నాగ శౌర్య కొత్త సినిమా ప్రారంభం

Must Read

మంచి అభిరుచి గల నిర్మాతగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లని తెరకెక్కించిన సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా,  నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్సకత్వంలో నూతన చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది.

ముహూర్తం షాట్‌కు లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్‌బోర్డ్‌ కొట్టి స్క్రిప్ట్‌ను అందజేశారు. నాని ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు.

ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో నాగ శౌర్యకు వున్న క్రేజ్ కి తగినట్లు ఫన్-ఫిల్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వుండబోతుంది. నూతన దర్శకుడు యూనిక్ స్క్రిప్ట్, ట్రీట్మెంట్ తో ఈ సినిమాని చాలా ప్రత్యేకంగా రూపొందించనున్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.  

ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా యుక్తి తరేజా నటిస్తోంది. నాగ చైతన్య లవ్ స్టోరీకి అద్భుతమైన ఆల్బమ్ అందించిన ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

తారాగణం:

హీరో – నాగశౌర్య
కథానాయిక – యుక్తి తరేజా

సాంకేతిక విభాగం:
దర్శకత్వం – పవన్ బాసంశెట్టి
డీవోపీ – వంశీ పచ్చిపులుసు
సంగీతం – పవన్ సిహెచ్
ఆర్ట్ డైరెక్టర్ – ఎ ఎస్ ప్రకాష్
ఎడిటర్ – కార్తీక్ శ్రీనివాస్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి

ప్రొడక్షన్ బ్యానర్ – శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి
నిర్మాత: చెరుకూరి సుధాకర్

Latest News

ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్ హీరోహీరోయిన్లుగా "మర్రిచెట్టు కింద మనోళ్ళు"...

More News