Categories: Uncategorized

“నేను మీకు బాగా కావాల్సినవాడిని”.చిత్రంలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను..స్టార్ కోరియోగ్రాఫర్ బాబా బాస్కర్ ఇంటర్వ్యూ

కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌,సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న చిత్రం  “నేను మీకు బాగా కావాల్సినవాడిని”.ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ‘SR కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా ఈ చిత్రంలో  లీడ్ రోల్ లో నటించిన స్టార్ కోరియోగ్రాఫర్ బాబా బాస్కర్ పాత్రికేయులతో మాట్లాడుతూ

కోరియోగ్రాఫర్  , డ్యాన్సర్ , యాక్టర్…ఇలా ఏదైనా సరే నాకు సినిమానే జీవితం, సినిమానే నా డ్రీమ్. ఈ సినిమాలో  హీరోకి స్నేహితుడుగా కీలక పాత్రలో నటించాను. అయన తో పని చేయడం చాలా సులువుగా ఉంది. తను అందరితో బాగా కలసి పోతాడు.చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె కు కథ  విషయంలో మంచి స్పష్టత ఉంది. ఈ సినిమా కొరకు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎంతో మందికి  లైఫ్ ఇచ్చిన కోడిరామకృష్ణ  బ్యానర్ లో నటించడం చాలా హ్యాపీ గా ఉంది

ఈ సినిమాలో నటిస్తూనే లాయర్ పాప సాంగ్ కు కోరియోగ్రఫీ చేశాను.ఈ పాట ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.. నాకు కోరియోగ్రఫీ, యాక్టింగ్ అనేవాటిని వేరుగా చూడకుండా .రెండు సేమ్ అని భావిస్తాను.అయితే నాకు ఎవరు ఏ అవకాశం ఇచ్చినా  చేస్తాను. చివరికి చిన్న క్యారెక్టర్ అయినా చెయ్యాలనే కోరిక ఉంది.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago