Categories: Uncategorized

సంతోష్ శోభన్.. ‘ప్రేమ్ కుమార్ కథ’ టీజర్

‘ప్రేమ్‌ కుమార్’గా సంతోష్ శోభన్.. ఎంటర్‌టైనింగ్‌గా ‘ప్రేమ్ కుమార్ కథ’ టీజర్

విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ఇటీవల ‘అన్నీ మంచి శకునములే..’ అంటూ ఆడియన్స్‌ను మెప్పించిన సంతోష్‌.. ‘ప్రేమ్‌ కుమార్ క‌థ‌’ అంటూ మరో డిఫరెంట్ మూవీతో బాక్సాఫీసు వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ద్వారా నటుడు, రచయిత అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా యాక్ట్ చేస్తుండగా.. కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

టీజర్ విషయానికి వస్తే.. సుయోధన ఈ ప్రేమ్‌ కుమార్ గాడి కథ ఏమిటి అంటూ.. మహాభారతంలో శకుని డైలాగ్‌తో విభిన్నంగా ప్రారంభించారు. ఈ సినిమాకు హీరో సంతోష్ శోభన్ కాగా.. విలన్‌ కృష్ణ చైతన్య. ప్రేమ్ కుమార్ చిత్ర కథ ఓ సినిమా నేపథ్యంలో సాగుతుండగా.. ఇందులో సాగే రీల్‌ లైఫ్‌లో కృష్ట చైతన్య హీరోగా ఉంటాడు. కృష్ణ చైతన్యకు విలన్‌గా సంతోష్‌ శోభన్. హీరోయిన్ రాశీ సింగ్‌ కాగా.. రీల్‌ లైఫ్‌లో రుచితా సాధినేని హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.

కథలో ట్విస్టులు మీద ట్విస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోయిన్లు ఎవరిని లవ్ చేశారు..? సినిమాలోని రీల్‌ లైఫ్‌ హీరోయిన్‌ రుచితా సాధినేని ఎవరిని ఇష్టపడింది..? రీల్‌ లైఫ్‌ హీరో కృష్ణ చైతన్యను ప్రేమించిదా..? లేదంటే సంతోష్‌ శోభన్‌నా..? ఫైనల్‌గా ఈ సినిమాలోని సినిమా హీరో రియల్ హీరో అయ్యాడా..? సినిమా హీరోనే హీరో అయ్యాడా..? అసలు హీరోయిన్ రాశీ సింగ్ ఏమనుకుంటుంది..? హీరోయిన్‌ను ఎవరు..? ఓ మై గాడ్ ఏమి అర్థం కాలేదు సుయోధన.. అని అనుకుంటున్నారా.. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ నెల 18న విడుదల కానున్న ట్రైలర్‌ కోసం వేచి చూడాల్సిందే.

కష్టమైన డైలాగ్‌తో టీజర్‌ను డిజైన్ చేసిన మేకర్స్.. ఆడియన్స్‌ను ట్రైలర్ కోసం వేచి చూసేలా కాస్త క్రియేటివ్‌గా ఆక‌ట్టుకునే ప్రయత్నం చేశారు. జూలై 18న ట్రైలర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. టీజర్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కామెడీతోపాటు రెండు జంటల నేపథ్యంలో సాగే ప్రేమ కథను దర్శకుడు డిఫరెంట్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎస్.అనంత్ శ్రీకర్ అందించగా.. ఎడిటర్ గ్యారీ బీహెచ్ వ్యవహరిస్తున్నారు. డీఓపీగా రాంపీ నందిగం పనిచేస్తున్నారు.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

7 days ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago