మిస్టర్ అండ్ మిస్, ఓ స్త్రీ రేపు రా, మహానటులు వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ రెడ్డి తాటిపర్తి రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ పై నిర్మాతగా చేస్తున్న కొత్త సినిమా డిటెక్టివ్ కార్తీక్. ఈ చిత్రానికి వెంకట్ నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శ్రుతి మోల్, అనుష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది.
రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి తాటిపర్తి మాట్లాడుతూ – మర్డర్ మిస్టరీ కథతో ఈ చిత్రాన్ని నిర్మించాం. రిషిత అనే పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు సంధ్య అనే డిటెక్టివ్ వస్తుంది. ఆమె కూడా మిస్సింగ్ కావడంతో కార్తీక్ ఆ కేసును టేకప్ చేస్తాడు. ఈ క్రమంలో అతను ఊహించని ఎన్నో పరిణామాలను ఎదుర్కొ సంధ్యను ఎలా చేరుకున్నాడు అనేది కథాంశం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుంది. అన్నారు.
ఈ చిత్రానికి – సినిమాటోగ్రఫీ – సిద్ధం నరేష్, ఎడిటింగ్ – కార్తిక్ కట్స్, సంగీతం – మార్కస్ ఎం, ఆర్ట్ డైరెక్టర్ : హేమంత్ కుమార్ జి, కో ప్రొడ్యూసర్ – పార్థు రెడ్డి, ప్రొడ్యూసర్ – అశోక్ రెడ్డి తాటిపర్తి, పీఆర్వో – జీఎస్కే మీడియా, రచన దర్శకత్వం – వెంకట్ నరేంద్ర.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…