Categories: Uncategorized

అన్ని పార్టీల మద్దతు మా ‘సౌండ్ పార్టీకే’

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. జయ శంకర్ సమర్పణలో సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. ఇప్ప‌టికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచ‌నాలు పెంచిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సన్నీ మీడియా మిత్రులతో ఇలా మాట్లాడారు.

“బిగ్ బాస్ తర్వాత నేను చేసిన ప్రాజెక్టులో బెస్ట్ ప్రాజెక్టు సౌండ్ పార్టీ. ఈ సినిమా కోసం 100% ఎఫెక్ట్ పెట్టాను. తండ్రి కొడుకుల మధ్య ఉండే ఫ్రెండ్షిప్ బాండింగ్ ను ఫన్నీ వేలో చూపించాం. డబ్బులు కోసం ఫాదర్ అండ్ సన్ ఏం చేశారనేది.. ఏం చేయకూడదనేది ఇందులో చూపించాం. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది.ఇందులో బిట్ కాయిన్ కు కూడా కీలకపాత్ర ఉంటుంది. ఈ సినిమాకు దర్శకుడు సంజయ్ నన్ను రిఫర్ చేశారు. నిర్మాతలు కొత్తవారైనా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంజయ్ స్క్రిప్ట్ ఏదైతే రాశారో అదే తెరపై వచ్చేలా తీశాడు. సినిమాలో పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంటుంది. జయశంకర్ గారు ప్రెజెంటర్ గా ఈ సినిమాకు చాలా హెల్ప్ చేశారు. హ్రితిక శ్రీనివాస్ .. ఆమని గారి మేనకోడలు అని నాకు షూటింగ్ టైంలో తెలియదు. తర్వాత తెలిసి షాక్ అయ్యాను. ఆమె చాలా డౌటు ఎర్త్. చాలా డెడికేటెడ్ గా నటించింది. హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంటుంది. శివన్నారాయణ గారిని చూస్తే ఎవరికైనా ఇప్పటికీ అమృతం సీరియల్ గుర్తొస్తుంది. ఆయన నేను తండ్రి కొడుకులుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాం. కుబేర్ కుమార్ గా ఆయన నటన ఆకట్టుకుంటుంది. చిన్న చిన్న పంచులతో నేచురల్ కామెడీ బాగా పండింది. గతంలో చేసిన తప్పులను చేయకుండా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని పూర్తి చేశాను.


వెన్నెల కిషోర్ గారు ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చి సపోర్ట్ చేస్తే.. నాని అన్న కూడా ప్రమోషన్స్ విషయం లో సపోర్ట్ గా నిలిచారు. సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమా చూసి చాలా నవ్వుకున్నామని చెప్పారు. బాగా ఎంజాయ్ చేశాం అని చెప్పి మమ్మల్ని అభినందించడం మా టీమ్ అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. యూఎస్ లో ప్రీమియర్ వేస్తే వందకు వంద మార్కులు వేశారు.


సినిమా చూసిన ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. కామెడీ జానర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు కొన్ని కామెడీ సినిమాలు చేసినా అవి వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే రా బట్టుకోవాలనే ఫార్ములాతో తిరిగి ఈ సినిమాతో హిట్ కొట్టాలనుకుంటున్న.ఎన్నికల సమయంలో వాస్తున్న మా సౌండ్ పార్టీకి
అన్ని పార్టీల మద్దతు ఉంటుంది. ప్రస్తుతానికి ఏ సినిమా చేయడం లేదు. ఈ సినిమా పూర్తయ్యాకే వేరొకటి మొదలుపెడదాం అనుకుంటున్నా. ఎక్స్పరిమెంటల్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలనుకుంటున్నా”.

శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో – రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న‌ ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. ఓ. : జీ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జ‌య‌శంక‌ర్‌ ; రచన – ద‌ర్శ‌కత్వం : సంజ‌య్ శేరి.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

7 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago