున్నారు.
‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. ఫస్ట్ లుక్ లోవిశ్వక్ సేన్ చెవిపోగులు, గడియారం ధరించి స్టైలిష్, రగ్డ్ లుక్‌లో కనిపించారు. తన కనుబొమ్మలను పైకెత్తి ఎవరికో ధంకీ ఇస్తున్నట్లుగా చూడటం ఆసక్తికరంగా వుంది. క్యూరియాసిటీని పెంచిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఈ చిత్రంలో విశ్వక్ సేన్ మాస్, యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడనే భావన కలిగిస్తోంది.
‘దాస్ కా ధమ్కీ’ రోమ్-కామ్, యాక్షన్ థ్రిల్లర్. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు భారీ యాక్షన్ వుంటుంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ యాక్షన్ చాలా కొత్త రకమైన థ్రిల్స్‌ను అందించనున్నాయి.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ వారం చివరికల్లా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ మొత్తం పూర్తవుతాయి.
ఆర్‌ఆర్‌ఆర్, హరి హర వీర మల్లు చిత్రాలకు స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజితో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ ఇవ్వబోతున్నాయి.
బింబిసార చిత్రానికి పనిచేసిన రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్ కు కొరియోగ్రఫీ చేయగా వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్ ను పర్యవేక్షించారు.
చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ఇందులో ప్రతి నటుడికి సమానమైన, మంచి ప్రాముఖ్యత ఉంది.
ఈ చిత్రం ఫిబ్రవరి, 2023లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాత: కరాటే రాజు
బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్
కథ: ప్రసన్న కుమార్ బెజవాడ
డీవోపీ: దినేష్ కె బాబు
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: అన్వర్ అలీ
ఆర్ట్ డైరెక్టర్: ఎ.రామాంజనేయులు
ఫైట్స్: టోడర్ లాజరోవ్-జుజి, దినేష్ కె బాబు, వెంకట్
పీఆర్వో: వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: పద క్యాసెట్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…