Categories: Uncategorized

సుఖ మీడియా ‘’నారాయణ & కో ‘ ట్రైలర్

హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేసిన సుధాకర్ కోమాకుల, చిన్నా పాపిశెట్టి, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ & సుఖ మీడియా ‘’నారాయణ & కో ‘ ట్రైలర్    

యంగ్ హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’ జూన్ 30న విడుదల కానుంది. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.  ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేశారు.

”నెక్స్ట్ టెన్ డేస్ లో చాలా పెద్ద డీల్ వుంది. దుబాయ్ నుంచి ముంబాయికి ఒక పిల్లి బొమ్మ వస్తుంది. దాన్ని చాలా సేఫ్ గా మన దగ్గరకు చేర్చాలి” అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది.

నారాయణ కుటుంబంలో పాత్రలన్నీ చాలా వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. ట్రైలర్ లోచెప్పినట్లు  నారాయణ & కో  ధెడ్ దిమాక్  & తిక్కల్ బ్యాచ్. ట్రైలర్ అన్ లిమిటెడ్ ఫన్ ని అందించింది. ట్రైలర్ చివర్లో పిల్లి బొమ్మ చుట్టూ నడిపిన సన్నివేశాలు హిలేరియస్ కామెడీని అందించాయి.

సుధాకర్ కోమాకుల తనదైన టైమింగ్ తో ఆకట్టుకున్నారు. దేవి ప్రసాద్ ,ఆమనీ పాత్రలు కూడా మంచి వినోదాన్ని పంచాయి. నేపధ్య సంగీతం ఫన్ ని మరింత ఎలివేట్ చేసింది. మొత్తానికి  ‘’నారాయణ & కో ట్రైలర్.. ఈ చిత్రం అన్ లిమిటెడ్ ఫన్ రైడ్ అని భరోసా ఇచ్చింది.

సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల, నాగ వంశీ త్రయం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ, సిద్దం మనోహర్ అడిషినల్  సినిమాటోగ్రఫీ అందించారు. కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

రవితేజ జి ఈ చిత్రానికి కథను అందించగా, రాజీవ్ కె డైలాగ్ రైటర్. సృజన అడుసుమిల్లి ఎడిటర్.  శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాత, రవి దొండపాటి ఆర్ట్ డైరెక్టర్.  

తారాగణం: సుధాకర్ కోమాకుల, దేవి ప్రసాద్, ఆమని, జై కృష్ణ, పూజ కిరణ్, ఆరతి పొడి, యామిని బండారు, సప్తగిరి, అలీ రెజా, శివ రామచంద్రపు, తోటపల్లి మధు, రాగిణి, అనంత్, తదితరులు.

సాంకేతిక విభాగం:

బ్యానర్: పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్ & సుఖ మీడియా

స్క్రీన్ ప్లే & దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి

నిర్మాతలు: పాపిశెట్టి బ్రదర్స్ & సుధాకర్ కోమాకుల

సహ నిర్మాత: శ్రీనివాస్ గొర్రిపూడి

అసోసియేట్ నిర్మాత: శరద్ గుమస్తే, రెడ్ సెడార్ ఎంటర్‌టైన్‌మెంట్

సంగీతం: సురేష్ బొబ్బిలి, డా. జోస్యభట్ల & నాగ వంశీ

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: కమ్రాన్

డీవోపీ: రాహుల్ శ్రీవాత్సవ్

అడిషినల్ DOP: సిద్దం మనోహర్

కథ: రవితేజ జి

డైలాగ్స్: రాజీవ్ కె

సింగర్స్: రాహుల్ సిప్లిగంజ్, రామ్ మిరియాల, అనురాగ్ కులకర్ణి, సాయి చరణ్ & ప్రణతి.

కొరియోగ్రఫీ: విజయ్ పోలాకి & మోహన్ కృష్ణ

ఎడిటర్: సృజన అడుసుమిల్లి

కాస్ట్యూమ్ డిజైనర్: మానస నాయుడు ఎ

పబ్లిసిటీ డిజైనర్: మాని

ఆర్ట్ డైరెక్టర్: రవి దొండపాటి

ప్రొడక్షన్ మేనేజర్: టేకుమూడి రాజు

పీఆర్వో : వంశీ-శేఖర్

డిజిటల్ మీడియా: హాష్‌ట్యాగ్ మీడియా

లైన్ ప్రొడ్యూసర్: రవివర్మ దంతులూరి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ రెడ్డి వెన్నపూస

క్యాషియర్: కిరణ్ అనుభమ్

Tfja Team

Recent Posts

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…

20 hours ago

‘ఎర్రచీర’ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. ఫిబ్రవరి 6న నేను టికెట్ కొనుక్కుని సినిమా చూస్తా: మాజీ ఎంపీ మధు యాష్కి

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ…

21 hours ago

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్అమరావతి

ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం (03/02/2026) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ…

21 hours ago

బరాబర్ బాధపడుతున్నాను!!

ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన…

21 hours ago

3 వేల ఎంట్రీలు, 100 మంది ఫైనలిస్టులు.. AVAA జర్నీకి శ్రీకారం చుట్టిన విష్ణు మంచు,హోస్ట్‌గా శివ బాలాజీ

సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో AVAA ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అధికారికంగా…

21 hours ago

టాలెంటెడ్ హీరో లెజెండ్ శరవణన్ “లీడర్” సినిమా గ్లింప్స్ రిలీజ్, ఏప్రిల్ లో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న మూవీ

లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "లీడర్". ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్…

21 hours ago