వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌రాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతులమీదుగా రిలీజైన ఈ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా సినిమా ఉండబోతుందని పేర్కొన్నారు. ట్రైలర్ చాలా బాగుందని ప్రేక్షకులకు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడే విధంగా ఉందని తెలిపారు. సినిమా నిర్మించి విడుదల చేయడం అనేది ఓ సాహసమని ఆ విషయంలో చిత్ర నిర్మాత కే. ఓ. రామరాజు విజయం సాధించారు అని, సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని అన్నారు.
చిత్రంలో నటించిన హీరో ప్రవీణ్‌రాజ్‌కుమార్, హీరోయిన్స్ శశికా టిక్కో, అశురెడ్డి లకు ప్రత్యేక విషెస్ చెప్పారు. అలాగే చిత్రంలో నటించిన మిగితా నటీనటులకు, టెక్నిషియన్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పద్మవ్యూహంలో చక్రధారి సినిమాను ప్రేక్షకులు ఆదరించి, విజయవంతం చేయాలని కోరారు. ట్రైలర్ లో చూపించినట్లు ఫస్ట్‌లవ్‌లో ఫెయిల్ అయిన వ్యక్తి అదే ధ్యాసలో ఉంటూ వేదన పడుతాడని, దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేదాన్ని.. ఎంతో ఆసక్తితో అన్ని హంగులు సమపాలల్లో ఉండేలా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ జూన్ 21న ఘనంగా థియేటర్లలో విడుదలకు సిద్ధం అయింది. కచ్చితంగా చిత్రం మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
చిత్రం: పద్మవ్యూహంలో చక్రధారి
నటీనటులు: ప్రవీణ్‌రాజ్‌కుమార్, శశికా టిక్కో, అషురెడ్డి, మధునందన్, భూపాల్ రాజ్, ధనరాజ్, రూప లక్ష్మి , మాస్టర్ రోహన్, మురళీధర్ గౌడ్, మహేష్ విట్టా, వాసు వన్స్ మోర్ తదితరులు.
సంగీత దర్శకుడు: వినోద్ యాజమాన్య
సినిమాటోగ్రఫీ: జి. అమర్
ఎడిటర్: ఎస్ బి ఉద్దవ్
స్టోరీ, డైలాగ్స్.. దర్శన్
పీఆర్ఓ: హరీష్, దినేష్
బ్యానర్: వీసీ క్రియేషన్స్
నిర్మాత: కే.ఒ. రామరాజు
దర్శకత్వం: సంజయ్‌రెడ్డి బంగారపు
-"సుధీర్స్ జోకర్" చిత్రంలో డిటెక్టివ్ జీవన్ పాత్రలో ఆకట్టుకోనున్న మురళీశర్మ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సుధీర్స్…
ఫోనిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై, మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్, రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న “ఫ్రెండ్లీ ఘోస్ట్”…
ఐశ్వర్య సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సింధుసూర్య నిర్మిస్తున్న నూతన చిత్రం 'శివ గాడి జిందగీ'. సచిన్ రామ్ ప్రతాప్, హాసిని…
ది మేజ్" చిత్రంతో దర్శకుడిగా డాక్టర్ కాబోయి యాక్టర్ కావడం చూస్తుంటాం కానీ డా. రవికిరణ్ గడలాయ్ ఎం.డి, పాథాలజిస్ట్…
ఎంఎస్ రాజు గారు ‘అగధ’ సీక్వెల్ ఎప్పుడు అంటారో చూడాలి - హీరో శ్రవణ్ రెడ్డి శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్…
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని…