కర్టెన్ రైజర్ ఆవిష్కరించిన మంత్రి తలసాని
ఎఫ్.టి.పి.సి ఇండియా –
తెలుగు సినిమా వేదిక
సంయుక్త నిర్వహణ!!!
ఫిలిం అండ్ టెలివిజన్ కౌన్సిల్ అఫ్ ఇండియా దివంగత ఎన్ టీ ఆర్ శత జయంతి ఉత్సవాల ముగింపుని పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక సౌజన్యంతో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు.
మంత్రి క్యాంపు ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు మనం సైతం వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్ అతిధిగా విచ్చేసారు. ఎఫ్ టి పీ సి అధ్యక్షులు చైతన్య జంగా, తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు వీస్ వర్మ పాకలపాటి, అవార్డ్స్ కమిటీ సభ్యులు విశ్వనాధ్, రాంచంద్, నాగార్జున రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్న ఈ ఆవిష్కరణకు గ్లోబల్ మోడల్ అవార్డు విన్నర్ ఐశ్వర్య రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
విశ్వవిఖ్యాత నటులు ఎన్టీఆర్ శతజయంతి ముగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనుండడం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.
ఎనిమిది రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ఈ సినీ సామాజిక పురస్కార సంబరం ఈ నెల 28 న ప్రసాద్ ల్యాబ్ ఆడిటోరియంలో జరగనుంది. ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారని చైతన్య జంగా – వీస్ వర్మ పాకలపాటి పేర్కొన్నారు!!
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…