Categories: Uncategorized

సీనియర్ యాక్టర్స్ సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

మాస్టర్ కనిష్క్ మహాబలాహ్ సమర్పణలో శ్రీ శుభకర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఓ మాట అనుకుందామా!’. సుహాసిని , వినోద్ కుమార్, ఇంద్రజ కీ రోల్ ప్లే చేస్తున్నారు.శ్రీనివాస్ అనంతనేని, మోనికా మిశ్రా హీరోహీరోయిన్లు కాగా, శుభలేఖ సుధాకర్, కార్తికేయ దేవ్, అజిజ్ ఖాన్, అన్నపూర్ణమ్మ మిగతా పాత్రలు పోషిస్తున్నారు. భీమ్‌జీ కథ, దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి పెంటి నాగరాజు, పెంటి నీరజ్ సందీప్ నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లుక్ గ్లింప్స్‌ని సుహాసిని మణిరత్నం, వినోద్ కుమార్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ విడుదల అనంతరం సుహాసిని మణిరత్నం, వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఓ మాట అనుకుందామా!’ సినిమాలో చాలా మంచి పాత్రలు పోషిస్తున్నామని, ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ చాలా బాగున్నాయని అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించి, టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ఈ సందర్భగా దర్శకుడు భీమ్‌‌జీ మాట్లాడుతూ.. ముందుగా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ విడుదల చేసిన సీనియర్ నటీనటులు సుహాసిని మేడమ్‌కు, వినోద్ కుమార్ సార్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాలో వారి పాత్రలు చాలా కీలకంగా ఉంటాయి. శ్రీనివాస్ అనంతనేని, మోనికా మిశ్రాల పాత్రలు అందరినీ కట్టిపడేస్తాయి. ఒక సరికొత్త ప్రేమకథని ప్రేక్షకులకు ముందుకు తీసుకురాబోతున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది. నిర్మాతలు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని అన్నారు.

నిర్మాతలు పెంటి నాగరాజు, పెంటి నీరజ్ సందీప్ మాట్లాడుతూ.. భీమ్‌జీ అద్భుతమైన కథతో ‘ఓ మాట అనుకుందామా!’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాకు కథ ఎంతగానో నచ్చింది. ఇందులో సీనియర్ నటులెందరో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ విడుదల చేసిన సుహాసిని గారికి, వినోద్ కుమార్ గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలోనే టీజర్‌తో వస్తాం. మా బ్యానర్ నుంచి ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు.

సుహాసిని మణిరత్నం, వినోద్ కుమార్, ఇంద్రజ, శుభలేఖ సుధాకర్, శ్రీనివాస్ అనంతనేని, మోనికా మిశ్రా కార్తికేయ దేవ్, అజిజ్ ఖాన్, అన్నపూర్ణమ్మ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి
సమర్పణ: మాస్టర్ కనిష్క్ మహాబలాహ్
బ్యానర్: శ్రీ శుభకర క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ: సుకిృత్ కెఎస్
మ్యూజిక్: అలోష్య పీటర్ – వినోద్ యజమాన్య
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాతలు: పెంటి నాగరాజు (M.A)
పెంటి నీరజ్ సందీప్ (MBA, సింగపూర్)
కథ-దర్శకత్వం: భీమ్‌జీ

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago