ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒకటైన జీ 5 తమ ఆడియెన్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో అపరిమితమైన, కొత్తదైన, వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్రరీలో ఫిబ్రవరి 24న మరో బెస్ట్ ఒరిజినల్‌గా ‘పులి మేక’ యాడ్ అయ్యింది. ఈ ఒరిజినల్‌ను జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేషన్ కలిసి రూపొందించాయి. లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ జంటగా నటించిన ఈ సిరీస్‌లో సిరి హన్మంత్. రాజా, సుమన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 24 నుంచి ఈ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతూ సూపర్బ్ రెస్పాన్స్‌ని రాబట్టుకుంటుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘‘ఈ పులి మేక విషంయలో ముందుగా కోనగారికి థాంక్స్ చెబుతున్నాను. తర్వాత జీ 5 వారికి థాంక్స్. లాక్ డౌన్ కంటే ముందే ఓ ఓటీటీ ఆఫర్ వచ్చింది. అప్పుడు చేయాలా వద్దా? అని ఆలోచించుకుంటున్నాను. చివరికి వద్దని అనుకున్నాను. లాక్ డౌన్ పడింది. తర్వాత చేద్దామనుకుంటే మంచి ప్రాజెక్ట్ దొరకలేదు. అలాంటి సమయంలో కోనగారు పులి మేక కథను వినిపించారు. స్క్రిప్ట్, క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. లావణ్యగారు హీరోయిన్ అన్నారు. చక్రిగారు డైరెక్టర్‌గా చక్కగా డైరెక్ట్ చేశారు. ఓటీటీ మంచి డెబ్యూలాగా ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన జీ 5కి థాంక్స్. మా అమ్మగారు సహా యు.ఎస్‌లో నా రిలేటివ్స్ చూసి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. లావణ్య అద్భుతంగా నటించింది. తను యాక్షన్ సన్నివేశాల్లో పడ్డ కష్టం క్లియర్‌గా తెలిసింది. సిరి కూడా చక్కగా నటించింది.రాజా, నోయెల్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. వల్గారిటీ లేదు.ఫ్యామిలీస్ అందరూ కలిసి ఎంజాయ్ చేయవచ్చు. సిరీస్ ఎంగేజింగ్‌గా ఆకట్టుకుంటోంది.’’ అన్నారు.
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘‘ఇంత మంచి ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చిన కోన వెంకట్‌గారికి, దాన్ని ఇంకా అద్బుతంగా డైరెక్ట్ చేసిన చక్రిగారికి థాంక్స్. ఇంకా మా ఈవెంట్‌కు వచ్చి సపోర్ట్ చేసిన గెస్టులందరికీ స్పెషల్ థాంక్స్. ఆది సాయికుమార్‌గారు చాలా సెటిల్డ్‌గా నటించారు. జీ 5కి, నాకు సపోర్ట్ చేసిన టీమ్‌కి థాంక్స్’’ అన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ ‘‘నేను ఫస్ట్ టైమ్ రైటర్‌గా వర్క్ చేసిన రైటర్స్ అందరికీ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అదే సెంటిమెంట్ ఆది విషయంలోనూ నిజమైంది. పులి మేక సిరీస్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. యు.ఎస్, యు.కె. జర్మనీ ఇలా అన్నీ చోట్ల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంది. లావణ్య, ఆది నుంచి ప్రతి ఒక ఆర్టిస్ట్ ఎక్స్‌ట్రార్డినరీగా నటించారు. ఇక డైరెక్టర్ చక్రి తెరకెక్కించిన తీరు ఎంతో బావుందని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. లావణ్య నటన చూసిన వాంరదూ సర్‌ప్రైజింగ్‌గా ఫీల్ అయ్యారు. అలాగే ఆది విషయానికి వస్తే ఒక వైపు అమాయకంగా, మరో వైపు తెలివైన వాడిగా చేయటం చాలా కష్టం. తను హోం వర్క్ చేసి మరీ యాక్ట్ చేశాడు. ఇక లావణ్య అయితే ప్రతీ సీన్‌ని చాలెంజింగ్‌గా తీసుకుని నటించింది. అలాగే ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి వర్క్ చేవారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.
