Categories: Uncategorized

చిరంజీవి గారు ఫ్యామిలీ అంతా కలిసి వుండాలని కోరుకుంటారు : బన్నీవాస్‌

మెగాస్టార్‌ చిరంజీవి గారు ఫ్యామిలీ అంతా కలిసి వుండాలని కోరుకుంటారని అన్నారు ప్రముఖ నిర్మాత బన్నీవాస్‌. శుక్రవారం జరిగిన ‘ఆయ్‌’ థీమ్‌ సాంగ్‌ లాంచ్‌ ప్రెస్‌మీట్‌లో ఓ జర్నలిస్టు అడిగిన ఓ ప్రశ్నకు బన్నీవాస్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ
” ఫ్యామిలీలో కొన్ని సిట్యుయేషన్స్‌ వస్తాయి.. మోర్‌ దెన్‌ఎనీ థింగ్‌ వాళ్ల మధ్య వున్న రిలేషన్స్‌ కానీ, వాళ్ల ఫ్యామిలీలు కలిసే సిట్యుయేషన్స్ కానీ నేను20 ఏళ్లుగా చూస్తూనే వున్నా. చిరంజీవి గారు ఎప్పుడూ కూడా ఫ్యామిలీ అంతా కలిసి వుండాలని కోరుకుంటారు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అందరిని సంక్రాంతికి బెంగళూరుకు తీసుకెళతారు.కుదిరిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళతారు. దానిని ఆయన ఓ సెలబ్రేషన్‌లా చేస్తాడు. దానికి కారణం ఫ్యామిలీ అంతా కలిసి వుండాలి అని ఆయన కోరుకోవడం. పిల్లలు ఎదిగినా..ఎవరి ట్రాక్‌లో వాళ్లు వున్నా ఫ్యామిలీ అంతా కలిసి వున్నాం.. మేమంతా ఒక్కటే అనే మేసేజ్‌ బయటికి పంపిస్తుంటారు. వాళ్ల వాళ్ల వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫ్యామిలీలో కొన్ని కొన్ని పరిస్థితులు వస్తాయి. ఫ్యామిలీ అంతా ఆ సిట్యుయేషన్స్‌ను ఫేస్‌ చేయాల్సి వస్తుంది.అంతా మాత్రాన ఇప్పుడున్న తాత్కాలిక ఎమోషన్స్‌ను బేస్‌ చేసుకుని మెగా ఫ్యామిలీకి ప్రజెంట్‌ సిట్యుయేషన్‌తో లింక్‌ చేయడం తెలివైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ల బాండింగ్‌ నాకు తెలుసు. వాళ్లు వాళ్లలో ఒక్కరికి ఏదైనా సిట్యుయేషన్‌ వచ్చినా ఎలా వుంటారో తెలుసు. ఒకే ఒక్క సిట్యుయేషన్‌ చాలు ఇప్పుడున్న అన్ని రూమర్స్‌ చెక్‌ పెట్టడానికి… నేను కూడా దాని గురించే వెయిటింగ్‌. మేము అందరం కోరుకునేది ఒక్కటే. ఆ కుటుంబం బాగుండాలని.. బాగుంటుంది కూడా. ఇలాంటి రూమర్స్‌…ఇవన్నీ పాసింగ్‌ క్లౌడ్స్‌” అన్నా

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago