తరుణ్ భాస్కర్ దాస్యం, విజి సైన్మా ‘కీడా కోలా’ నుంచి నాయుడుగా తరుణ్ భాస్కర్ లుక్ విడుదల, టీజర్ జూన్ 28న విడుదల, జూన్ 29న ‘ఈ నగరానికి ఏమైంది’ రీరిలీజ్
తన తొలి రెండు చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో చేస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నాయుడుగా తరుణ్ భాస్కర్ లుక్ ని రివిల్ చేశారు. చేతిలో గన్ నోట్లో సిగరెట్ తో వైలెంట్ గా కనిపించిన తరుణ్ భాస్కర్ లుక్ సర్ప్రైజ్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ లో ‘శ్వాస మీద ధ్యాస’ అనే క్యాప్షన్ ఆసక్తికంగా వుంది.
దీంతోపాటు ఈ చిత్రం టీజర్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు మేకర్స్. జూన్28 ‘కీడా కోలా’ టీజర్ విడుదల చేస్తున్నారు. అలాగే తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఐదేళ్లను పురస్కరించుకుని జూన్ 29న ఎంపిక చేసిన థియేటర్లు & క్లబ్‌లలో రీరిలీజ్ చేస్తున్నారు. ”28న టీజర్ చూసి, 29న మీ గ్యాంగ్ తో కలిసి సినిమాకి రండి. చూసుకుందాం” అని మేకర్స్ తెలియజేశారు.
కీడా కోలా చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ, ఉపేంద్ర వర్మ ఎడిటర్, ఆశిష్ తేజ పులాల ఆర్ట్ డైరెక్టర్.
రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్ దాస్యం
నిర్మాతలు : కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్ & ఉపేంద్ర వర్మ
సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్
ఎడిటర్: ఉపేంద్ర వర్మ
ఆర్ట్: ఆశిష్ తేజ పులాల
కాస్ట్యూమ్స్ : పూజిత తాడికొండ
పీఆర్వో: వంశీ-శేఖర్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…