సుష్మిత కొణిదెల మాట్లాడుతూ ‘‘మంచి కాన్సెప్ట్‌లను ఒరిజినల్స్‌గా మార్చి ప్రేక్షకులను ఎంటైర్ చేస్తున్న జీ 5కి అభినందనలు. క్యూట్, స్వీట్‌గా ఉండే లావణ్య త్రిపాఠిని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌కి ఎంపిక చేసిన కోన వెంకట్‌గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. లావణ్య అద్భుతంగా చేసింది. కోనగారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన బ్రిలియంట్ స్టోరి టెల్లర్. ఆయన షో రన్నర్‌గా చేసిన ఇలాంటి వెబ్ సిరీస్ ఎంగేజింగ్‌గానే ఉటుందనటంలో సందేహం లేదు. ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్‌లను ఓటీటీల్లో రావటం మంచి పరిణామం. డైరెక్టర్ చక్రిగారి టేకింగ్ ఫెంటాస్టిక్. లావణ్య, ఆది సాయికుమార్, చక్రిగారు సహా ఎంటైర్ టీమ్‌కి అభినందనలు’’ అన్నారు.
చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘‘తెలుగు జానపద కథలు తెలిసిన వారెవరైనా పులి మేక అనే టైటిల్ వినగానే కనెక్ట్ అవుతారు. అలాంటి టైటిల్‌ను క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌కి లింక్ చేస్తూ కోనగారు కథ రాసిన విధానం ఆకట్టుకుంది’’ అన్నారు.
బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ ‘‘ముందుగా పులి మేక సిరీస్‌ని చేసి దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న జీ 5 వారికి థాంక్స్.. కంగ్రాట్యులేషన్స్. అందాల రాక్షసి లాంటి లావణ్యను ఇందులో రాక్షసిలా చూపించాడు మా చక్రి. కోనగారు రైటర్‌గా చేసిన వాటిలో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు వచ్చాయి. ఆయన రైటింగ్‌లో వచ్చిన పులిమేక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇంకా ఆకట్టుకుంది. డైరెక్టర్ చక్రికి అభినందనలు. మా అందరితో కలిసి వర్క్ చేశారు. ఎంటైర్ టీమ్‌కు కంగ్రాంట్స్’’ అన్నారు.
కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ‘‘కోన వెంకట్‌గారికి థాంక్స్. ఈ వెబ్ సిరీస్‌కి రైటింగ్‌తో పాటు డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఆయనకు చక్రి తోడు కావటంతో కంటెంట్ బలంగా నిలిచింది. లావణ్య త్రిపాఠి కొత్త అవతార్‌లో కనిపించింది. ఆది సాయికుమార్ సహా అందరికీ కంగ్రాట్స్.. ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
నోయల్ మాట్లాడుతూ ‘‘కోన వెంకట్‌గారి దర్శకత్వంలో చేయటమే గొప్ప లక్‌గా భావిస్తున్నాను. డైరెక్టర్ చక్రిగారు ఎంత కష్టపడ్డారో చూశాను. అలాగే మా అందరికీ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన టీమ్‌కి థాంక్స్. ఆదిగారితో ఎప్పటి నుంచో వర్క్ చేయాలనుకున్నాను. ఇప్పటికీ కుదిరింది. లావణ్యకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. వారిలో నేనూ ఒకడిని.పులి మేకలో ఇప్పటి వరకు చేయని పవర్‌ఫుల్ రోల్‌లో మెప్పించింది. అందరికీ థాంక్స్’’ అన్నారు.
