‘బ్యూటీ’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

త్రిబాణదారి బార్బరిక్ అంటూ ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీతో వానరా సెల్యూలాయిడ్ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అవుతోంది. ఈ బ్యానర్ మీద పలు ప్రాజెక్టులు ఇప్పుడు సెట్స్ మీదున్నాయి. ఈ క్రమంలోనే వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘బ్యూటీ’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహించిన ‘బ్యూటీ’ చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు. ఈ సినిమాకు బి.ఎస్. రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటించారు.

తాజాగా ‘బ్యూటీ’ అనే టైటిల్‌ను ప్రకటించడంతోపాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. మోషన్ పోస్టర్‌లో చూపించిన బీచ్, రోడ్డు, ఇళ్లు..ఆ తరువాత చివర్లో హీరో హీరోయిన్లను రొమాంటిక్‌గా చూపిస్తూ టైటిల్‌ను చూపించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ మోషన్ పోస్టర్‌ను చేస్తుంటేనే విజువల్స్, ఆర్ఆర్ ఎలా ఉండబోతున్నాయో అర్థం అవుతోంది. యూత్ ఆడియెన్స్‌కు కిక్కిచ్చేలా ఉన్న ఈ పోస్టర్‌ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేయడం ఖాయం.

ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం వంటి హిట్ చిత్రాల్లో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న అంకిత్ కొయ్య, బ్యూటీలో సోలో లీడ్‌గా అందరినీ మెప్పించేలా ఉన్నారు. ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా పని చేస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్షన్‌: బేబీ సురేష్‌ భీమగాని, ఎడిటింగ్‌: ఎస్‌బి ఉద్ధవ్‌. ఈ ఏడాదిలో రాబోతోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘బ్యూటీ’ కూడా ఒకటి కానుంది.

తారాగణం: అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర, నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా తదితరలు

సాంకేతిక సిబ్బంది
రచయిత , దర్శకుడు: వర్ధన్
నిర్మాతలు: అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్
బ్యానర్లు: వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్, మారుతీ టీమ్ ప్రొడక్ట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఎస్. రావు
DOP: శ్రీ సాయి కుమార్ దారా
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటర్: SB ఉద్ధవ్
ఆర్ట్ : బేబీ సురేష్ భీమగాని
PRO: సాయి సతీష్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago