నవంబర్ 2న ‘ఆహా’లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కు వస్తున్న రావణ్

Must Read

రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు, తమిళ బాషల్లో రూపొందించారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది “ఆపరేషన్ రావణ్” సినిమా. తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. “ఆపరేషన్ రావణ్” సినిమా ఆహా ఓటీటీలో నవంబర్ 2వ తేదీన వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కానుంది.

“ఆపరేషన్ రావణ్” సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియెన్స్ ను “ఆపరేషన్ రావణ్” సినిమా బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఆహాలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకోనుంది.

నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు

సాంకేతిక బృందం :
సంగీతం: శరవణ వాసుదేవన్
డైలాగ్స్: లక్ష్మీ లోహిత్ పూజారి
ఎడిటర్: సత్య గిద్దుటూరి
ఆర్ట్: నాని.టి
ఫైట్స్: స్టంట్ జాషువా
కోరియోగ్రఫీ: జేడీ
ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొళ్లేటి
పిఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
రచన-దర్శకత్వం: వెంకట సత్య

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News