రష్మిక మందన, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, తెలుగు తమిళ ద్విభాషా చిత్రం ‘రెయిన్‌బో’ తొలి షెడ్యూల్ పూర్తి, రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం
రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందుతున్న తెలుగు తమిళ ద్విభాషా రోమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్ ‘రెయిన్‌బో. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ మరో ప్రధాన పాత్ర పోహిస్తున్నారు. నూతన దర్శకుడు శాంతరూబన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటివలే ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. కోడైకెనాల్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇప్పుడు ‘రెయిన్‌బో’ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కి సిద్ధమౌతోంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది.
ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. భాస్కరన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్ ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్నారు. ఇ. సంగతమిళన్ ఎడిటర్.
తారాగణం: రష్మిక మందన, దేవ్ మోహన్
సాంకేతిక విభాగం:
దర్శకత్వం-శాంతరూబన్
డీవోపీ-కె. ఎం. భాస్కరన్
సంగీతం – జస్టిన్ ప్రభాకరన్
ఎడిటర్ – ఇ. సంగతమిళన్
ప్రొడక్షన్ డిజైనర్- వినీష్ బంగ్లాన్
ఆర్ట్ డైరెక్టర్: సుబెంథర్ పిఎల్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: తంగప్రభాకరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరవేంద్రరాజ్ బాస్కరన్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…