హేమంత్ మధుకర్ మాట్లాడుతూ ‘‘నాకు కోనగారు ఎంత డేడికేటెడ్‌గా వర్క్ చేస్తారో నాకు తెలుసు. ఆయన థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేస్తున్నారని తెలియగానే ఆసక్తిగా అనిపించింది. ట్రైలర్ చూడగానే నచ్చింది. వెంటనే ఆయనకు ఫోన్ చేశాను. ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పాను. లావణ్య, ఆది అందరూ అద్భుతంగా నటించారు. చక్రి విజువల్స్ గా, ఎంగేజింగ్ చక్కగా తెరకెక్కించాడు. జీ 5కి, పులి మేక టీమ్‌కి అభినందనలు’’ అన్నారు.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ ‘‘కోన వెంకట్‌గారు నాకు గాడ్ ఫాదర్. ఇంత మంది నటీనటులను ఒక వేదికపై తీసుకు రావటం కోన వెంకట్‌గారికే సాధ్యం. లావణ్య త్రిపాఠిగారు, ఆది సాయికుమార్‌గారు పాత్రలు చాలా గ్రిప్పింగ్‌గా ఉన్నాయి. లావణ్యగారు ఫైట్స్ చేయటం చూస్తే షాకింగ్‌గా అనిపించింది. ఆది సాయికుమార్.. మంచి కంటెంట్‌లో నటించాలని తనే ఇన్షియేట్ తీసుకుని నటించాడు. తనకు అభినందనలు. డైరెక్టర్ చక్రి నాకు కమర్షియల్ డైరెక్టర్‌గా తెలుసు. ఇలాంటి థ్రిల్లర్‌ను ఎలా చేస్తాడోనని అనుకున్నాను. కానీ తను ఏదైనా చేయగలను ప్రూవ్ చేశాడు. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్’’ అన్నారు.
జీ 5 కంటెంట్ హెడ్ సాయితేజ్ మాట్లాడుతూ ‘‘నేను ట్రైలర్ రిలీజ్ రోజునే చెప్పాను. కోన వెంకట్‌గారు అద్భుతమైన అడవిని సృష్టించారు. హత్యలు చేసెదెవరని అందరూ కామెంట్స్ రూపంలో అడుతున్నారు. అదెవరో తెలియాలంటే జీ 5 సబ్ స్క్రైబ్ చేసుకుని చూడాల్సిందే. జీ 5లో ప్రతి నెలా ఓ సంక్రాంతిని అందిస్తాం. పులి మేక ట్రెండ్ సెట్టర్ అవుతుంది. కోనగారితో ఇంకా మరెన్నో వెబ్ సిరీస్‌లు చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సిరి హన్మంత్ మాట్లాడుతూ ‘‘కోన వెంకట్‌గారికి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే. బిగ్ బాస్ హౌస్‌లో నన్ను చూసి నా కోసం ఓ క్యారెక్టర్‌ను క్రియేట్ చేశారు. ఇక మా డైరెక్టర్ చక్రిగారు కూల్.. కంపోజ్‌డ్ పర్సన్. ఆది సాయికుమార్, లావణ్యకు థాంక్స్. అందరికీ థాంక్స్’’ అన్నారు.
శ్రీహాన్ మాట్లాడుతూ ‘‘‘పులి మేక’ సిరీస్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. నేను ఓ ఎపిసోడ్ చూద్దామని స్టార్ట్ చేస్తే అది కంటిన్యూ అవుతూ వచ్చింది. కోనగారు అంత మంచిగా స్క్రిప్ట్ డిజైన్ చేశారు. అలాగే ఇంత మంచి స్క్రిప్ట్‌ను ఎంపిక చేసిన సిరీస్ చేసిన మా జీ 5 వారికి కూడా థాంక్స్. లావణ్య త్రిపాఠి అయితే యాక్షన్ సీన్స్‌లో ఎలాంటి డూప్ లేకుండా ఇరగతీసేశారు. ఆది సాయికుమార్ అయితే చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్‌లో తనదైన యాక్టింగ్‌తో అలరించారు. భవిష్యత్తులో కూడా జీ 5వాళ్లు ఇలాంటి మంచి స్క్రిప్ట్స్‌తో ఆడియెన్స్‌ను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చమ్మక్ చంద్ర, ప్రియాంక సింగ్, మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు.…
The much-awaited teaser of Attitude Star Chandra Hass' upcoming film Barabar Premistha was released today…
Hyderabad:The movie 'Deccan Sarkar', directed by Kala Srinivas under the Kala Arts banner, recently had…
హైదరాబాద్:కళా ఆర్ట్స్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ…
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…