Uncategorized

నాగా నాయుడు పాత్ర  బిగ్ ఛాలెంజ్: విక్టరీ వెంకటేష్

భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ స్టార్స్ లో ఒకరైన వెంకటేష్ దగ్గుబాటి నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘రానా నాయుడు’తో  స్ట్రీమింగ్‌ లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా వున్నారు. ఈ సిరిస్ యాక్షన్ క్రైమ్ డ్రామా అభిమానులకు థ్రిల్లింగ్ వాచ్ అని భరోసా ఇచ్చింది.

వెంకటేష్ దగ్గుబాటి కెరీర్ లో ‘రానా నాయుడు’ ఒక ముఖ్యమైన మైలురాయి. ఎందుకంటే ఇది లాంగ్ స్టొరీ టెల్లింగ్ ప్రపంచంలోకి వెంకటేష్ మొదటి ప్రయత్నం మాత్రమే కాదు, వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు గారి అబ్బాయి రానాతో కలసి నటిస్తున్న తొలి ప్రాజెక్ట్. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన వెంకటేష్ ఈ సిరీస్‌ లో నాగనాయుడు పాత్రలో కనిపించనున్నారు. తన అబ్బాయితో తలపడే పాత్ర ఇది. తండ్రి, కొడుకులుగా ఇద్దరూ పోటాపోటీ పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సిరిస్ కోసం పనిచేసిన తన అనుభవం, స్ట్రీమింగ్ ఫార్మాట్‌ విశేషాలని పంచుకున్నారు వెంకటేష్. “ఇది ఇప్పటివరకు నాకు ఒక ఎక్సయిటింగ్ ప్రయాణం. సిరీస్‌ లో పనిచేయడానికి, ఒక చిత్రంలో పనిచేయడానికి చాలా తేడా వుంటుంది. కథ చెప్పే వేగం శైలికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంది’’ అని చెప్పారు. నెగిటివ్ పాత్రను పోషించడం నా వరకూ రిఫ్రెష్ మార్పు.  క్రాఫ్ట్ యొక్క కొత్త కోణాలను అన్వేషించడానికి దోహదపడింది. ” సంక్లిష్టమైన పాత్రలు నన్ను ఆకర్షిస్తాయి. ‘రానా నాయుడు’ లో చేసింది కూడా అలాంటి పాత్రే. పూర్తిగా  భిన్నమైన వ్యక్తిత్వం వున్న పాత్రను పోషించడం సవాలుగా అనిపించినప్పటికీ ఈ పాత్ర తృప్తిని ఇచ్చింది అన్నారు. 

రానాతో స్క్రీన్ పంచుకోవడం గురించి చెబుతూ.. “రానా కి ఎదురుగా వార్ చేయడం అంత సులువు కాదు. నటుడిగా నాకిది ఒక సవాల్. ఆఫ్-స్క్రీన్ మాకు గొప్ప ఈక్వేషన్ వుంది. బాబాయ్ అబ్బాయి కంటే మేము స్నేహితులలాంటివాళ్ళం. కానీ తెరపై, ఒకరంటే ఒకరికి పడని తండ్రి-కొడుకులుగా వార్ ఈక్వేషన్ తీసుకురావడం కష్టం! ఒక నటుడిగా ఆర్ట్ లో ఇది చాలా సంతోషకరమైన భాగం. ఇప్పటివరకు అనుభవించని పరిస్థితులను, భావోద్వేగాలతో పాటు ప్రేక్షకులు పాత్రలతో కనెక్ట్ అవుతారు. ఇది ఖచ్చితంగా మా ఇద్దరికీ కొత్త ప్రయత్నం. మేము కలిసి పనిచేశాము. మా పాత్రలకు జీవం పోయడానికి ఓకరికొకరు సూచనలు తీసుకున్నాము’’ అన్నారు 

రానా నాయుడు లో వెంకటేష్ ని  ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని పాత్రలో చూస్తారు. గ్రిప్పింగ్ కథాంశం, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌హౌస్ పెర్ ఫార్మెన్స్ కోసం, మంచి క్రైమ్ డ్రామాను ఇష్టపడే అందరూ తప్పక ఈ సిరిస్ చూడాలి. నాగా తన కుటుంబంతో తిరిగి కలవగలడా లేదా అతను తన కొడుకు రానా అంతిమ ప్రత్యర్థి అని నిరూపిస్తాడా?

మార్చి 10  నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే రాబోయే “రానా నాయుడు” సిరిస్ లో తెలుసుకోండి.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

13 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago