మంచి అభిరుచి గల నిర్మాతగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లని తెరకెక్కించిన సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా, నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్సకత్వంలో నూతన చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది.
ముహూర్తం షాట్‌కు లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్‌బోర్డ్ కొట్టి స్క్రిప్ట్‌ను అందజేశారు. నాని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు.
ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో నాగ శౌర్యకు వున్న క్రేజ్ కి తగినట్లు ఫన్-ఫిల్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వుండబోతుంది. నూతన దర్శకుడు యూనిక్ స్క్రిప్ట్, ట్రీట్మెంట్ తో ఈ సినిమాని చాలా ప్రత్యేకంగా రూపొందించనున్నారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా యుక్తి తరేజా నటిస్తోంది. నాగ చైతన్య లవ్ స్టోరీకి అద్భుతమైన ఆల్బమ్ అందించిన ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
తారాగణం:
హీరో – నాగశౌర్య
కథానాయిక – యుక్తి తరేజా
సాంకేతిక విభాగం:
దర్శకత్వం – పవన్ బాసంశెట్టి
డీవోపీ – వంశీ పచ్చిపులుసు
సంగీతం – పవన్ సిహెచ్
ఆర్ట్ డైరెక్టర్ – ఎ ఎస్ ప్రకాష్
ఎడిటర్ – కార్తీక్ శ్రీనివాస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి
ప్రొడక్షన్ బ్యానర్ – శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి
నిర్మాత: చెరుకూరి సుధాకర్
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…