ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి ఉగాది పురస్కారాల వేడుకలో”బెస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్” అవార్డుఅందుకున్న ధీరజ అప్పాజీ!!

Must Read

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో “ఉగాది సినిమా పురస్కారాలు” పేరిట విజయవాడ – గుంటూరు హైవే నందు గల హ్యాపీ రిసార్ట్స్ లో నిర్వహించిన వేడుకలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ “బెస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్” అవార్డు అందుకున్నారు. ఉత్తమ డైరెక్టర్ గా వేణు ఎల్దండి (బలగం), ఉత్తమ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అజయ్ ఘోష్ (మంగళవారం), ఉత్తమ హీరోగా ఆశిష్ గాంధీ (రుద్రాంగి), ఉత్తమ వెటరన్ డైరెక్టర్ గా “అంకురం”ఫేమ్ సి.ఉమామహేశ్వరరావు (ఇట్లు అమ్మ), ఉత్తమ దర్శకుడుగా వెంకట్ పెదిరెడ్ల (అనుకోని ప్రయాణం), ఉత్తమ సపోర్టింగ్ నటుడుగా కోయ కిషోర్, ఉత్తమ సహాయ నటిగా జయశ్రీ రాచకొండ, ఉత్తమ బాలనటిగా బేబీ నేహా (లిల్లి), ఉత్తమ ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా లోహిత్ కుమార్ (అక్షరం) తదితరులు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు కొత్త బసిరెడ్డి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ఏ.యమ్.రత్నం, మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన కృష్ణ, జనరల్ సెక్రెటరీ జె.వి.మోహన్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ విజయవర్మ పాకలపాటి, జాయింట్ సెక్రటరీ జంగా చైతన్య, మారం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు!!

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News